12 C
New York
Friday, September 30, 2022

18th March 2022 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day

18th March 2022 : Happy Birthday to You | Legends And Celebrities Who Born on This Day | Shri Tv Wishes

మార్చి 18  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1.       Shashi Kapoor   : శశి కపూర్ అలనాటి బాలీవుడ్ నటుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. శశికపూర్‌ అసలు పేరు బలవీర్‌ రాజ్‌ పృథ్వీరాజ్‌ కపూర్‌. 18, మార్చి 1938న కలకత్తాలో జన్మించారు శశికపూర్‌ తండ్రి స్థాపించిన ‘పృథ్వీ థియేటర్స్‌’ తరపున తన నాలుగవ యేటనుంచే నాటకాల్లో వేషాలు వేసేవారు బాల నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. 1961లో తొలిసారి ‘ధర్మపుత్ర’లో హీరోగా చేసారు ఆ తర్వాత ‘ధర్మపుత్ర’, ‘చార్‌ దివానీ’, ‘ప్రేమపుత్ర’, ‘వఖ్త్‌’, ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’, ‘చార్‌ దివనీ’, ‘మెహందీ లగీమేరే హాత్‌’,  ‘మోహబ్బత్‌ ఇస్కో కెహతే హై’, ‘నీంద్‌ హమారీ ఖ్వాబ్‌ తుమ్హారే’, ‘రూఠా న కరో’, ‘హసీనా మాన్‌ జాయెగీ’, ‘దిల్‌సే పుకారా’, ‘కన్నాదాన్‌’, ‘ప్యార్‌కా మౌసం’, ‘అభినేత్రి’, ‘సత్యం శివం సుందరం’, ‘చోరీ మేరా కాం’, ‘దీవార్‌’, ‘కభి కభి’, ‘త్రిశూల్‌’ సినిమాలతో నటుడిగా బాలీవుడ్ పై చెరగని ముద్ర వేసాడు. శశి కపూర్ హిందీ సినిమాల్లోనే కాకుండా  ‘ది హౌస్‌ హోల్డర్‌’,  ‘షేక్స్పియర్‌-వాలా’ , ‘బాంబే టాకీ’ , ‘సిద్ధార్థ’, ‘హీట్‌ అండ్‌ డస్ట్‌’,  ‘సమ్మీ అండ్‌ రోసీ గెట్‌ లైడ్‌’, ‘ది డిసీవర్స్‌’, ‘ఇన్‌ కస్టడీ’, ‘జిన్నా’, ‘సైడ్‌ స్ట్రీట్స్‌’, ‘గలివర్స్‌ ట్రావెల్స్‌’ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు తన కెరీర్లో మొత్తం 116 సినిమాల్లో నటించిన శశి కపూర్ ఆ తర్వాత నిర్మాతగా మారి ‘జునూన్‌’,  ‘కలియుగ్‌’, ‘విజేత’, ‘36-చౌరంఘీ లేన్‌’ ‘ఉత్సవ్‌’ సినిమాలు చేసారు తనే దర్శకుడిగా మారి ‘అజూటా’ అనే సినిమా కూడా తీసి ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. .  2014లో ఈయనకు ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించింది.

2.       Sushanth            : ‘కాళిదాసు’గా తెరప్రవేశం చేసి… ‘కరెంట్‌’తో తెలుగు సినిమా పరిశ్రమని తన ‘అడ్డా’గా మార్చుకున్న నటుడు సుశాంత్‌. అక్కినేని వారసుల్లో ఒకరిగా పరిచయమైన ఈయన ‘చి.ల.సౌ’తో తన పంథాని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కూతురైన… అక్కినేని నాగసుశీల, అనుమోలు సత్యభూషణరావు దంపతులకి జన్మించాడు సుశాంత్‌. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఎలెక్టిక్రల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన యునైటెడ్‌ టెక్నాలజీస్‌లో ఎలెక్టిక్రల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం కూడా చేశాడు. ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో, తన బావ అయిన నాగచైతన్యతో కలిసి ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2008లో ‘కాళిదాసు’తో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ‘కరెంట్‌’, ‘అడ్డా’, ‘ఆటాడుకుందాం రా’ సినిమాలు చేశారు. ఏదీ ‘దొంగాట’లో ఒక అతిథి పాత్రలో మెరిశారు. 2018లో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో సుమంత్‌ చేసిన ‘చి.ల.సౌ’ హిట్ అయ్యి హీరోగా మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మంచి పాత్ర చేసాడు.

3.       Jai Akash        : ఆనందం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆకాష్ పుట్టిన రోజు ఈరోజు. మార్చి 18, 1981లో జన్మించారు. 1999లో వచ్చిన రోజవనం అనే తమిళ్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు.తెలుగులో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించ డం తో ఆకాష్ కు తొలి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో నీతో చెప్పాలని, మనసుతో, హైటెక్ స్టూడెంట్స్, పిలిస్తే పలుకుతా, వసంతం, ఆనండమాన ద మాయే, అందాల రాముడు, నవ వసంతం, డీ, గోరింటాకు, స్వీట్ హార్ట్, నమో వెంకటేశ, యుగానికి ఒక్క ప్రేమికుడు, విన్, మిస్టర్ రాజేష్, ఆ ఇద్దరూ, దొంగ ప్రేమ లాంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఆకాష్ కేవలం తెలుగులోనే కాకుండా 15 తమిళ్ సినిమాల్లో, ఒక కన్నడ ఒక మలయాళ సినిమాలో కూడా నటించారు. ఆనందం సినిమాకు ఉత్తమ నటుడిగా ఆంధ్రా సినీ అవార్డ్, గోరింటాకు సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు, నవ వసంతం సినిమాకు బెస్ట్ యాక్టర్ గా సంతోషం జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు.

4.       Ratna Pathak      : రత్న పాఠక్ ప్రముఖ భారతీయ నటి నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ మార్చి18,  1957లో ముంబైలో జన్మించారు. రత్న పాఠక్ 1983లో వచ్చిన  మండి అనే హిందీ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత మిర్చి మసాలా, పహేలి, అలడిన్, గోల్మాల్ 3, ఎక్ మే అవుర్ ఎక్ తు, ఖూబ్సురత్, కపూర్ అండ్ సన్స్, నిల్ బట్టే సన్నాటా, లిప్ స్టిక్ అండర్ మై బూర్కా, లవ్ పర్ స్క్వేర్ ఫుట్, తప్పాడ్ లాంటి సినిమాల్లో నటించారు. ఈవిడ సినిమాల్లోనే కాకుండా ఇదర్ ఉధర్, తారా, మస్త్ మస్త్ హై జిందగీ, అప్నా అప్నా స్టైల్, సారాభాయ్ VS సారాభాయ్, సారాభాయ్ VS సారాభాయ్ 2, సెలక్షన్ డే లాంటి టీవీ సీరియల్స్ లలో కూడా నటించారు. రత్న పాఠక్ కి సారాభాయ్ VS సారాభాయ్ సీరియల్ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఇండియన్ టెలీ అవార్డు సొoతం చేసుకున్నారు. లిప్ స్టిక్ అండర్ మై బూర్కా సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా న్యూస్ 18 మూవీ అవార్డు, లండన్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, లాంటి అవార్డ్స్ ని గెలుచుకున్నారు.

5.       Robert Donat      : అతడు కెరీర్లో చేసింది కేవలం 20 సినిమాలే కానీ  ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు…మేటి రొమాంటిక్‌ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు…ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించాడు… ఆ నటుడే రోబెర్ట్‌ డొనట్‌ ఈరోజు ఆయాన్ పుట్టిన రోజు. 1905 మార్చి 18న పుట్టిన ఈయన  ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ సినిమాలైన ‘గుడ్‌బై మిస్టర్‌ చిప్స్‌’ (1939) ‘ద 39 స్టెప్స్‌’తో పాటు, ‘మెన్‌ ఆఫ్‌ టుమారో’, ‘దట్‌ నైట్‌ ఇన్‌ లండన్‌’, ‘క్యాష్‌’, ‘ద ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ హెన్రీ4’, ‘ద ఘోస్ట్‌ గోస్‌ వెస్ట్‌’, ‘ద సిటాడెల్‌’లాంటి సినిమాల ద్వారా ఎంతో పేరుతెచ్చుకున్నాడు.

6.      Queen Latifah     : ‘క్వీన్‌ లతిఫా’… ఈ పేరు వినగానే అమెరికా యూత్ వెర్రెక్కి పోతుంది… సినీ ప్రేక్షకులు, పాప్‌ సంగీత ప్రియులు ఊగిపోతారు. ర్యాపర్‌గా, గాయనిగా, గీత రచయిత్రిగా, నటిగా, నిర్మాతగా చెరిగిపోని ముద్ర వేసిన ఆమె అసలు పేరు డానా ఎలానే ఓన్స్‌ ఈరోజు ఆవిడ పుట్టిన రోజు.  న్యూజెర్సీలో 1970 మార్చి 18న పుట్టిన ఈమె, ఎనిమిదేళ్ల వయసులో అరబిక్‌ పేరైన ‘లతిఫా’ను తన మారు పేరుగా ఎంచుకుంది. లతిఫా అంటే సున్నితమైన, దయతో కూడిన అని అర్థం. అయిదు అడుగుల పది అంగుళాల లతిఫా, బాస్కెట్‌బాల్‌ క్రీడలో రాణిస్తూనే గాయనిగా, నటిగా కూడా మెప్పించి ‘హాలీవుడ్‌ హాల్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌’లో స్థానం సంపాదించింది. లతిఫా అనేది ఆమె తనకు తాను పెట్టుకున్న పేరు. క్వీన్‌ అనేది ఆమె మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ ‘ఆల్‌ హైల్‌ ద క్వీన్‌’ రికార్డులు లక్షల్లో అమ్ముడుపోయాయి. గాయనిగా ఆమె ఆ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ అవార్డు అందుకుంది. ఆమె నటించిన ‘షికాగో’ సినిమా మేటి చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ‘బ్రింగింగ్‌ డౌన్‌ ద హౌస్‌’, ‘ట్యాక్సీ’, ‘బార్బర్‌షాప్‌2: బ్యాక్‌ ఇన్‌ బిజినెస్‌’, ‘బ్యూటీ షాప్‌’, ‘లాస్ట్‌ హాలీడే’, ‘హెయిర్‌ స్పే్ర’లాంటి సినిమాలతో నటిగా ఆకట్టుకుంది. టీవీల్లో అనేక కార్యక్రమాల్లో మెరిసింది. మొత్తం మీద గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్‌ గ్లోబ్, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి అవార్డులెన్నో గెలుచుకుంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,507FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!