21.9 C
New York
Tuesday, September 28, 2021

సినీ చరిత్ర లో పెద్ద ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ కే సీఎం అయ్యే అవకాశం ఎక్కువ…

దేశ రాజకీయాల్లో నాటి నుంచి నేటి వరకు సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు కీలక నాయకులుగా ఉన్నారు. నాడైతే సినిమా వ్యక్తులే ముఖ్యమంత్రులుగా, పార్టీ అధినేతలు గా ఉండి ఓ ఏలిక ఎలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రరాజకీయాలను, ప్రభుత్వాన్ని శాశించారు దివంగత మహానేత, అభిమానుల దేవుడు నటుడు నందమూరి తారకరామారావు. తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన రామారావు విజయం సాధించాడు దీనికితోడు హీరోగా ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం సైతం కలిసి వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో కూడా దిగ్గజ సినిమా ముఖం రాజకీయ అరంగేట్రం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా, భిన్నమైన రాజకీయాలను చేస్తానని చెబుతూ… అధికారం తమ లక్ష్యం కాదు, ప్రజలకు సేవ చేయటం, ప్రజల తరుఫున పోరాడటమే తమ లక్ష్యమంటూ ముందుకు వచ్చిన పార్టీ జనసేన. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రజల తరుఫున పోరాటాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు మంచి సినిమా ఇమేజ్ తో పాటు సామాజికంగా కూడా మంచి ఇమేజ్ ఉంది. సేవ చేయడం , అందరిని కలుపుకుని పోయే తత్వం, ఆపదలో ఉన్న వారిని అదుకోవడం వంటివి పవన్ లో మెండుగా ఉన్నాయి. పవన్ కి సమాజమన్న, ప్రజలకు సేవ చేయడమన్న ఇష్టం. అయితే రాజకీయ నాయకులు ప్రజలకు చేస్తున్న మోసాలను అన్యాయాలను చూసిన పవన్.. రాజకీయ నాయకులను ఎదిరించి, ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించి పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు ఎన్టీఆర్ సైతం ఇంతే చేశారు. కులం లేకుండా సామాజిక స్పృహ, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యానికి గౌరవం, మన సంప్రదాయాలు మరియు సంస్కృతికి రక్షణ, ప్రాంతీయ, ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయకుండా జాతీయత, అవినీతికి వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే పురోగతి వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలను చేసుకుని రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు పవన్. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ పార్టీ పరాజయం చవిచూసింది.. కానీ పవన్ తన పోరాటాన్ని ఆపలేదు. అయితే సినిమాలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే నిలబడగలరా అంటే అవును అనే సమాధానం వస్తుంది. అయితే తెలుగు నేలపై అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు నందమూరి తారకరామారావు మాత్రమే. అయితే పవన్ కూడా అలాంటి వ్యక్తే అయినప్పటికీ ఎన్టీఆర్ లా ముఖ్యమంత్రి అవుతాడా అనేది ప్రశ్న.? అయితే పవన్ పార్టీకి మొదట వచ్చిన పరాజయం చూసి కొందరు పవన్ కి రాజకీయాల్లో మనుడగా లేదని అంటున్నారు.. కానీ అది ముమ్మాటికీ తప్పు అనేది వాస్తవం. పవన్ సిద్ధాంతాలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాయి.. ప్రస్తుతం ఎటువంటి ఎలక్షన్స్ జరిగిన పవన్ పార్టీకి మంచి ఓట్లు వస్తున్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ దాని అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. అయినా కూడా తాము ప్రజాక్షేత్రంలోనే ఉంటామంటూ ప్రకటన చేసి అలానే కొనసాగుతూ ఉన్నారు. ఇసుక కొరతకు వ్యతిరేకంగా జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇదిలా ఉండగా పవన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ప్రజల్లోకి వెళ్ళాడు. రాజకీయ నాయకులు ప్రజలను పూర్తిగా ఓట్లు అంటే డబ్బు అనేలా మభ్య పెట్టారు, దీంతో పవన్ నిలబడిన ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. కానీ పవన్ ఓడింది నోట్ల కట్టల రాజకీయంలో తప్పా, ప్రజల్లో కాదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్  ప్రజల్లో చైతన్యం వచ్చేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఎన్నిక  జరిగిన కూడా జనసేన మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇక ఎన్నికల్లో బరిలో నిలిచిన జనసేన పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పోటీ చేస్తున్నారు.ఇదిలావుండగా పలుకుబడి లేకుండా, పైసలు లేకుండా రాజకీయాలపై, ప్రజా సేవ పై ఆసక్తి ఉన్న యువతకు అవకాశం కల్పించి సమాజ సేవ కోసం నాయకులుగా, ప్రజా నాయకులుగా, సేవకులుగా, సైనికులుగా తయారు చేస్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయాలంటే చుక్క ముక్క అని, కులం మతం అనే వారికి సమాధానం చెప్పి మార్పు వచ్చేలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ యువతను రాజకీయాల్లోకి తీసుకు రావాలని, యువతతోనే మార్పు సాధ్యమని నిరూపిస్తున్నాడు. ఎన్టీఆర్ కి సైతం విజయం ఒకే రోజు రాలేదు.. ప్రజల్లోకి వెళ్ళడానికి సమయం పట్టింది. కానీ నాడు నేడు పరిస్థితి వేరు.. నాటి రాజకీయాలు వేరు నేటి రాజకీయాలు వేరు. ప్రస్తుతం రాజకీయాలు కుల మతం మీద నడుతున్నాయి. అయితే పవన్ వాటిని ఎదురుకుని ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పవన్ విజయం సాగిస్తున్నాడు.. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాడు. పవన్ సైతం ఎన్టీఆర్ లాగే పక్క ముఖ్యమంత్రి అవుతాడు మార్పుకు శ్రీకారం చుడుతాడు అనేది జగమెరిగిన సత్యం.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!