23.6 C
New York
Monday, September 20, 2021

2023 ఎన్నికల్లో జనసేనాని క్రొత్త పొత్తులతో ముందుకు రాబోతున్నారా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విశేషమైన ఫాన్స్ ఉన్నారు. వారిని జాగ్రత్తగా రాజకీయాలకు కన్వర్ట్ చేసుకుంటే కధ బాగానే ఉంటుంది. అయితే 2014లో చంద్రబాబు ఆ పని చేసుకోగలిగారు. సీఎం అయ్యారు. 2019 కి వచ్చేసరికి సొంతంగా పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫాన్స్ ను ఓట్లుగా మార్చుకోలేక దెబ్బ తిన్నారు అన్న విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రాజకీయ పండితులకు అర్ధమయ్యే విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్. పైగా యూత్ లో విశేష ప్రభావం కలిగిన నాయకుడు. ఆయన్ని మంచి చేసుకుంటే ఆ ఓట్లలో మెజారిటీ ఏ పార్టీకైనా టర్న్ అవుతాయి అని. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా రాజకీయ తెరపైన జత కట్టని కొత్త కాంబోతో ఫ్యూచర్ లో కనిపిస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ బలం తెలిసిన తెలంగాణా అధికార పార్టీ ఆయన కోసం స్నేహ హస్తం అందివ్వబోతుంది అంటున్నారు. పవన్ కనుక సరే అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనతో పొత్తు కలిపేందుకు కూడా రెడీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2023లో తెలంగాణాలో జరిగే ఎన్నికలు చాలా సంచలనంగా ఉంటాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి వచ్చి T.R.S జనాలకు కొంత బోర్ కొడుతుంది. అదే సమయంలో అధికారం కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ గట్టిగానే పోటీ పడతాయి. ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడేందుకే T.R.S కొత్త నేస్తాల కోసం చూస్తోందంట. పవన్ కళ్యాణ్ ఏడేళ్ల రాజకీయం చూస్తే ఆయన 2014 మార్చిలో జనసేన పార్టీని పెట్టినపుడు ఆ తరువాత మరికొన్ని సందర్భాలలో తప్ప ఎన్నడూ T.R.Sని విమర్శించలేదు అన్న సంగతి తెలిసిందే. ఇక కేసీయార్ ని పవన్ కళ్యాణ్ అనేకసార్లు పబ్లిక్ గానే మెచ్చుకున్న సంఘటనలూ ఉన్నాయి. మరో వైపు చూస్తే మెగా ఫ్యామిలీకి కల్వకుంట వారి కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలున్నాయి. కేటీయార్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిత్రుడు అయితే కేసీఆర్ తో మంచి దోస్తీ మెగా స్టార్ చిరంజీవికి ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ జనసేన T.R.S కి మద్దతుగా ఉండడం అన్నది అసంభవం కానీ అసహజ పరిణామం కానీ కాదనే ఎవరైనా అంటారు.ఇక ఏపీ విషయానికొస్తే.. ఇక్కడ కూడా జనసేన ఉంది. పైగా కేసీయార్ T.R.Sకి తెలంగాణా మాత్రమే ముఖ్యం. అక్కడ T.R.Sకి మద్దతు ఇస్తే జల వివాదాల విషయంలో కానీ ఏపీ హక్కుల విషయంలో కానీ మాట్లాడేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు పవన్ కళ్యాణ్ కి తప్పకుండా వస్తాయి. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో కేసీయార్ ని ఎదిరించే ఆంధ్రా నేతలు కూడా ఎవరూ లేరనే చెప్పొచ్చు. జగన్ కి ఆయనతో దోస్తీ ఉందని, అలాగే చంద్రబాబు కూడా కేసీయార్ ని పల్లెత్తు మాట అనరని అందరికీ తెలుసు. ఈ నేపధ్యంలో బీజేపీ,  కాంగ్రెస్ ల నుంచే మాత్రమే జనసేనాని సమస్యలు వస్తాయి. వాటికి ఏపీలో ఉన్న రాజకీయ భూమికను చూసినట్లయితే పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు. మొత్తానికి జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల వేళకు కొత్త పొత్తులు ఎత్తులతో ముందుకు వస్తారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.?!

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles