21.9 C
New York
Tuesday, September 28, 2021

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీని బలోపేతం చెయ్యడం మీద దృష్టి పెట్టారు. తెలంగాలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అయితే, పాత 10 జిల్లాల ప్రాతిపదికన కొత్తగా ఇన్ చార్జిలను నియమించారు. ఈ నేపథ్యంలో తన సినిమాకు నిర్మాతగా ఉన్న రామ్ తాళ్లూరికి కూడా పదవి దక్కింది. టాలీవుడ్ సినీ నిర్మాత రామ్ తాళ్లూరిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ చార్జిగా నియమిస్తున్నట్టు జనసేన తెలంగాణ విభాగం తాజాగా ట్విటర్ ద్వారా ఒక ప్రకటనని విడుదల చేసింది. ‘ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ గా ప్రముఖ వ్యాపారవేత్త, సేవాదృక్పథం కలిగిన రామ్ తాళ్లూరిని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రామ్ తాళ్ళూరి, గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర నాయకులుగా, జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్ తాళ్లూరికి అదనపు బాధ్యతలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ పదవిని ఇచ్చి, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పవన్ కళ్యాణ్ తెలియజేసారు.’ అని ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ విభాగం తెలియజేసింది. రామ్ తాళ్లూరికి సినిమా నిర్మాతగా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఆయన గతంలో రవితేజ హీరోగా నేల టికెట్, డిస్కో రాజా సినిమాలను నిర్మించారు. ఆది హీరోగా చుట్టాలబ్బాయి సినిమాకు నిర్మాతగా ఉన్నారు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా కిన్నెర సాని సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. వీటన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పట్టాలెక్కబోతున్న సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాతకావడం విశేషం. ఇదిలా ఉంటె ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ గా ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు ఆకుల సుమన్‌ను నియమిస్తున్నట్టు జనసేన పార్టీ తెలియజేసింది. వరంగల్ జిల్లా జనగామ పట్టణంలో జన్మించిన ఆకుల సుమన్ అమెరికాలో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలను స్థాపించి మంచి వ్యాపారవేత్తగా విజయం సాధించారు. ప్రస్తుతం అమెరికా నుండి వరంగల్ తిరిగివచ్చి పవన్ కళ్యాణ్ స్పూర్తితో తాను జన్మించిన వరంగల్ జిల్లాకు సేవ చేయాలని జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. ఆకుల సుమన్ తండ్రి న్యాయమూర్తిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆకుల ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!