23.2 C
New York
Sunday, September 19, 2021

అమ్మాయిలు వెధవలు, పోకీరిలకే ఎందుకు పడతారో తెలుసా??

స్టుపిడ్, ఇడియట్, రాస్కెల్, పోకిరి, వెధవ ఇవన్నీ తమ వెంట పడే అబ్బాయిలను అమ్మాయిలు తిట్టే తిట్లు కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే అలా వెధవలు, పోకిరీలుగా ఉండే అబ్బాయిలకే అందమైన, తెలివైన, డబ్బున్న అమ్మాయిలు పడిపోయేది. ఇది జగమెరిగిన సత్యం అండి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రూవ్ అయిన థియరి కూడా!!! సినిమాల్లో కూడా ఇలాగే ఒక జులాయిలా తిరిగే హీరోతో అప్సరస లాంటి అమ్మాయి లవ్ లో పడిపోతుంది ఇది తరతరాలుగా యుగయుగాలుగా వస్తున్న ఆనవాయితీ!!! అసలెందుకిలా జరుగుతుంది…? డిసెంట్ గా , మంచిగా ఉండే అబ్బాయిలను కాదని అమ్మాయిలు వెధవలకే ఎందుకు పడిపోతారు?? నిజానికి ఇది ఎంతో మంది అబ్బాయిలను, అమ్మాయిలను ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా అమ్మాయిల తల్లి తండ్రులను ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న… ఇప్పుడు ఈ ప్రశ్నకు ఒక పెర్ఫెక్ట్ సమాధానం దొరికింది… మరి అదేంటో తెలుసుకుందాం పదండి…


అనకాపల్లి అయినా అమెరికా అయినా చరిత్ర చెప్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక్కటే అందమైన అమ్మాయి లెప్పుడు అణా పైస కూడా విలువ చేయని సన్నాసులకే పడతారన్నది… ఇదే పాయింట్ హైదరాబాద్ లో బొరబండ బస్తీలో  ఉండే జెస్సి  అనే అమ్మాయి విషయంలో కూడా ప్రూవ్ అయ్యింది… జెస్సి  చాలా అందమైన తెలివైన అమ్మాయి. పీజీ కంప్లీట్ చేసిన తను ఒకరోజు ఆమె రీసెర్చ్ చేసిన తీసీస్ ను ఒక సెమినార్ లో ప్రెజెంట్ చేయడానికి వెళ్ళింది… అక్కడ అందరి మంది ముందు తన ప్రజెంటేషన్ ను అద్భుతంగా ఇచ్చింది కూడా… అయితే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చి మీ ప్రజెంటేషన్ బాగుంది కానీ మీరు కొన్ని తప్పులు చేశారు అవి సరి చేసుకుంటే బెటర్ త్వరలోనే మీకు మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడట… 

ఎవరో ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి తన వర్క్ గురించి క్రిటిసైజ్ చేసేసరికి జెస్సి క కు అతని మీద పిచ్చ కోపం వచ్చిందట… అతను చూడ్డానికి డిసెంట్ గా కూడా లేడట ఒక వెధవలా, పోకిరీలా అనిపించాడట… మన అచ్ఛ తెలుగులో చెప్పాలంటే ఏ పనీ పాటా లేకుండా బెవర్స్ గా తిరిగే ఒక పోరంబోకు గాడిలా కనిపించాడట… జెస్సి  అదొక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అని పెద్దగా ఆలోచించకుండా అతని గురించి మర్చిపోయి తన ఇంటికి వచ్చేసిందట… సరిగ్గా ఒక వారం తరువాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తను అలా మాట్లాడి వుండకూడదు అందుకు సారి చెపుతున్నా అంటూ జెస్సి కి తనని క్రిటిసైజ్ చేసిన అబ్బాయి ఒక మెసేజ్ పంపించాడట… ఇంకేం పిల్ల టక్కున అతని వలలో పడిపోయింది… దాదాపు వన్ ఇయర్ అతనితో డేటింగ్ కూడా చేసిందట. 


సో ఇప్పుడు మనం అసలు పాయింట్ కు వద్దాం… జెస్సి  లాంటి అందమైన తెలివైన అమ్మాయి కూడా ఆ అబ్బాయి ప్లే చేసిన చిన్న ట్రిక్ కు ఎలా పడిపోయింది?? పైగా ఆ అబ్బాయి జెస్సి ను అందరి ముందు క్రిటిసైజ్ చేసాడు… అయినా అతనికే పడిపోయి తనతో వన్ ఇయర్ డేటింగ్ చేసిందంటే అక్కడేం మేజిక్ జరిగింది?? సింపుల్… ఆ అబ్బాయి ముందు జెస్సి ఇగో ను హార్ట్ చేసి… తనను క్రిటిసైజ్ చేసి రెచ్చగొట్టాడు అక్కడ ఉన్న కొన్ని వందల మంది మధ్య కూడా తను చేసిన పనితో జెస్సి మనసులో ఒక బలమైన ముద్ర వేశాడు… జెస్సికు గుర్తుండి పోయాడు… ఆ తర్వాత చాలా సైలెంట్ గా పర్సనల్ గా తను చేసింది తప్పని చెపుతూ సారీ చెప్పి తనతో కాళ్ళ బేరానికి వచ్చాడు దాంతో అతని మీద తనే గెలిచినట్టుగా ఫీల్ అయిన జెస్సి వెంటనే అతను డేటింగ్ కు రమ్మని అడిగితే హ్యాపీగా వెళ్ళింది… అందమైన తెలివైన అమ్మాయిలేప్పుడు అబ్బాయిలు తమకు సరెండర్ అవ్వాలని తమ మాటకు వాళ్ళు సై అనాలని ఆశపడతారు బలంగా కోరుకుంటారు… సో ఇక్కడ జెస్సిను క్రిటిసైజ్ చేసిన అబ్బాయి ఆమెకు సారీ చెప్పేసరికి తన ఇగో శాటిస్ ఫై అయ్యి అతనికి పడిపోయింది. నిజానికి అమ్మాయిలు తమ ఇగొను హర్ట్ చేసి తమను ఛాలెంజ్ చేసి ఎంతో కొంత వాళ్ళను డిస్ట్రబ్ చేసిన అబ్బాయిలకు చాలా ఈజీగా పడిపోతారు ఇదే అసలు సీక్రెట్.


మీరెప్పుడైనా చూశారా ప్రతి అందమైన అమ్మాయి పక్కనున్న ఏ అబ్బాయిని చూసినా ఆమె పక్కన వీడెంటి అనుకుంటాం… ఇక్కడ లాజిక్ ఏంటంటే అందమైన అమ్మాయిల్లో ఉన్న సెల్ఫ్ డౌట్ లను ఇలాంటి అబ్బాయిలు క్వశ్చన్ చేయడం కానీ వాళ్ళకు తను ఎక్కువ అన్న ఫీలింగ్ కానీ కలిగించరు… ఇంకా చెప్పాలంటే నువ్వే నా రేంజ్ కు ఎక్కువ అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఆ అమ్మాయి లోకం తామే అయ్యేలా తన ముందు చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తారు… ఎక్కువ పోసేసివ్ గా ఉంటారు దాంతో ఆటో మేటిక్ గా ఆ అమ్మాయి ప్రపంచం వాళ్ళే అవుతారు తనకు తెలియకుండానే అమ్మాయి ఆ ట్రాప్ లో పడుతుంది.


జెస్సి కూడా తనను క్రిటిసైజ్ చేసిన అబ్బాయికి అలాగే పడిపోయింది… అయితే ఒక వన్ ఇయర్ అతనితో డేటింగ్ చేశాక మెల్లిగా అతను జెస్సి కంటే తనే తెలివైన వాడినంటు అందరి ముందు చెప్పడం జెస్సి ను చాలాసార్లు ఇగ్నోర్ చేయడం లాంటివి చేసేసరికి జెస్సి కు మెల్లిగా తనెలా అతని ట్రాప్ లో పడింది అర్ధమయ్యి ఒకరోజు ఇంకో అబ్బాయి తనని డేట్ కు వెళ్దామా అని అడిగేసరికి తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అతనితో డేటింగ్ కు వెళ్లిందట. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తనెక్కడ తప్పు చేసింది అని జెస్సి ఆలోచిస్తే అప్పుడు తనే కాదు తనలాంటి అమ్మాయిలందరూ ఎక్కడ తప్పు చేస్తున్నారు అన్న పాయింట్ మీద ఒక క్లారిటీ వచ్చిందట… ఒక అమ్మాయి అందమైనదయినా… తెలివైన అమ్మాయి అయినా వాళ్ళ లో కూడా చాలా వరకు సెల్ఫ్ డౌట్ లు ఉంటాయట తమలాగే అందంగా ఉండి తెలివిగా ఉండే అబ్బాయిలు అంటే కొంచెం భయపడతారట కారణం ఒక్కటే .

వాళ్ళు తమను ఎక్కడ డామినేట్ చేస్తారేమోనని అంతే… అందుకే తమకంటే తక్కువ రేంజ్ లో ఉండే అబ్బాయిలకు పడిపోతుంటారు… అందుకే జెస్సి తనలాంటి అమ్మాయిలందరూ కూడా తమలో ఉండే సెల్ఫ్ డౌట్ లను పక్కన పెట్టాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని సలహా ఇస్తుంది… అలాగే అబ్బాయిలకు కూడా ధైర్యంగా వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడమని పోకిరీలు, వేదవలకే అంత కాన్ఫిడెన్స్ వున్నప్పుడు అందంగా స్లిమ్ గా వుండి తెలివైన అబ్బాయిలు ఏ మాత్రం తగ్గకుండా అమ్మాయి కోసం ట్రై చేయాలని అనుభవంతో చెప్తుంది… సో బాయ్స్ అండ్ గర్ల్స్ జెస్సి చెప్పిన మాటలు బాగా అర్థం చేసుకోండి మే బీ మీరు మీలా అందంగా ఉండి తెలివైన పార్టనర్ ను అట్రాక్ట్ చేస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles