22.4 C
New York
Friday, September 17, 2021

టీడీపీ మీద వైసీపీకి అంత కక్ష సాధింపా ?

వైసీపీ ప్రభుత్వం టీపీపీ నాయకులపై పగ తీర్చుకుంటుందా.? టీడీపీ నాయకులను మానసికంగా దెబ్బ కొట్టడానికేనా.? టీడీపీ నాయకులపై పెట్టె కేసుల్లో నిజమెంత.? టీడీపీ నాయకులపై ప్రభుత్వం చేసే ఆరోపణల్లో నిజమెంత.?ఇప్పుడూ ఏపీలో అరెస్ట్ల పర్వం నడుస్తుంది.. అయ్యో కాదు.. కాదు.. వైసిపి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వం తమ హయాంలో వైసిపి నేతలపై నానా హంగామా చేసిందని.. ఇపుడు అదే రిటర్న్ ఇస్తున్నామని వైసీపీ నేతలు చెప్పకున్న ఇది చాలా సందర్భాల్లో వారి మాటల్లో కనిపించింది.. జగన్ కోడి కత్తి వ్యవహారం.. జగన్ ని ఎయిర్ పోర్ట్ లో అనుమతి ఇవ్వకపోవడంతో పాటు ఏవైతే టీడీపీ హయాంలో కనిపించాయో.. ఇప్పుడు సరిగ్గా జగన్ టీడీపీ నేతలపై అదే పగ తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది.. అయితే జగన్ చేస్తున్న దాంట్లో టీడీపీ ప్రభుత్వం చేసింది గోరంత.. ఇది ప్రజలకు కూడా తెలిసిన వాస్తవమే..ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది తెలుగుదేశం నాయకులు జైలుపాలు అయ్యారు. కారణం ఏదైనా జైలుకు పంపాలి అని అనుకున్న వైసిపి అనేక వ్యవహారాలకు సంబంధించి సదరు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు బనాయించి అరెస్టులు చేశారు. అంతే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంకా ఈ అరెస్టుల పరంపర సాగుతూనే ఉంది.కేసులు పెడుతున్నారు కానీ టీడీపీ నాయకులేం మాములోలా వీరు కోర్ట్ కి వెళ్తున్నారు.. న్యాయస్థానంకి కావాల్సింది సాక్ష్యం.. ఆధారం.. కానీ ఇవేవీ నిరూపించలేకపోవడం తో అరెస్టు అయితే  అవుతున్నారు కానీ మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.తమపై అనవసరంగా కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు నిరసనలు చేస్తున్నారు పసుపు పార్టీ నేతలు.అయితే సదరు టీడీపీ నేతలకు సంబంధించిన ఆధారాలను కోర్టుల్లో ప్రవేశపెట్టడంలో మాత్రం వైసీపీ విఫలమవుతున్నట్టుగానే కనిపిస్తోంది.. ఎందుకంటే ఒకవేళ టీడీపీ నాయకులు అక్రమాలు చేస్తే.. అది గుర్తించిన జగన్.. అధికారంలోఉన్నది తన ప్రభుత్వమే కాబట్టి విచారణ పూర్తి లోతుగా చేయించవచ్చు.. కానీ అది జరగడంలేదు ఎందుకంటే కేవలం వైసీపీ కక్ష సాధించి దెబ్బ కొట్టాలని చూస్తుంది.. అనేది తెలియకనే తెలుస్తున్న వాస్తవం.. ఇక ESI స్కాంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నానా హంగామా టీడీపీ సృష్టించింది. రాజకీయ కక్షతో అరెస్టు చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. నిరసన తెలిపింది. అచెన్న దాదాపు నెల రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయనను అరెస్టు చేసిన ఈఎస్ఐ స్కాం కు సంబంధించి ఇప్పటికీ తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించ లేకపోవడం, వందల కోట్ల అవినీతి జరిగిందనే దానికి సరైన ఆధారాలు లేకపోవడం వంటి కారణాల తో ఈ వ్యవహారంలో వైసిపి ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వచ్చింది.ఇక అమరావతి వ్యవహారంలోనూ ఇదే చోటుచేసుకుంది.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి పై అనేక విమర్శలు చేసింది. పెద్దఎత్తున టిడిపి నాయకులు అమరావతి రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తుకు ఆదేశించడం, దళితులకు చెందిన అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలను రుజువు చేయలేకపోవడం, తదితర వ్యవహారాలు కోర్టు వరకు వెళ్లినా , పెద్దగా టీడీపీకి జరిగిన నష్టం ఏమీలేదు. ప్రజల్లో వైసిపి వాళ్ళు టీడీపీ పై కక్ష సాధిస్తున్నారు అనే ఆలోచన తప్ప..ఇక మరో విషయం.సంగం డైరీ విషయంలోనూ టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ పరంపర బాగా అగ్గి రాజేసింది.. ఆ తరువాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. అయిన కానీ ఇప్పటి వరకు సంగం డైరీ లో అక్రమాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించలేదు..  అయితే అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.నారాయణ విద్య సంస్థలకు నిధులు మళ్లించారంటూ.. నారాయణ విద్య సంస్థలు అక్రమాలకు పడపడుతున్నాయంటూ.. పేదలను మభ్యపెట్టి భూములు కాజేశారంటూ వివిధ కారణాలతో మాజీ మంత్రి నారాయణని అరెస్ట్ చేశారు.. ఇక అంతే కాదు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంచి మాస్ లీడర్.. ట్రావెల్స్ కి ఆయన పెట్టింది పేరు.. ఎలాగైనా తనని దెబ్బ కొట్టాలని అనుకున్న వైసిపి జేసీ ట్రావెల్స్ పై పడింది.. అనుమతి లేని బస్సులు ఉన్నాయని.. ఫిట్ నెస్ లేదని.. ఒకే నుంబర్ తో చాలా బస్సులు నడుపుతున్నారని జేసీకి సంబంధించిన కొన్ని బస్సులు సీజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలకు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు.  శాంతి భద్రతలకు విఘాతం కల్గించారని దేవినేని ఉమాపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా.. అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో వివాదం సృష్టించారని.. ముందస్తుగా అనుకున్నట్లే ఉమా తన అనుచరులతో అక్కడకు వెళ్లారని పోలీసులు అంటున్నారు. కాగా.. తనపై దాడి జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు రాలేదని దేవినేని ఉమా ఆరోపించారు. పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లు విసిరారని చెప్పారు. సీఎం జగన్, సజ్జల నాయకత్వంలోనే తనపై దాడి జరిగిందన్నారు. కొండపల్లి రిజర్వు అడవిలో లక్షల విలువైన గ్రావెల్  దోపిడీ జరిగిందని ఉమా ఆరోపించారు.దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లాయి. దాడిలో ఉమా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో గత మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్రమాలపై ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతుంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చేసారని టీడీపీపై వైసీపీ.. వైసీపీ పై టీడీపీ ఆరోపణలు చేస్తున్నాయి. అంతే కాదు మైనింగ్ వ్యవహారం.. పోలవరం డ్యామ్.. రాజధాని నిర్మాణం.. వివిధ పథకాల్లో అక్రమాలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తే.. మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కాకుండా మీకు మీరే లాభం పొందారని వైసీపీ ఆరోపిస్తుంది. ఆరోపణలను పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షసాధింపు చర్యకు పాల్పడుతుందని యావత్ రాజకీయ వర్గానికి, ఏపీ ప్రజలకు అర్థం అవుతుంది. ఒకవేళ టీడీపీ నాయకులు అవినీతికి కుట్రలకు పాల్పడితే.. కేవలం కేసులు పెట్టి వదిలేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. అధికారంలో ఉండి కూడా ఎందుకు సాక్షాలను సేకరించి.. తప్పును రుజువు చేయలేకపోతుంది అనేదే ప్రశ్న.? మొత్తం మీద వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను కేసులతో దెబ్బ కొట్టాలని చూస్తున్నారనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles