23.2 C
New York
Tuesday, September 21, 2021

జనసేనలోకి రానున్న బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుంచి టాలీవుడ్ బ‌డా నిర్మాత‌గా ఎదిగిన బండ్ల గ‌ణేశ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. న‌టుడిగా..నిర్మాత‌గా కంటే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు బండ్ల‌. కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా… బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే ప‌వ‌న్‌కి వీర భ‌క్తుడు అయిన బండ్ల గ‌ణేశ్.. జ‌నసేన పార్టీలో కాకుండా కాంగ్రెస్‌లో ఎందుకు చేరార‌నే సందేహం అప్పట్లో పీకే ఫ్యాన్స్ ఉండేది. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా జ‌న‌సేన ఆవిర్భ‌విస్తే.. పీకే ఫ్యాన్ అయిన బండ్ల గ‌ణేశ్ కాంగ్రెస్‌లో చేర‌డంపై అప్ప‌ట్లో జ‌న‌సైనికుల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే తాను ఇంతవరకూ జ‌న‌సేన పార్టీలో చేర‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పారు బండ్ల గ‌ణేశ్. తాజాగా ఓ మీడియా ఛానల్ కిచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అని చెప్పారు. అందుకే ఆ పార్టీలో చేరాన‌ని తెలిపారు. అంత‌కు మించి కార‌ణాలు ఏవీ లేవు. కానీ పవన్ క‌ళ్యాణ్ మంచి స్థానంలో ఉండాలని కోరుకున్నాను. ఇప్ప‌టికీ కోరుకుంటాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై త‌న అభిమ‌నాన్ని మ‌రోసారి చాటుకున్నారు. మీ అమ్మానాన్న అంటే ఎలా ఇష్ట‌మో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అలాగే ఇష్టం అన్నారు. దేవుడు వరం ఇచ్చినా ఇవ్వక పోయినా దేవుడికి దండం పెట్టుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడికి దండం పెట్టుకోవడం మానేయం కదా. అలాగే పవన్ కళ్యాణ్‌ కూడా మా బాస్. ఆయన నాకు సినిమాల్లో జీవితం ఇచ్చారు. ఆయనంటే అభిమానం అనేకంటే ఆయనపై కృతజ్ఞత అనొచ్చు” అని చెప్పారు. కానీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్న బండ్ల గణేష్ తాజాగా ఓ ట్విట్ చేసాడు. అందులో ”తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది” అని తెలియజేశాడు. దాంతో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని పవన్ స్థాపించిన జనసేనలో చేరబోయతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. బండ్ల జనసేనలో చేరబోతున్నాడు అని గుసగుసలు వినిపిస్తుండటంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. అందుకే బండ్ల గణేష్ ఎన్ని చేసినా కూడా ఈయనంటే పవన్ అభిమానులకు ఎంతో అభిమానం.. గౌరవం కూడా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో జనసేనను చూసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేం జరగలేదు. దాంతో పాటు పవన్‌కు దూరంగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నా బండ్ల గణేష్. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మళ్లీ ట్వీట్ చేసిన ఈయన తన ట్విట్టర్‌లో పవన్ ఫోటో ఒకటి ట్వీట్ చేసాడు. నేను భయంతో రాలేదు.. బాధ్యతతో వచ్చాను అని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పోస్ట్ చేసాడు. ఇది నిజం అంటూ బండ్ల గణేష్ ఆ ఫోటోను షేర్ చేయడంతో ఆసక్తి మొదలైంది.చాలా రోజుల తర్వాత మళ్లీ పవన్ మెప్పు కోసం బయల్దేరాడు బండ్ల గణేష్. పవన్ కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన బ్యానర్‌లో సినిమా కోసమే బండ్ల ఇలా భజన మొదలుపెట్టాడని కొందరంటుంటే.. అలాంటి అవసరం ఆయనకు లేదని
మరికొందరు బండ్ల గణేష్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా బండ్ల మళ్లీ పవన్ భజన మాత్రం మొదలుపెట్టాడు.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!