23.3 C
New York
Friday, September 17, 2021

“బ్రా” గురించి బాబోయ్ అనిపించే కొన్ని నిజాలు

బనియన్లు, అండర్ వేర్ లు అంటూ మగాళ్ళ బట్టల గురించి అందరూ ఓపెన్ గా మాట్లాడుకునే కల్చర్ మన దగ్గర ఉంది కానీ అదే ఆడవాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి వారి “లో దుస్తుల” గురించి చాలా తక్కువగానే డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. బేసిక్ గా మగవాళ్ళ తో కంపేర్ చేస్తే ఆడవాళ్ళ ఇన్నర్ వేర్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ టాపిక్ దాని గురించి కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా బోల్డ్ గా డిస్కషన్ జరగదు. అయితే మనం ఇప్పుడు ఆడవాళ్ల ఇన్నర్ వేర్ ల గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఖచ్చితంగా “బ్రా” వాడతారు. ఇంతకుముందు పల్లెటూర్లలో కూడా ఈ అలవాటు చాలా మందికి ఉండేది కాదు అయితే ఆ తర్వాత దాదాపుగా విలేజ్, టౌన్స్ అనే తేడా లేకుండా అందరూ ఆడవాళ్ళు కూడ “బ్రా” వాడుతున్నారు. సిటీలలో అయితే ప్రత్యేకంగా లేడీస్ ఇన్నర్ వేర్ షాప్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అసలు బ్రా అనేది లేడీస్ కు ఎంత అవసరం అన్న విషయాన్ని కొంతమంది అమ్మాయిలని కలిసి దక్షిణ అమెరికాకు చెందిన ఓ సంస్ద సర్వే చేసింది. అందులో అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో అనేక విషయాలు బయిట పడ్డాయి.

ఓ 27 ఏళ్ల అమ్మాయి బ్రా వేసుకోవడం అంత కంఫర్టబుల్ గా ఉండదని… దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. అంతేకాక ఆమె చెప్పిన మరొక సీక్రెట్ విషయం ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు బ్రా వేసుకోవడానికి ఇష్టపడరట… మరీ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు వెసుకోవడం వాళ్లకి అస్సలు నచ్చదట…. ఎక్కువ మంది లేడీస్ ఏదో ఒక అలవాటు లానే బ్రా వేసుకుంటారట తప్ప బ్రా వేసుకోవడం తప్పనిసరి అన్న ఫీలింగ్ వారిలో ఉండదట.

వాస్తవానికి 1869 ముందు వరకు కూడా లేడీస్ బ్రా వాడటం అన్నది లేదట మరి బ్రా లేనప్పుడు వాళ్లేం వాడేవారు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్… బ్రా రాకముందు ఆడవాళ్ళు పెట్టీ కోటు, కోర్ సెట్ లాంటివి వేసుకునేవారు. ఆ తర్వాత 1910 లో ఫస్ట్ టైమ్ లేడీస్ బ్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక అక్కడి నుంచి అంటే దాదాపు 100 ఇయర్స్ నుంచి లేడీస్ లైఫ్ స్టైల్ లో, వారు వేసుకునే లో దుస్తుల్లో “బ్రా” అన్నది ఒక ముఖ్యమైన వస్తువు అయింది. అమ్మాయిలయినా లేక ఆంటీలయినా వారు ఏ ఏజ్ లో ఉన్నా కూడా బ్రా వాడవచ్చనని జనాల్లో ఓ ఫీలింగ్… బ్రా వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా ఆ సర్వే తేల్చి చెప్పింది అవేంటంటే…

• బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది
• బ్రెస్ట్ లను మంచి సైజ్ లో ఉంచుతుంది
• బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది
• బ్రా వేసుకున్నప్పుడు ఆడవాళ్ళు బాడీ మూమెంట్స్ ఎలాంటి ఇబ్బందీ లేకుండా వుంటాయి
• ఎక్సర్ సైజ్ అప్పుడు బ్రా తప్పనిసరిగా వేసుకోవడం హెల్త్ కు చాలా మంచిది

ఇలా బ్రాతో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు తన అనుభవంలో తెలిసిందని చాలా మంది సర్వేలో తేల్చి చెప్పారు.  అయితే బ్రా గురించి చాలా మంది లేడీస్ లో కొన్ని అపోహలు కూడా వుండడం తను గమనించారట అవి…

• బ్రా వేసుకోక పోతే బ్రెస్ట్ లు లూస్ అవుతాయి అన్నది …అయితే అది నిజం కాదు.
• కేవలం బ్రా వేసుకున్నప్పుడు మాత్రమే బ్రెస్ట్ లు పెర్ఫెక్ట్ సైజ్ లో వుంటాయి అన్నది అబద్ధం.
• బ్రా వేసుకోక పోతే బ్రెస్ట్ లు లూజ్ అవడం అన్నది కూడా అబద్ధం. అది జన్యుపరంగా జరిగే చాలా నార్మల్ విషయమట.

ఇకపోతే స్కూల్, కాలేజెస్ కు వెళ్ళే అమ్మాయిలు బ్రా వాడడమే చాలా మంచిదని ఆ సర్వే చెప్పింది. అయితే బ్రా మస్ట్ అండ్ షుడ్ అవకపోయిన పెద్ద ప్రాబ్లమ్ లేదు అలా అని వేసుకోవడం వల్ల మంచి ఫలితాలే ఉన్నట్టు ఈ సర్వే వాళ్లు తేల్చారు. ఇక తమ బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉన్న లేడీస్ బ్రా వాడడమే బెస్ట్ ఆప్షన్ అని మేరీ ఫీలింగ్… అయితే బ్రా వేసుకోవడం వల్ల ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ను కూడా తేలింది.  

• మీ బ్రా సైజ్ సరిగ్గా లేక అది మీకు సెట్ అవకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ రావొచ్చు
• మీరు వాడుతున్న బ్రాండ్ బ్రాలు సరిగ్గా లేకున్నా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
• మీ బ్రా సైజ్ లో తప్పు జరిగితే ఖచ్చితంగా అది మీ బ్రెస్ట్ సైజ్ మీద ప్రభావం చూపుతుంది.

ఇక చాలా మంది లేడీస్ తమ బ్రాలను ఎక్కువ రోజులు వాడతారట అసలు తమ బ్రాలను ఎప్పుడు మార్చాలన్న విషయం మీద కూడా చాలా మంది లేడీస్ కు సరైన అవగాహన లేదంట అందుకే బ్రాలను ఎప్పుడు మార్చాలన్న విషయం గురించి మేరీ చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.

 సో లేడీస్ ఇక నుంచి బ్రా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడు బ్రా మార్చాలో తెలుసుకున్నారు కదా సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రా… టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్!!!

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles