23.6 C
New York
Monday, September 20, 2021

ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి జగనా.. పవన్ కళ్యాణా.?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. పోస్టుల విషయంలో తొందరపాటుతో పొరపాట్లు కామన్. ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా అలాంటి తప్పు దొర్లింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి విద్యా దీవెన కార్యక్రమం లైవ్ ఇచ్చే క్రమంలో పొరపాటు జరిగింది. సీఎం లైవ్‌ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పర్యటనకు సంబంధించిన వీడియో లైవ్‌లో ప్రత్యక్షమైంది. కొద్దిసేపు పవన్ కళ్యాణ్ వీడియో అలాగే వచ్చింది. మంత్రి ఫేస్‌బుక్ పేజ్ కావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.. తప్పు ఎక్కడో జరిగినట్లు గమనించి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు.. అప్పటికే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీశారు. విద్యా దీవెన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీడియో రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి జగనా.. పవన్ కళ్యాణా.? అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి. కొద్దిసేపటికి తప్పును గమనించి వీడియోను తొలగించడంతో వీడియో లేకుండా పోయింది. ఇదిలా ఉంటె.. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సంస్థాగతంగా బలపడేందుకు పక్కా వ్యుహంతో వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ హైకమాండ్.. తాజాగా అయా జిల్లాల కమిటీలను నియమిస్తూ ఒక ప్రకటనని  విడుదల చేసింది. విజయవాడ, నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకంతో పాటు వివిధ కమిటీకి జనసేనాని పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేశారు. జనసేన పార్టీ విజయవాడ, నెల్లూరు నగరాలకు 64 మందితో ఏర్పాటైన కమిటీకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే చెప్పారు. విజయవాడ నగర అధ్యక్షులుగా పోతిన మహేష్‌ ను నియమించగా, నెల్లూరు నగర అధ్యక్షులుగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పేరును ప్రకటించారు. అలాగే ప్రతి జిల్లా కమిటీలో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 12 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శులు, కార్యనిర్వహణ సభ్యులతో కూడిన జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విడుదల చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles