14.6 C
New York
Saturday, September 25, 2021

మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరితే..?

‘‘తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. అవునండీ.. ఇప్పుడు జనసైనికుల నోటా ఇదే మాటా బలంగా వినబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? నిజంగానే పవన్ కు చిరంజీవి మద్దతిస్తారా?  తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..? త్వరలోనే చిరు జనసేనలో చేరబోతున్నారా..? వచ్చే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? క్రియాశీలకంగా జనసేనలో భాగమవుతారా?  ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ‘మెగాస్టార్ చిరంజీవి..’ తెలుగు సినీ ప్రపంచంలో మోగిపోయే పేరు ఇది. వ్యక్తిగా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయిన మేరునగ పర్వతం. ‘చిరంజీవి’ అప్రతిహత ప్రయాణం ఎందరికో ఆదర్శమయం. పదేళ్ల గ్యాప్ ఇచ్చి సినిమాల్లోకి వచ్చినా అదే క్రేజ్.. అదే ఇమేజ్.. బాక్సాఫీస్ వద్ద ఆయన స్థాయి కలెక్షన్లే. మరెవరికీ సాధ్యం కానిదిది. బిగ్ బాస్ 4 ఫైనల్ లో.. ‘ఇండస్ట్రీకి బిగ్ బాస్’, ‘వరుసగా సినిమాలు చేస్తున్నారు.. మళ్లీ రూలింగ్ స్టార్ట్స్’.. అని ఆయన సమకాలీకుడు నాగార్జున అన్న మాటలే ఇందుకు నిదర్శనం. సినిమాల్లో చిరంజీవికి ఉన్న ఇంతటి ఆదరణ పాలిటిక్స్ దక్కలేదు. రాజకీయాలు వదిలి వరుసగా సినిమాలు చేస్తున్న చిరంజీవిపై ఇప్పుడు మళ్లీ రాజకీయ ముద్ర పడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముందున్న ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం.. సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట నడవడమే. జనసేన పార్టీలో చిరంజీవి అధికారికంగా చేరతారా.? లేదా.? అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా ఇద్దరి ఆలోచనలు వేరు. మేమిద్దరం కలిసి రాజకీయంగా ప్రయాణించడం కుదరకపోవచ్చు. కానీ, మా లక్ష్యం మాత్రం ఒకటే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. అసలు రాజకీయాలపై ఒకప్పటి ఆసక్తి ఇప్పుడు నాకు లేదు. కానీ, నా తమ్ముడికి నా ఆశీస్సులు వుంటాయి. రాజకీయంగా ఉన్నత స్థానానికి నా తమ్ముడు చేరుకోవాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడి పట్టుదల నాకు తెలుసు. వాడు తప్పకుండా విజయం సాధిస్తాడు.. కోరుకున్నది దక్కించుకుంటాడు..’ అంటూ గతంలోనే చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చిరంజీవిపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా చిరంజీవికి ప్రతిపాదనలు వస్తున్నాయట.. రాజ్యసభ పదవి విషయమై. దాంతో, చిరంజీవి ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చలు సోషల్ మీడియాని షాక్ చేస్తున్నాయి. చిరంజీవి వైపు నుంచి మాత్రం, అదంతా ట్రాష్.. అనే సంకేతాలు వస్తున్నాయి. అసలేం జరుగుతోంది.? అనే విషయాన్ని పక్కన పెడితే, మెగా ఫ్యాన్స్ మాత్రం.. అన్నదమ్ములిద్దరూ రాజకీయంగా ఒక్కటవ్వాలనే కోరుకుంటున్నారు. చిరంజీవి గనుక, జనసేన వైపుకు వెళితే.. ఈసారి బలం అనూహ్యంగా పెరగబోతోంది జనసేన పార్టీకి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, 2 తెలుగు రాష్ట్రాలు.. 2 వేర్వేరు పరిస్థితులు. ఇలాంటప్పుడు, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వుంటేనే మెగా కాంపౌండుకి మంచిదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏమో, చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రానున్న రోజుల్లో వేచి చూడాల్సిందే.!

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!