22 C
New York
Wednesday, September 22, 2021

వైస్సార్ లాగే వైస్ జగన్ కూడా నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయడు…. దానికి ఇదిగో.. సాక్ష్యం

ఏపీలోని 135 నామినేటెడ్ పదవుల్లో సమన్యాయం.! ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం ఉందా.? ప్రభుత్వంలో అందరికి సమాన న్యాయం దక్కుతుందా.? పని చేసే వారికే పదవులు దక్కుతున్నాయా.? మహిళ సాధికారతను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారా.? ఇది సంక్షేమ ప్రభుత్వమా.? వీటన్నింటికి ఒక్కటే సమాధానం.. అవును.!అవును ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం ఉంది.. ప్రభుత్వంలో అందరికి సమాన న్యాయం దక్కుతుంది.. పని చేసే వారికే పదవులు దక్కుతున్నాయి.. మహిళ సాధికారతను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారు.. అంతే కాదు మహిళలకు సమన్యాయం కల్పించడంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అవును జగన్ ప్రభుత్వం.. సంక్షేమ ప్రభుత్వం..అవును ఇది అక్షరాల నిజం. జగన్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేస్తున్నాడు. నవరత్రాలను ప్రజలకు అందిస్తున్నాడు. కేవలం హామీ ఇచ్చినవే కాదు.. అనుక్షణం ప్రజలకు ఏది మంచిదో ఆలోచిస్తూ వినూత్న పథకాలు.. విధాన నిర్ణయాలు తీసుకుంటూ అందరికి పథకాలను.. ప్రభుత్వ పాలనను ప్రజల చెంతన ఉంచుతున్నాడు. ఇక ప్రభుత్వ పాలనలో కూడా మహిళలకు కీలక పదవులు అందించాడు..మహిళల కోసం.. వారి రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు జగన్ తన ప్రచారంలో.. పార్టీ కోసం.. ప్రజల కోసం పని చేసే వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని.. పని చేసే వారిని గుర్తిస్తామని చెప్పారు.. సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారు.. పార్టీ కోసం.. ప్రజల కోసం పని చేసే వారికి.. వారు మరింత చేరువగా ప్రజలకి సేవ చేయడానికి కీలక పదవులు అప్పగించారు. కొందరికి చట్ట సభల్లోకి వెళ్లే స్థానం కల్పించగా మరికొందరికి వివిధ నామినేటెడ్ పోస్టులో కూర్చోబెట్టారు.తాజాగా జూలై 17న ఏపీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. ఆంద్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాకి నామినేటెడ్ పదవులు వచ్చేలా మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చి సమన్యాయాన్ని కల్పించారు. ఇదే చెప్తుంది.. జగన్ ప్రభుత్వం మహిళ సాధికారతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.! ఇదే చెప్తుంది జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని కల్పిస్తుందని.!విధి నిర్వహణలో సక్రమంగా పని చేసిన వాలంటీర్ కి, తమ వృత్తిని నిర్వహిస్తూ.. పలువురికి తమ వృత్తిని పంచుతున్న వ్యక్తులకు.. ఆయా అంశాల్లో అవగాహన ఉన్న వ్యక్తులకు.. వికలాంగులుగా ఉన్న వారికి.. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించి, దేనికి ఎవరు అయితే సరిగ్గా పని చేస్తారో తెలుసుకుని.. అభిప్రాయాలను సేకరించి.. ఎక్కడ ఎటువంటి మచ్చ రాకుండా పని చేసే సాధారణ వ్యక్తులకు.. ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేసే అవకాశం కల్పించాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇలా ఒకటి రెండు కాదు తను చేసే ప్రతి పని ప్రజల కోసం చేస్తూ.. ప్రతి పనిలో సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. రాజకీయ నాయకుడిగా కాకుండా.. నాయకుడిగా.. ప్రజా నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు.. ysrcp అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి.!

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!