23.3 C
New York
Friday, September 17, 2021

పబ్లిసిటీ కోసం కాదు ప్రజా సేవ కోసమే జనసేన

జనసేన పార్టీకి చెందినవారు కార్యకర్తలు కాదు జనసైనికులు అని అనేకసార్లు రుజువైంది.. కరోనా బాధితుల్ని ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసైనికులు అనేక మంది తమ వంతుగా స్వచ్చందంగా సేవలు అందిస్తున్నారు.. నెల్లూరుకు చెందిన జనసేన నాయకులు కిశోర్,  తోటి జనసైనికులతో కలిసి కోవిడ్ ఐసోలేషన్ లో ఉన్న పేదలకి  గత పది రోజులుగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు 

ఇటు తూర్పు గోదావరి జిల్లాలో సైతం జనసేన నాయకులు ఆనందరాజు తమ వంతుగా బాధితులకు సేవలందిస్తున్నారు.. రాజోలు మండలం చింతపల్లిలో కరోనా బారిన పడిన కుటుంబాలకి నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు, పండ్లు, మాస్కులు అందజేశారు.. స్థానిక జనసైనికులు ఆయనకి సహకరించి బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. 

రాజమండ్రి, అనపర్తి, కాకినాడ ప్రాంతంలో జనసైనికుడు సంపత్ ద్రాక్షారామ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి చేస్తున్నారు.. కరోనా కాలంలో తమకు చేతనైనంత సహాయం చేస్తున్నారు పవన్ అభిమానులు.. అయితే వారందించిన సేవలన్నీ మీడియాలో రాకపోవచ్చు.. కానీ సేవ చేసిన తరువాత లభించే తృప్తి మార్కెట్లో కొంటె దొరికేది కాదు.. కరోనా బాధితులకి నేరుగా గ్రౌండ్లో ఉండి సేవలందించే వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు కోవిడ్ నిబంధనలు  కఠినంగా పాటిస్తే..అది కూడా సేవలోకి వస్తుంది.. SO.. Stay home, Stay safe and Serve Safe

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles