23.2 C
New York
Tuesday, September 21, 2021

జనసేన పార్టీ ఎంత బలమైనదో తన లక్ష్యాల ద్వారా చూపించిన పవన్ కళ్యాణ్

‘‘నా కట్టె కాలేవరకూ ప్రజల్లోనే ఉంటా.. ప్రజలతోనే ఉంటా.. అవసరమైతే నేను ఒక్కడ్నే.. ఒక్కడ్నే.. కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో చూస్తాను. జనసేన పార్టీ ఎంత బలమైనదో నా లక్ష్యాల ద్వారా చూపించాను. అరె.. ఇంత మాత్రం కసి.. ఇంతమాత్రం పౌరుషం లేకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఎగరేసి తీరుతాను.. రాజకీయాల్లోనే ఉంటాను”అని పవన్ కళ్యాణ్ మరోసారి కుండబద్దలు కొట్టేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది అనుకున్న మాట.. ‘పవన్ కళ్యాణ్ ఏంటి? పాలిటిక్స్ ఏంటి? అసలు రాజకీయం చేయడం వచ్చా?’ అని అనుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఐదేళ్ల పాటు పెద్దగా యాక్టివ్‌గా లేరు. మధ్యమధ్యలో అమరావతి, ఉద్ధానం కిడ్నీ సమస్యల వంటి అంశాల్లో ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించినా.. అంత ప్రతిఘటన రాలేదు. అయితే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తే.. ‘ఈ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణేనా?, మొత్తం రాటు దేలినట్టున్నాడు.’ అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ పరిపాలన మీద ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత మీద పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహించిన లాంగ్ మార్చ్ రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనానికి దారి తీసింది. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని ప్రభుత్వం కూడా అధికారికంగా అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత తెలుగు భాష, ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని మీద ప్రభుత్వం తమ పని తాను సమర్థించుకున్నా… జనసేనానికి ఘాటుగానే కౌంటర్లు ఇస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ‘జగన్ మతం’ అంశం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందిస్తున్నా.. పవన్ ట్వీట్ల ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తుంది. తాజానా కరోనా రెండవ దశలో ఉండగా ఇప్పుడు 10వ తరగతి పరీక్షల పేరుతో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడతారా.? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పవన్ చేసిన ట్వీట్ సంచనమైంది. ఓ రకంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను లైట్ తీసుకున్న జగన్ మోహన్ రెడ్డిని.. తన ట్వీట్ల ఫైట్‌తో స్పందించే స్థితికి తీసుకొచ్చారు. తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ రాటు దేలారా? లేకపోతే తనదైన రాజకీయాన్ని ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారా?

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!