23.2 C
New York
Tuesday, September 21, 2021

రాష్ట్ర లీడర్ గా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి.?

కేవ‌లం 25 ఏళ్ల వ‌య‌స్సులోనే నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని జ‌గ‌న్ నియ‌మించారు అంటే బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై జ‌గ‌న్‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో ?  నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. బైరెడ్డి ఏం మాట్లాడినా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యేది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఇప్పుడో సంచలనం. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా సిద్ధార్థ్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా బైరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించైనా సంగతి తెలిసిందే.! వైసీపీకి సిద్ధార్థ్‌రెడ్డి కచ్చితంగా బలమే. మంచి సబ్జెక్ట్, వాక్చాతుర్యం ఉన్న నాయకుడు. మంచి టాలెంట్ కూడా ఉంది. కచ్చితంగా కర్నూలు జిల్లాలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. సిద్ధార్థ్ దగ్గర రాజకీయ నాయకుడి దగ్గర ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో.. డౌటే లేదు.. ఆయన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. కర్నూలు జిల్లా వైసీపీ కంచుకోట..2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లా. అయితే ఎన్నికల ముగిసిన 6 నెలల్లోపే వైసీపీలో అంతర్గత విబేధాలు పడిన జిల్లా కూడా కర్నూలే.. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నందికొట్కూరు వైసీపీలో వర్గ పోరు తారాస్థాయిలోకి వెళ్లిపోయింది. స్థానిక ఎమ్మెల్యే అర్థర్ కు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కి మద్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి సీఎం జగన్ దగ్గర కూడా వీళ్ళ పంచాయతీ జరిగింది. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా నేతలు, ఎమ్మెల్యేలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. కర్నూలు జిల్లాలో ఏకగ్రీవాలు ఎక్కువగా రావాలని ఈ సమావేశంలో నేతలకు ,ఎమ్మెల్యేలకు సీనియర్ మంత్రులు ఆదేశించారు. తర్వాత నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు.  అయితే నందికొట్కూరు నియోజకవర్గ విభేదాలపై చర్చ జరుగుతుండగానే నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ఆర్థర్, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. సిద్ధార్థ రెడ్డి పీఏ రమణ, వైసిపి నేత చెరుకుచెర్ల రఘురామయ్య మధ్య వాగ్వాదం పెరిగి కుర్చీలు ఎత్తుకునే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే ఆర్దర్ కు, బైరెడ్డి కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా పరిస్థితి మారిపోయింది. పార్టీ ముఖ్య నాయకులు ముందే ఈ స్థాయిలో బాహాబహి కి దిగడంతో నేతలు కంగుతిన్నారు. చివరకు మంత్రులు సీరియస్ ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఉన్నా కూడా పెత్త‌నం అంతా బైరెడ్డిదే. చివ‌ర‌కు ఎమ్మెల్యేకు బైరెడ్డికి వార్ జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనిల్ నుంచి సీనియ‌ర్లు అంద‌రూ కూడా బైరెడ్డికే స‌పోర్ట్ చేశారు. ఏపీలోనే ఎక్క‌డా లేని విధంగా నందికొట్కూరులో మాత్ర‌మే ఎమ్మెల్యేగా ఆర్థ‌ర్ ఉంటే… బైరెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక ఆయ‌న‌కు నామినేటెడ్ ప‌ద‌వుల్లో భాగంగా డీసీసీబీ చైర్మ‌న్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా రాలేదు. బైరెడ్డి దూకుడును త‌ట్టుకోలేని వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌న్ను టీడీపీ వాళ్ల‌తోనే క‌లిసి మ‌రీ తొక్కేస్తోంద‌న్న చ‌ర్చ‌లు క‌ర్నూలు రాజ‌కీయాల్లో వినిపించాయి. అయితే తాజాగా  బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి కి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి MLC పదవి ఇచ్చి ఆయన్ని రాష్ట్ర లీడర్ గా నియమించనున్నారని తెలిసింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో మరో వారం రోజుల్లో తెలిసి పోతుంది.   

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!