24.7 C
New York
Sunday, September 19, 2021

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి బయోగ్రఫీ… చరిత్ర వింటే మరో కేవీపీ నే…

సాధారణ జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి, తన చతురతతో జర్నలిస్ట్ గా తన వృతిలోనే వివిధ హోదాల్లో పని చేసి, ఆ తరువాత ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగి, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు.. వైసిపి ఫైర్ బ్రాండ్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి. జూన్ 16, 1958 న ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సింహాద్రిపురం మండలం ముసల్ రెడ్డి పల్లిలో సజ్జల రామకృష్ణ రెడ్డి జన్మించారు. రామకృష్ణారెడ్డి తండ్రి దివంగత సజ్జల సుబ్బారెడ్డి మరియు తల్లి దివంగత సజ్జల పార్వతమ్మ.. వీరికి ఆరుగురు సంతానం వీరిలో సజ్జల చిన్నవాడు. రామకృష్ణ రెడ్డి తండ్రి పోస్ట్‌మాస్టర్ గా ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేసాడు. తండ్రి ఉద్యోగి కావడంతో వీరికి బాగా చదివించారు. సజ్జలకి చిన్న నాటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. సమాజానికి సేవ చేయాలనే తప్ప రామకృష్ణ రెడ్డికి చిన్న నాటి నుంచి ఉండేది. మంచిగా చదివి మంచి ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేయాలని అనుకునే వాడూ.సజ్జల రామకృష్ణా రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన పాఠశాల విద్యను పూర్తి చేసారు.తర్వాత, కడప ప్రభుత్వ కళా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రామకృష్ణ రెడ్డి లక్ష్మీ సజ్జలను వివాహం చేసుకున్నారు.సజ్జల రామకృష్ణా రెడ్డి వృత్తి రీత్యా జర్నలిస్ట్. తన కెరీర్ ప్రారంభ దశలో రామకృష్ణ రెడ్డి 1978 లో ఈనాడు తెలుగు దినపత్రికలో జూనియర్ సబ్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రభూమి పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశారు , తర్వాత కొత్తగా స్థాపించిన ఉదయంలో 1985 లో చీఫ్ సబ్ ఎడిటర్‌గా చేరారు. తన పనితనంతో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన సాక్షి మీడియాలో వ్యవస్థాపక సంపాదకీయ ఎడిటర్ లలో ఒకరిగా నియమించబడ్డారు. ఇక 2014 వరకు ఎడిటోరియల్ డైరెక్టర్ మరియు పబ్లిషర్ గా పని చేశారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత, జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నాడు సజ్జల.. ఆ తరువాత, వైఎస్ జగన్ వైఎస్ఆర్‌సిపిని స్థాపించినప్పుడు, సజ్జల రామకృష్ణ రెడ్డిని తన రాజకీయ సలహాదారుగా నియమించారు జగన్. YSRCPకి కార్యదర్శిగా పని చేశారు. వైసీపీలో సజ్జల కీలక నేత.. మంచి వ్యూహకర్త, విధాన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. వైసీపీ అధికారంలోకి రావడానికి, జగన్ సీఎం అవ్వడానికి సజ్జల కనపడని కృషి చేసారు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, రామకృష్ణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమించాడు సీఎం జగన్. ఇక పార్టీ అయిన, ప్రభుత్వం అయిన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్న కూడా సజ్జలను సంప్రదించే వరకు జగన్ పని చేయరు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సజ్జల విశేష కృషి చేస్తున్నారు. అయితే సజ్జలపై కొన్ని సార్లు సొంత పార్టీ నేతలే విమర్శించారు ఇది బయటకి కనపడలేదు.. సజ్జల ఎదుగుదలను ఓర్వలేకపోయారు. ఏదేమైనా సజ్జల జగన్ ని కుడి చెయ్యి లాంటి వాడు అనేది వాస్తవం. ఇదిలా ఉండగా సజ్జల ప్రభుత్వాన్ని విమర్శించే వారికి గట్టి కౌంటర్లు ఇస్తాడు.. తన మాటలతో ముచ్చెమటలు పట్టిస్తాడు. ప్రభుత్వం పార్టీకి ఎవ్వరు విమర్శించిన వారికి తగ్గ రీతిలో కౌంటర్ ఇస్తాడు సజ్జల రామకృష్ణ రెడ్డి.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles