22.1 C
New York
Sunday, June 26, 2022

14th March 2022 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day

14th March 2022 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day | Shri Tv Wishes

మార్చి 14  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.     K. V. Mahadevan   : ‘లవకుశ’, ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘శ్రుతిలయలు’, ‘పెళ్ళి పుస్తకం’, ‘సప్తపది’, ‘స్వాతికిరణం’ ‘ముత్యాల ముగ్గు’ లాంటి క్లాసిక్ సినిమాలకు సంగీతం అందించిన స్వర బ్రహ్మ కె.వి.మహదేవన్‌ పుట్టిన రోజు నేడు. మహదేవన్‌ అసలుపేరు కృష్ణన్‌ కోయిల్‌ వెంకటాచలం భాగవతార్‌ మహదేవన్‌. పుట్టింది మార్చి 14, 1918లో వూరు కేరళ సరిహద్దులో వుండే కృష్ణన్‌ కోయిల్‌. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు, నాటకాల మీద ఆసక్తితో కొన్ని నాటకాల్లో నటించారు. 1948లో దేవదాసి అనే సినిమాకు తొలిసారిగా సంగీతం అందించారు ఆ తర్వాత ‘కుమారి’,  ‘రాజేశ్వరి’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘బొమ్మలపెళ్లి’, ‘ముందడుగు’,  ‘మంచిమనసులు’, ‘ప్రైవేటు మాస్టారు’,  ‘విచిత్రబంధం’,  ‘సిరిసిరిమువ్వ’,  ‘ముత్యాలముగ్గు’, ‘సిరివెన్నెల’, ‘సప్తపది’, ‘ప్రేమనగô’Â, ‘దసరా బుల్లోడు’, ‘తోడూ-నీడా’, ‘దాగుడుమూతలు’, ‘చెల్లెలి కాపురం’, ‘జీవనజ్యోతి’, ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అడవిరాముడు’, ‘బుద్ధిమంతుడు’, ‘సాక్షి’, ‘గోరంత దీపం’, ‘అందాలరాముడు’, ‘పెళ్ళిపుస్తకం’, ‘గడుసుపిల్లోడు’, ‘శ్రుతిలయలు’, ‘శుభలేఖ’, ‘శుభోదయం’, ‘మంగమ్మగారి మనవడు’, ‘మాపల్లెలో గోపాలుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘మువ్వ గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘ముద్దుల మామయ్య’, ‘సంపూర్ణ రామాయణం’, ‘వీరాభిమన్యు’, ‘ఏకవీర’లాంటి ఎన్నో సినేమ్లకు సంగెతం అందించి తెలుగు సినిమా మీద తనదైన ముద్ర వేసారు. తన కెరీర్లో వివిధ భాషల్లో కలిపి దాదాపు సుమారు ఆరువందల ఎనభై చిత్రాలకు సంగీతం దర్శకుడిగా పని చేసారు. 1967లో కేంద్రప్రభుత్వం ఉత్తమ సంగీత దర్శకుడు బహుమతి ప్రవేశపెట్టినప్పుడు తొలి బహుమతి అందుకున్నది ‘కందన్‌ కరుణై’ చిత్రానికి మహదేవనే. తరవాత 1980లో ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది.

2.       Aamir Khan   : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పుట్టిన రోజు ఈరోజు. అమీర్‌ ఖాన్‌ బొంబాయిలో సినిమా నిర్మాత తాహిర్‌ హుస్సేన్, ఆయన భార్య జీనత్‌ హుస్సేన్‌లకు 1965 మార్చి 14న జన్మించాడు. అమీర్‌ ఖాన్‌ అసలు పేరు మహమ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ ఖాన్‌.  ‘యాదోన్‌ కి బారాత్‌’, ‘మద్‌ హూష్‌’ అనే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో కూడా నాటకాలలో నటించాడు  ‘మంజిల్‌ మంజిల్‌’, ‘జబర్దస్త్‌’ సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్‌ చేశాడు.  ‘కయామత్‌ సే కయామత్‌ తక్‌’ సినిమాతో నటుడిగా స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత ‘లవ్‌ లవ్‌ లవ్‌’, ‘అవ్వల్‌ నెంబర్‌’, ‘తుం మేరె హో’, ‘దీవానా ముజ్‌ సా నహి’, ‘జవానీ జిందాబాద్‌’, ‘దిల్‌’, ‘దిల్‌ హై కే మాన్‌ తా నహి’, ‘జో జీతా వోహి సికందర్‌’, ‘హమ్‌ హై రాహి ప్యార్‌ కే’, ‘రంగీలా’, ‘అందాజ్‌ అప్నా అప్నా’,  ‘ఇసి కా నామ్‌ జిందగీ’, ‘దౌలత్‌ కి జంగ్‌’,  ‘రాజా హిందుస్తానీ’, ‘ఇష్క్‌’, ‘గులాం’, ‘సర్ఫరోష్‌’,‘లగాన్‌’, ‘దిల్‌ చాహతా హై’,  ‘మంగళ్‌ పాండే: ద రైజింగ్‌’, ‘రంగ్‌ దే బసంతి’,  ‘ఫనా’,’గజినీ’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘ధూమ్‌ 3’, ‘తలాష్‌’, ‘పీకే’, ‘దంగల్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’,  ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’సినిమాల్లో నటించి నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. అమీర్‌ ఖాన్‌ ‘సత్యమేవ జయతే’ అనే టాక్‌ షోతో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు.తన కెరీర్లో అమీర్ ఖాన్ నాలుగు నేషనల్ అవార్డ్స్, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఆయన నటనకు ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. ఈయనకు 2003లో పద్మశ్రీ,  2010లో పద్మ భూషణ్ అవార్డ్స్ వచ్చాయి.

3.       Rohit Shetty   : బాలీవుడ్ లో భారి యాక్షన్ చిత్రాలు తీసిన డైరెక్టర్ గా మంచి పేరు తేచ్చుకున్న రోహిత్ శెట్టి పుట్టినరోజు ఈరోజు. ఈయన మార్చి14, 1973లో ముంబైలో జన్మించారు. 2003లో వచ్చిన బాలీవుడ్ సినిమా జామీన్ తో డైరెక్టర్ పరిచయమయ్యారు. ఆ తర్వాత గోల్మాల్ ఫన్ అన్ లిమిటెడ్, సండే, గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, సింగం, బోల్ బచ్చన్, చెన్నై ఎక్స్ ప్రెస్, సింగం రిటర్న్స్, దిల్వాలే, గోల్మాల్ అగైన్, సిoబా లాంటి యాక్షన్ సినిమాలు తెసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తీసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాకి బెస్ట్ ఫిల్మ్ గా నిక్లేడోన్ కిడ్స్ ఛాయస్ అవార్డ్స్ ఇండియా ని సొంతం చేసుకుంది. సింగం రిటర్న్స్ సినిమాకి స్టార్ బాక్స్ ఆఫీస్ ఇండియా అవార్డు, బోల్ బచ్చన్ సినిమాకి పవర్ క్లబ్ బాక్స్ ఆఫీస్ అవార్డు, గోల్మాల్ అగైన్ సినిమాకి బెస్ట్ ఫిం అవార్డు సొంతం చేసుకున్నారు.

4.       Sarvadaman D. Banerjee : సర్వదమన్ డి బెనర్జీ ప్రముఖ భారతీయ నటుడు నేడు ఆయన పుట్టినరోజు. ఈయన మార్చి14, 1965లో ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించారు. సర్వదమన్ 1983లో వచ్చిన ఇండియా లోనే మొదట సంస్కృతం సినిమా ఆది శంకరాచార్యతో తన కెరీర్ ని స్టార్ట్ చేసారు. తెలుగులో శ్రీ దత్త దర్శనం, సిరివెన్నల, స్వయంకృషి, లాంటి సినిమాల్లో నటించారు. హిందీలో స్వామి వివేకానంద, MS. ధోని: ద అన్ టోల్డ్ స్టొరీ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సర్వదమన్ ప్రముఖ పురాణ గాధలు అయిన కృష్ణ, అర్జున, ఓం నమః శివాయ, జై గంగా మైయ లాంటి టీవీ సీరియల్స్ లలో నటించారు.

5.       Anuradha Patel   : అనురాధ పటేల్ ప్రముఖ బాలీవుడ్ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ మార్చి14, 1965లో ముంబై లో జన్మించారు. అనురాధ పటేల్ 1983లో వచ్చిన లవ్ ఇన్ గోవా సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఉత్సవ్, పత్తర్, జాన్ కి బాజి, సదా సుహగన్, డ్యూటీ, రుక్సత్, మేరా నసీబ్, జ్యోతి, జెంటిల్మెన్, దీవానే, తుజే మేరి ఖసం, ఐష, రెడీ, రబ్బా మై క్యా కరూ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

6.       Michael Caine: 60 సంవత్సరాలు…130సినిమాలు…ఉత్తమ నటుడిగా ఆస్కార్, బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి ఎన్నోఅవార్డులు ఇదీ హాలీవుడ్ నటుడు మైకేల్‌ కైన్‌ సినీ ప్రస్థానం ఈరోజు ఆయన పుట్టిన రోజు. లండన్‌లో 1933 మార్చి 14న పుట్టిన ఇతడు ఇరవై ఏళ్ల వయసులోనే నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు ఆయన నటించిన ‘జులు’, ‘ఆల్ఫీ’, ‘ద ఇటాలియన్‌ జాబ్‌’, ‘బ్యాటిల్‌ ఆఫ్‌ బ్రిటన్‌’, ‘గెట్‌ కార్టర్‌’, ‘ద లాస్ట్‌ వ్యాలీ’, ‘ద మ్యాన్‌ హూ ఉడ్‌బీ కింగ్‌’, ‘ఎ బ్రిడ్జ్‌ టూ ఫార్‌’, ‘ఎడ్యుకేటింగ్‌ రీటా’, ‘ద డార్క్‌ నైట్‌ ట్రిలాజీ’, ‘ఇన్సెప్షన్‌’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’లాంటి ఎన్నో సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ‘వంద మేటి బ్రిటిష్‌ సినిమాలు’ జాబితాలో ఏడు ఇతడు నటించినవే ఉన్నాయంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.   సినీ రంగంలో ‘బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఐకాన్‌’గా గుర్తింపుతో పాటు, ‘కమాండర్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిస్‌ ఎంపైర్‌’, ‘నైట్‌హుడ్‌’… ఇలా ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అతడి సొంతం అయ్యాయి.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!