14.6 C
New York
Saturday, September 25, 2021

అధికార దాహం తో అరెస్ట్ చేస్తే ప్రజలు చూస్తూ ఉండరు… మాకు ఒకరోజు వస్తుంది ప్రజా పోరాటం ఆపం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు ఎంతోమంది తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదయ్యాయి.చిన్న కారణం దొరకిన కూడా.. అదే ఛాన్స్ గా కేసులు పెడుతున్నారు. కారణం ఏదైనా జైలుకు పంపాలి అని అనుకున్న వైసిపి అనేక వ్యవహారాలకు సంబంధించి సదరు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇంకా ఈ అరెస్టుల వ్యవహారం సాగుతూనే ఉంది. టీడీపీ నాయకులపై పెట్టిన కేసుల్లో టీడీపీ నేతలకు సంబంధించిన ఆధారాలను కోర్టుల్లో ప్రవేశపెట్టడంలో మాత్రం వైసీపీ విఫలమవుతుంది. టీడీపీ నాయకులు అక్రమాలు చేస్తే.. అది గుర్తించిన జగన్.. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి విచారణ పూర్తి లోతుగా చేయించవచ్చు కదా అనే మాట టీడీపీ నాయకులు ప్రజల అంటున్నారు. ESI లో భారీ అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తరువాత టిడిపి గందరగోళం సృష్టించింది. తాము ఎటువంటి అక్రమాలకు పడకున్న కూడా కేవలం తమపై పగ తీర్చుకోవడానికి, రాజకీయ కక్షతో అరెస్టు చేస్తున్నారంటూ, కక్ష రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. నిరసన తెలుపుతున్నారు పసుపు పార్టీ నేతలు. రాజధాని అమరావతి వ్యవహారంలో టిడిపి పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగింది. పెద్దఎత్తున టిడిపి నాయకులు అమరావతి రాజధాని నిర్మాణంలో  అక్రమాలకు పాల్పడ్డారని, రాజధాని పేరుతో పేద ప్రజల భూములను కాజేశారంటూ టీడీపీ పై కేసులు పెట్టె ప్రయత్నం చేస్తోంది వైసీపీ. దీనిపై దర్యాప్తుకు ఆదేశించడం, దళితులకు చెందిన అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారంటూ కేసులు అక్రమ కేసులు బనయించింది. సంగం డైరీ విషయంలోనూ టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ను మానసికంగా దెబ్బ తీయడానికి పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ నిధులను నారాయణ విద్య సంస్థలకు నిధులు మళ్లించారంటూ.. నారాయణ విద్య సంస్థలు అక్రమాలకు పడపడుతున్నాయంటూ.. పేదలను మభ్యపెట్టి భూములు కాజేశారంటూ వివిధ కారణాలతో మాజీ మంత్రి నారాయణని అరెస్ట్ చేశారు. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ కి ఆయన పెట్టింది పేరు.. ఎలాగైనా తనని దెబ్బ కొట్టాలని అనుకున్న వైసిపి జేసీ ట్రావెల్స్ పై పడింది.. అనుమతి లేని బస్సులు ఉన్నాయని.. ఫిట్ నెస్ లేదని.. ఒకే నుంబర్ తో చాలా బస్సులు నడుపుతున్నారని జేసీకి సంబంధించిన కొన్ని బస్సులు సీజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలకు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చేసారని టీడీపీపై వైసీపీ.. వైసీపీ పై టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. మైనింగ్ వ్యవహారం.. పోలవరం డ్యామ్.. రాజధాని నిర్మాణం.. వివిధ పథకాల్లో అక్రమాలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తే.. మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కాకుండా మీకు మీరే లాభం పొందారని వైసీపీ ఆరోపిస్తుంది. ఆరోపణలు ప్రతి ఆరోపణలలను  పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షసాధింపు చర్యకు పాల్పడుతుందని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు..  రాజకీయ వర్గానికి స్పష్టంగా అర్థం అవుతుంది.టీడీపీ నాయకులు నిజంగానే అవినీతికి పాల్పడితే.. కేవలం కేసులు పెట్టి వదిలేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. అధికారంలో ఉండి కూడా ఎందుకు సాక్షాలను సేకరించి.. తప్పును రుజువు చేయలేకపోతుంది అనేదే ప్రశ్న.? మొత్తం మీద వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను కేసులతో దెబ్బ కొట్టాలని చూస్తున్నారనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద టిడిపి పై అనవసరంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరోపణలను రుజువు చేయలేకపోవడం, తదితర వ్యవహారాలు కోర్టు వరకు వెళ్లినా , పెద్దగా టీడీపీకి జరిగిన నష్టం ఏమీలేదు. ప్రజల్లో వైసిపి వాళ్ళు టీడీపీ పై కక్ష సాధిస్తున్నారు అనే ఆలోచన తప్ప..

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!