-0.7 C
New York
Wednesday, January 26, 2022

ఇలా చేస్తే … ఎలాంటి అమ్మాయి అయినా మీతో డేటింగ్ కు వస్తుంది

ఇలా చేస్తే … ఎలాంటి అమ్మాయి అయినా మీతో డేటింగ్ కు వస్తుంది

ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొకరిని ఇష్టపడి వాళ్లతో మెల్లిగా పరిచయం పెంచుకొని డేటింగ్ చేద్దాం అనుకున్న ప్పుడు వాళ్ళ మనసులో ఎన్నో భయాలు అనుమానాలు కలగడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది… ఎందుకంటే తాము ఎదుటి వ్యక్తికి నచ్చుతామో లేదో అన్న భయం వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది… ఒకవేళ నచ్చకపోతే తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకోవాలి అన్న బాధ వాళ్ల లోపల ఉంటుంది… అయితే ఇలా ఎక్కువగా టెన్షన్ పడి అనవసరంగా లేనిపోని తప్పులు చేయకుండా అసలు డేటింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎదుటివారిని ఈజీగా మెప్పించగలము అన్న విషయాల గురించి కొంత మంది లవ్ ఎక్స్పర్ట్స్ డేటింగ్ లో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని రూల్స్ గురించి చెప్పారు… అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ రూల్స్ కనుక పాటించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు… మరి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్న ఆ రూల్స్ ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి…

1. ఇతరుల గురించి ఇంట్రెస్ట్ చూపించండి!!!!

మీరు ఒక అమ్మాయి నో లేదా అబ్బాయి ను ఇష్టపడ్డారు వాళ్ళతో డేటింగ్ స్టార్ట్ చేసారు… ఆ డేటింగ్ లో మీరు ఎంతసేపు నీ గురించే గొప్పలు చెప్పుకుంటూ మీ గురించే అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే కచ్చితంగా అది ఎదుటి వారికి బోర్ కొట్టేస్తోంది… ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు అని ఎదుటి వాళ్ళు ఫీలవుతారు… అలాకాకుండా కాసేపు మీరు మీ గురించి మీ మీ ఇష్టాల గురించి పక్కనపెట్టి ఎదుటివారు ఇష్టాలు ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి వల్ల స్పెషాలిటీ లు ఏంటి అని ఎక్కువగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తూ వారి గురించి వాళ్ళ చెప్పుకునే అవకాశం వాళ్ళకి ఇస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అది వాళ్ళకి బాగా నచ్చుతుంది… ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఉంది ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఈ లాజిక్ గనక మీరు గుర్తు పెట్టుకో గలిగితే మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తిని మీ తెలివితేటలతో చాలా ఈజీగా పడేయవచ్చు… జస్ట్ కేవలం మీ గురించి కాకుండా వాళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి… ఇది మీకు చాలా బాగా పనిచేసే మెయిన్ రూల్!!!?

2. నమ్మకాన్ని పెంచుకోండి!!!!

ఒక కొత్త వ్యక్తిని నమ్మి వాళ్లతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు ఎంతగా నమ్మకస్తుడిగా ఉంటే వాళ్లు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు అన్నది నిజం…. ఎందుకంటే ఏ మనిషి అయినా తన జీవితంలో ఒక కొత్త రిలేషన్ షిప్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎదుటివాళ్ళు కచ్చితంగా తన పట్ల నమ్మకం గా ఉండాలని కోరుకోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది… సో మీరు గనక వాళ్ళ అంచనాలకు తగినట్లుగా వాళ్లతో నమ్మకంగా ఉండడం చేసినట్లయితే మీ డేటింగ్ లో ఎదుటి వ్యక్తిని కచ్చితంగా మీరు ఆకట్టుకుంటారు… ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఒక వ్యక్తిని నమ్మాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది… సో మీరు ఒక వ్యక్తి తో డేటింగ్ చేస్తున్నప్పుడు మీతో లైఫ్ జర్నీ అనేది చాలా బాగుంటుంది మీరు బాగా నమ్మదగ్గ మనిషి అన్న నమ్మకం ఎదుటి వారికి ఇచ్చి చూడండి అప్పుడు మీ పంట పండినట్లే!!!!

3. నిజాయితీగా ఉండండి!!!!

మీరు వాళ్ళతో డేటింగ్ చేస్తున్నారు కదా అని ప్రతి సారి మీరు వాళ్ళ ని పొగుడుతూ ఉండడం అన్నది కరెక్ట్ కాదు… ఒకవేళ మీకు ఎదుటివారి గురించి ఏవైనా విషయాలు నచ్చకపోతే నచ్చలేదని డైరెక్టుగా వాళ్ళకి చెప్పేయండి… అంతేగాని ప్రతి సారి మీరు వాళ్ళ ని పొగుడుతూ కూర్చుంటే వాళ్ళకి కచ్చితంగా మీ మీద డౌట్ వస్తుంది… ఎలాంటి భయము మొహమాటం లేకుండా నీ నిర్ణయాలను నిర్భయంగా ఎదుటివారికి చెబుతున్నప్పుడు మీ నిజాయితీ అనేది వారికి చాలా బాగా నచ్చుతుంది దాంతో ఆటోమెటిక్ గా వాళ్లు మీ వైపుకి అట్రాక్ట్ అవుతారు. ఒక వ్యక్తి తో కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు మీరు వాళ్ళతో 100% నిజాయితీగా ఉండగలిగితే జీవితంలో వాళ్ళు ఎక్కువగా దేని కోల్పోరు… ఎందుకంటే మన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనిషి మన పక్కన ఉంటే మనం జీవితంలో చాలా తక్కువ తప్పులు చేస్తుంటాం దాంతో మనకు ఎక్కువగా నష్టం జరగదు… సో మీరు ఎదుటివారితో నిజాయితీగా ఉంటే వాళ్లు కూడా మీతో నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

4. మీలో లోపాలు ఉంటే వాళ్ళకి చెప్పేయండి!!!!

ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఈ ప్రపంచంలో ఒక మనిషిలో లోపాలు అంటూ లేకుండా ఎవరూ ఉండరు… ఇంత ఫర్ఫెక్ట్ గా బతుకుతున్న మనుషుల లో కూడా చిన్న చిన్న డిఫెక్ట్ ఉండటం అనేది సహజంగానే ఉంటుంది… అలాగే మీరు ఒక వ్యక్తి తో డేటింగ్ చేస్తున్నప్పుడు మీలో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే ఓపెన్గా వాళ్లతో అవి డిస్కస్ చేయండి… అలా కాకుండా మీరు వాటిని దాచినట్లు అయితే భవిష్యత్తులో మీ గురించి మీరు వాళ్ళకి సరిగ్గా ఏది చెప్పలేదు అని వాళ్లు మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రమాదం ఉంటుంది… మీ గురించిన నెగిటివ్ విషయాలు చెబితే వాళ్ళు మీతో రిలేషన్ షిప్ లోకి ఎంటర్ అవరిమో అన్న బయలు అంటే మీరు ఏమి పెట్టుకోకండి… మీ ప్లస్లు మైనస్లు తెలిసిన వ్యక్తి మీ జీవితం లోకి వస్తే అప్పుడు మీరు వాళ్ళతో స్వేచ్ఛగా ఉండొచ్చు… అలా కాకుండా వాళ్ళ ముందు మీరు అన్నిట్లోనూ పర్ఫెక్ట్ అని బిల్డప్ ఇస్తే మీరు జీవితాంతం వాళ్ల ముందు నటించాల్సి వస్తుంది… ఒక్కసారి మీ గురించిన నిజాలు చెప్పడమే కరెక్ట్ అలా కాకుండా మీరు వాళ్ళకి ఒక అబద్ధం చెప్పినా కూడా తర్వాత కొన్ని వేల అబద్దాలు ఆడాల్సి వస్తుంది… మనం ఏంటి అన్నది ఎదుటివారికి కరెక్ట్ గా తెలిస్తే కనక వాళ్లకి ఇష్టం ఉంటే మనల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తే మనలో ఎన్ని లోపాలు ఉన్న వాళ్ళు మనల్ని వదులుకోలేరు… అలా కాకుండా మన గురించి మనం ఎక్కువగా చెప్పుకొని అబద్ధాలు ఆడితే ఆ తర్వాత వాళ్లు కోరుకుంటున్న క్వాలిటీస్ మనలో లేవని తెలిసినప్పుడు వాళ్లు మనం మోసం చేసినట్లు ఫీల్ అవడమే కాకుండా మనల్ని వదిలేసి వెళ్లిపోతారు అప్పుడు మనం ఎక్కువగా బాధ పడాల్సి వస్తుంది.

సో ఫ్రెండ్స్ అవండి కొంతమంది లవ్ ఎక్స్పర్ట్స్ డేటింగ్ గురించి చెప్పిన డేటింగ్ టిప్స్… మీరు అమ్మాయి అబ్బాయి అయినా ఒక వ్యక్తి తో డేటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని తెలివిగా ప్రవర్తిస్తే గనుక ఎదుటి వ్యక్తిని మీరు ఇట్టే పడవచ్చు నిజానికి డేటింగ్ లో సక్సెస్ అవ్వడం అన్నది పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు… సో నెక్స్ట్ టైం మీరు డేటింగ్ చేసినప్పుడు ఈ రూల్స్ అన్ని పాటించినట్లయితే సక్సెస్ మీదే… విష్ యు ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!