12 C
New York
Friday, September 30, 2022

03rd July 2021 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day|Shri Tv Wishes

జూలై 3 మీ పుట్టిన రోజా?: రోజు మీతో పాటు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1  హర్భజన్‌ సింగ్‌

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించిన   హర్భజన్ సింగ్ రోజే పుట్టారు .1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు.   2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్బోర్డర్ ట్రోఫి జట్టులో పిలవబడ్డాడు. సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  హర్భజన్ సింగ్ భారత్ తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. 2016లో చివరిసారిగా భారత జాతీయ జట్టు తరుపున ఆడాడు. తన సుదీర్ఘ  క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పి  సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. పలు యాడ్‌ ఫిల్స్మ్‌ కోసం కెమెరా ముందుకొచ్చిన హర్భజన్ సింగ్.. ఈసారిఫ్రెండ్ షిప్అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.  

2  ఎస్. వి. రంగారావు


తెలుగు సినిమా చరిత్రంలో ఎప్పటికి నిలిచేపోయే పేరుతెలుగు వెండితెర పై వెలిగిన విశ్వ నట చక్రవర్తి, తన నట విశ్వరూపంతో హీరోల కన్నా కూడా, ఎక్కువ పేరు సంపాదించిన మహానటుడు రంగరావు గారు పుట్టిన రోజు రోజు. ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత.  1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశాడు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రంగారావు గారు రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు

పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. విలక్షణ నటుడుగానే కాక నాది ఆడజన్మే, సుఖదుఃఖాలు, చదరంగం, బాంధవ్యాలు అనే నాలుగు చిత్రాల నిర్మాతగా,  వాటిలో చదరంగం, బాంధవ్యాలు చిత్రాల దర్శకుడిగా , ఆఫ్రోఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డు విన్నర్ గా, విశ్వనటచక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నట సింహ ఇత్యాది బిరుదాంకిత కీర్తి ప్రతిష్టలతో అలరారిన అలనాటి మేటి ఎస్వీ రంగారావు గురించి ఎంత చెప్పినా తక్కువే.
 
3  ఛోటా కే నాయుడు


టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కెమెరామెన్లలో ఒకరైన ఛోటా కే నాయుడు రోజే జన్మించారు. ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి.అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట.  ‘మాస్టర్, చూడాలని వుంది, అన్నయ్య, డాడీ, ఠాగూర్, అంజి, స్టాలిన్, శంకర్‌దాదా జిందాబాద్‘ …. ఇలా వరసగా చిరంజీవి సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు. వెలుగు,నీడలను అందంగా తెరపై చూపటంలో తనదైన శైలితో ఆకట్టుకున్న ఆయన మనకున్న అతి కొద్ది మంది ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్స్ లలో ఒకరు. రామ్‌గోపాల్ వర్మదెయ్యంతో వెలుగులోకి వచ్చిన నాయుడు అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోలకు పని చేయటం విశేషం. ఇండస్ట్రీలో కూడా ఆయన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక సీనియర్ గా దర్శకుడితో సమానంగా గౌరవం అందుకుంటున్నారు ఆయన. ఆయన డెడికేషన్ కి పెట్టింది పేరు అని దర్శకులు చెబుతారు. ఇండస్ట్రీలో సీనియర్ పనితనాన్ని మెచ్చని హీరోనే ఉండరు. నిర్మాతలకు డార్లింగ్ సినిమాటోగ్రాఫర్. సెట్స్ లో తను అందరితో ఎంతో జోవియల్ గా ఉంటారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నిర్మాతలు చెబుతారు. ఛోటా. కె ఎనర్జీ చూసి హీరోయిన్లు సైతం ఎంతో ముచ్చట పడుతుంటారు.

 4  డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ 


రోజు బీజేపీ పార్టీ తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కూడా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ లోని పి.సి. సెంటర్ నుండి ఎం.ఎస్సీ, జియోలజీ శాఖలో పిహెచ్.డి. పూర్తిచేశాడు.యూనవర్శిటీలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరాడు. 1980లో బిజెపిలో చేరి, హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి, 1995 నుండి 1999 వరకు హైదరాబాద్ బిజెపి శాఖకు అధ్యక్షులుగా పనిచేశాడు. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2016 నుండి 2020 మార్చి 10వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. కష్టపడే తత్వం ఉన్న నాయకుడుగా ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది

5  ఎమ్. ఎస్. రామారావు


మన తెలుగువాళ్ళకుసుందరకాండపేరు వింటేనే గుర్తుకు వచ్చేది శ్రీ ఎమ్. ఎస్. రామారావు గారు. ఆయన పుట్టిన రోజు రోజు. వీరు పాడిన పూర్తి సుందరకాండను ఆకాశవాణి వారు 19 వారాలపాటు ప్రసారం చేశారు. అలాగే తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అలాగే ఆయనకు మరో క్రెడిట్ ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. చిత్రంలో హీరో పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు.  

 6 టామ్‌ క్రూజ్‌


  ఎలాంటి డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్లు చేసే అతి కొద్దిమంది హీరోల్లో హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ ఒకరు. ఆయన మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌ చూస్తే, నోరెళ్లబెట్టాల్సిందే. అతి పెద్ద కట్టడమైన బుర్జ్‌ ఖలీఫాను అమాంత ఎక్కేశారు. ఆయన ఇదే రోజున పుట్టిన రోజు జరుపుకుంటన్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని ఫాలో అయ్యేవారికిమిషన్‌ ఇంపాజిబుల్‌సిరీస్‌ గురించి తెలిసే ఉంటుంది. ‘మిషన్‌ అసాధ్యంఅనేది టైటిల్‌ అర్థం. నిజమే.. ఇందులో హీరోకి ఏదీ అసాధ్యం కాదు. దాన్ని నమ్మే ఇరవయ్యేళ్లుగామిషన్‌ ఇంపాజిబుల్‌సిరీస్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు టామ్‌ క్రూజ్‌. 1996లో వచ్చిన తొలి చిత్రం మొదలుకొని ఇప్పుడు రెడీ అవుతున్న  ఏడవ చిత్రం వరకూ టామ్‌క్రూజే హీరోగా నటించారు. వాటిలో ఈథన్‌ హంట్‌ అనే గూఢచారి పాత్రలో నటింటిన టామ్‌ తన పోరాటాలు, సాహసాలతో యాక్షన్‌ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌ చిత్రాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడం గమనార్హం.  టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలో మరో పెద్ద సాహసానికి సిద్ధమవుతున్నారట . అదేంటో తెలుసా? అంతరిక్షంలో అవునండీ నిజ్జంగా అంతరిక్షంలోనే సినిమా షూటింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అలాంటి గొప్ప స్టార్ పుట్టిన రోజునే మీరు పుట్టారు

7 జులియన్ అసాంజే

తన లీక్స్‌తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టి ,అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే కూడా రోజే పుట్టారు. వికిలీక్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడమే కాదు అగ్రరాజ్యం అమెరికాను వణికించిన  జూలియన్ అసాంజే కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అమెరికా రహస్యాలు బయటపెట్టడమే కాకుండా గూఢచర్య చేశారని అతనిపై గుర్రుగా ఉంది దేశం. 2010లో ఆప్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గూఢచర్యం ఆరోపణలపై ఆయనను బ్రిటన్‌ నుంచి అమెరికాకు రప్పించేందుకు యత్నిస్తోంది. అగ్ర రాజ్యాలకు చెందిన అనేక కుంభకోణాలను బయటపెట్టారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి అగ్రదేశాలు ప్రయత్నించగా ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో దాదాపు ఏడేండ్ల పాటు తలదాచుకున్నారు. అనంతరం ఆయనను నిర్బంధించి లండన్‌జైలుకు తరలించారు. ప్రస్తుతం అసాంజే అత్యాచార ఆరోపణలపై బ్రిటీషు జైలులో శిక్ష పొందుతున్నారు. అమెరికా మాత్రం అసాంజేను తమ దేశానికి రప్పించుకునే విషయమై ప్రయత్నాలు ప్రారంభించింది.  

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

Related Articles

Stay Connected

0FansLike
3,507FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!