16th March 2022 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day | Shri Tv Wishes
మార్చి 16 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1. Potti Sriramulu : శ్రీ పొట్టిశ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధకులు, అయన పేరు తెలవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు, పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆయన దృష్టి జాతీయోద్యమం వైపు మళ్ళింది. ముంబాయిలో విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి శానిటరీ ఇంజనీర్లో డిప్లొమా పొందిన ఆయన ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే’లో ఇంజనీర్‌గా బొంబాయిలో నాలుగేండ్లపాటు ఉద్యోగం చేశారు. ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ‘సీతమ్మ’తో వివాహం జరిగింది. రెండుసంవత్సరాలలోపే పురుటి బిడ్డతో సహా భార్య మరణించటంతో జీవితంపై విరక్తిచెందిన శ్రీరాములు ఉద్యోగాన్ని వదిలేసి శాంతికాముకుడుగా పరిణవించే సమయంలో ‘జలియన్ వాలాబాగ్’ దురం తాలు ఆయనను కలవరపరిచాయి. ‘రౌలత్’ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమంతో శ్రీరాములు ప్రభావితుడై తన శేషజీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయద లచుకొని సబర్మతి ఆశ్రయం చేరుకొని గాంధీజీ అనుచరుడుగా మారారు. గాంధీజీ పూరించిన స్వాతంత్య్రోద్యమ శంఖారావానికి ప్రభావితుడై గాంధీజీ ఆశ్రమంలోని పరివారంలో ప్రధాన సభ్యు డుగా, గాంధీ ఎంపిక చేసుకున్న కొద్దిమంది సర్వోదయ సేవకులలో అగ్రగణ్యుడుగా పద కొండు సంవత్సరాలు నియబద్ధ ఆశ్రమ జీవితం గడిపారు. సహాయ నిరాకరణోద్య మంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కారాగార శిక్షలు కూడా అనుభవించారు. హరిజనులకు ఆలయప్రవేశం మీద చట్టం తేవటానికి నిరాహార దీక్ష చేసి సంచలనం సృష్టించారు. నాటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరానికొక రోజు హరిజన దినోత్సవం గా యావద్భారతదేశమంతటా జరపాలనే, హరిజన సంక్షేమ నిధికై కేంద్ర బడ్జెట్లో కేటాయింపు జరప గలమనీ ప్రకటించడంతో శ్రీరాములు దీక్ష విరమించారు. హిందూ సంఘసంస్కరణ నెలకొల్పి అస్పృశ్యతానివారణ, బాల్య వివా హ నిషేధం, వితంతు వివాహప్రోత్సాహం, మూఢాచార నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రా వతరణకై 1952 అక్టోబర్ 19న శ్రీబులుసు సాంబమూర్తి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష ఒక యజ్ఞంగా నిరంతరంగా 58 రోజులపాటు కొనసాగింది. శ్రీరాములుగారి నిరుప మాన త్యాగ ఫలితంగా ఆయన మరణా నంతరం 1953 అక్టోబరు 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
2. Rajpal Yadav : రాజ్ పాల్ యాదవ్ ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. మార్చి 16, 1971లో ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ లో జన్మించారు. ఢిల్లీ లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత ముంగేరి కి బాయ్ నౌరంగిలాల్ అనే దూరదర్శన్ సీరియల్ లో నటించాడు. అయితే ముంగేరి కి లాల్ హసీన్ సప్నే అనే సీరియల్ లో ఈయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్యార్ తూనె క్యా కియా హంగామా, వక్త్, చుప్ చుప్ కె, గరం మసలా, ఫిర్ హేరా ఫేరి, డోల్ లాంటి సినిమాల్లో బాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన కిక్ 2 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.తన కెరీర్లో దాదాపు 125 హిందీ సినిమాల్లో నటించిన రాజ్ పాల్ యాదవ్ జంగ్లీ సినిమాకు సాన్ సూయ్ స్క్రీన్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ నెగిటివ్ రోల్, మై మాధురి దీక్షిత్ బనానా చాహితి హు సినిమాకు ఉత్తమ నటుడిగా యష్ భారతి అవార్డ్‌లతో పాటు జన్ పద్ రత్నా అవార్డు కూడా గెలుచుకున్నారు.
3. Rannvijay Singh : రన్ విజయ్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ యాక్టర్, వీడియో జాకీ ఈరోజు ఆయన పుట్టిన రోజు. విజయ్ మార్చి 16, 1983లో పంజాబ్ లోని జలంధర్ లో జన్మించారు. ఈయన మొదట టీవీలో వచ్చిన MTV రోడీస్ షో లో పార్టిసిపేట్ చేసి గెలిచాడు. ఆ తర్వాత MTV స్ప్లిట్స్ విల్లా, MTV స్టంట్ మానియా లాంటి షోస్ కి హోస్ట్ చేసారు. 2009లో వచ్చిన హిందీ సినిమా టాస్స్: ఎ ఫ్లిప్ అఫ్ డెస్టినీ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత లండన్ డ్రీమ్స్, యాక్షన్ రిప్లే, ముంబై కటింగ్, 3AM, షరాఫత్ గయీ టెల్ లేనే, లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 2011లో వచ్చిన పంజాబీ సినిమా డర్తి తో పంజాబీ పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ తర్వాత మోడ్, తూర్ మిత్రన్ ది, సాది లవ్ స్టొరీ, ఇష్క్ గరారి లాంటి సినిమాల్లో నటింఛి మంచి పేరు తెచ్చుకున్నారు.
4. Ananya Khare : అనన్య ఖరే ప్రముఖ బాలీవుడ్ నటి, టీవీ యాక్ట్రెస్ నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ మార్చ్16, 1968లో మధ్య ప్రదేశ్ లో జన్మించారు. అనన్య ఖరే మొదట 1984లో వచ్చిన హమ్ లోగ్ అనే టీవీ సీరియల్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి, నిర్మల, కిర్దార్, ఓ మారియ, మూవర్స్ అండ్ షేకర్స్, CID, మేరి మా, పునర్ వివాహ్, యే హై ఆశికి, లాడో2, వో అప్నా స, లాంటి టీవీ సీరియల్స్ లలో నటించారు. ఈవిడ 1994లో వచ్చిన జాలిం సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శూల్, దేవదాస్, చాందిని బర్, ద ఫిలిం, సందీప్ ఆవుర్ పింకీ ఫరార్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
5. Jerry Lewis : కమేడియన్లు చాలా మందే ఉంటారు, కానీ వారిలో ‘కింగ్’ అనిపించుకోవడం కష్టమే. హాలీవుడ్లో ఏకంగా 80 ఏళ్ల సినీ ప్రస్థానంతో ఆ గుర్తింపును సాధించిన నటుడే జెర్రీ లూయిస్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. న్యూజెర్సీలో 1926 మార్చి 16న పుట్టిన ఇతగాడు 1951 నుంచి 1965 మధ్య కాలంలో సోలో కమేడియన్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు ఆయన నటించిన ‘ద నట్టీ ప్రొఫెసర్’, ‘ద డెలికేట్ డెలింక్వెంట్, ‘ద శాడ్ శాక్’, ‘డోన్ట్ గివప్ ద షిప్’, ‘ద బెల్లీ బాయ్’, ‘ద లేడీస్ మ్యాన్’లాంటి ఎన్నో సినిమాల్లో హాస్య నటనతో మెప్పించాడు తన కారేర్లో ఎన్నో గొప్ప అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. ఇతడి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవ చేసి మానవతావాదిగా కూడా పేరు పొందిన ఇతడు. నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రచయితగానే కాకుండా మానవతా వాదిగా కూడా పేరు సంపాదించాడు.
6. Bernardo Bertolucci : ఓ మంచి సినిమా చూస్తే ‘దర్శకుడు ఎవరు?’ అని తెలుసుకుని మరీ గుర్తు పెట్టుకుంటారు సినీ అభిమానులు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో మరుపురాని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇటలీకి చెందిన దర్శకుడే బెర్నార్డో బెట్రొలూసి ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఇటలీలో 1941 మార్చి 16న పుట్టి రోమ్‌లో జన్మించారు. కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు, ఇరవై రెండేళ్లకే మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారి తన కెరీర్లో ‘లిటిల్ బుద్ధ’, ‘ద లాస్ట్ ఎంపరర్’, ‘ద కన్ఫర్మిస్ట్’, ‘లాస్ట్ ట్యాంగో ఇన్ ప్యారస్’, ‘ద షెల్టరింగ్ స్కై’, ‘స్టీలింగ్ బ్యూటీ’, ‘ద డ్రీమర్స్’ లాంటి సినిమాలతో అంతర్జాతీయంగా గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు, రెండు ఆస్కార్ అవార్డులతో పాటు కేన్స్ చిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మకమైన ‘పామె డిఓర్’ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు.
ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు