19.5 C
New York
Tuesday, September 28, 2021

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు…జగన్ లో వైస్సార్ ని చూసుకుంటున్నారా…?

రాజశేఖర్ రెడ్డి ఈయన కేలవం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు ఇలాంటి నాయకులు ఉండటం చాలా అరుదు. అంతే కాదు వీరి వారసత్వం సైతం మంచి పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. కానీ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు.. తండ్రి పేరును కాపాడుతూ, తండ్రి లాగే ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు జగన్ రాజకీయపై ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఎక్కువగా వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఎంపీగా కూడా పని చేసాడు. తన తండ్రి లాగే జగన్ కి ప్రజలంటే ఇష్టం. ప్రజా శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇక అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ పూర్తి రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి మరణ వార్త విని ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని, గుండె పోటు వచ్చి చనిపోయారు. దీంతో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయించాడు.. కానీ నాటి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు దీంతో పార్టీకి రాజీనామా chesi పార్టీ పెట్టాడు. ఈ మొండితనం రాజశేఖర్ రెడ్డిలోను ఉంది. ఇక రాష్ట్ర విభజన తరువాత జగన్ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాడు. రాష్ట్ర విభజన తరువాత తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది, ఈ ఎన్నికల్లో వైసీపీ కూడా భారీ సీట్లను గెలిచింది. ఆ తరువాత తండ్రి ఆశయాలను.. తండ్రి లక్ష్యాలను ప్రజలకు అందించడానికి జగన్.. ప్రజా సమస్యలపై 2017 – నవంబరు – 6 న “ప్రజా సంకల్ప యాత్ర ” ను ప్రారంభించారు వైయస్ జగన్. 2516 గ్రామాల్లో,14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 124 బహిరంగ సభలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుని, చివరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “నవ రత్నాలను” ప్రకటించారు.ఈ నవరత్నాలలో ఒక్కటైన నెలకు 2000 ఫించన్ పథకాన్ని నాటి అధికార TDP ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది.. జగన్ అంటే TDP కి భయం పట్టుకుంది కాబట్టి తమ పథకాన్ని కాపి చేసింది అని YSRCP ఆరోపించింది. ఇది ఇలా వుండగా, ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తేదీ నాడు పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు జగన్. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలికాయి. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, కఠినంగా వున్న కాని 2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసన సభ్యుడు. సుమారు 90000 పైగా మెజార్టీతో గెలవడం ఆయన పట్ల ప్రజలకి ఉన్న విశ్వాశానికి నిదర్శనం. తాను వేసిన ఒక్కో అడుగులో, ఒక్కో సమస్యను వెలికి తీసి, మహ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సాధించడం కోసం తాను వేసిన ఒక్కో అడుగు ప్రజల గుండెల్లో నిలిచి విజయ తీరాన్నీ చేరుకున్నాడు. ఒంటి చేత్తో పార్టీని నడిపించి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి.. ఇక అధికారం చేపట్టిన తరువాత వినూత్న నిర్ణయాలు, విధాన పరమైన అంశాలను ప్రవేశ పెట్టి ప్రజలకి పాలనని చేరువ చేసాడు. నవరత్నాలను ప్రవేశ పెట్టాడు.. అసలు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగాలు భర్తీ చేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా తను చెప్పిన ప్రతి పనీ.. చేసి చూపిస్తానని చెప్పిన ప్రతి పని చేసాడు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే ప్రజల్లోకి వెళ్ళాడు జగన్. అంతే కాదు రాజాకీయా కోసం కాకుండా ప్రజల కోసం పని చేస్తున్నాడు. పని చేసే వారికి పదవులు ఇస్తూ ప్రజల్లోకి దగ్గరయ్యాడు.రాజశేఖర్ రెడ్డి ప్రజలకు దగ్గరయ్యి.. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేవాడు. జగన్ సైతం అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో ప్రజల్లో రాజశేఖర్ రెడ్డిలాగే జగన్ కూడా మంచి పేరును తెచ్చుకున్నాడు.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!