20.1 C
New York
Thursday, October 21, 2021

చలికాలంలో అది చేయొచ్చా సంతానోత్పత్తికి ఏది బెస్ట్ సీజన్ | Best Season for Family Planning

చలికాలంలో సెక్స్ కోరికలు తెలియకుండానే పెరిగిపోతాయి. చల్లని వాతావరణం వెచ్చని కోరికలను రగిలించడం వల్ల జంటలు దగ్గరవుతారు. మరి, చలికాలం సెక్స్‌కు మంచిదేనా? సంతానం కోసం ప్రయత్నించేవారికి ఈ సీజన్ మంచిదేనా? ఇటీవల సంతాన సమస్యలు బాగా పెరుగుతున్నాయి. చాలామంది పిల్లల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్నారు. దీనికి కచ్చితమైన కారణాలను సైతం అంచనా వేయలేకపోతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్లే పురుషుల్లో సంతాన లేమి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. ఇందుకు మారుతున్న జీవనశైలి కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు. అయితే, చలికాలంలో సెక్స్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో చూసేద్దామా! చలికాలమంటే కోరికలు రగిలించే కాలమని అంటారు. ఈ సమయంలోనే పురుషుల్లో ఎక్కువ సెక్స్ కోరికలు కలుగుతాయట. మిగతా కాలాల్లో కంటే చలికాలంలోనే ఎక్కువగా సెక్స్ కోసం పరితపిస్తుంటారట. అందుకే.. చాలా దేశాల్లో చలికాలానికి కొన్ని నెలల ముందు లేదా వర్షాకాలంలో జంటలకు పెళ్లి చేస్తారట. దీనివల్ల వారు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొని త్వరగా పిల్లలను కంటారని భావిస్తారట. పైగా, సైక్స్ లైఫ్ బాగుంటే.. దాంపత్య జీవితం కూడా బాగుంటుందని ఆశిస్తారట. చలికాలంలో ఆ కోరికలు కలిగేందుకు కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. సాధారణంగా వేసవిలో వేడి ఉష్ణోగ్రత వల్ల జంటలు దగ్గరయ్యేందుకు ఇష్టపడరట. శరీరాల రాపిడి వల్ల చెమట, చికాకు పెరగడమే ఇందుకు కారణం. అయితే, చలికాలంలో శరీరాలు వెచ్చదనాన్ని కోరుకుంటాయి. సెక్స్ చేస్తున్నప్పుడు శరీరంలో వేడి పుడితుంది. ఆ వేడి చికాకుకు బదులు ఎంతో హాయి కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సేపు సుఖాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది. చల్లదనం వల్ల పురుషుల అంగం త్వరగా గట్టిపడటమే కాకుండా ఎక్కువ సేపు స్తంభిస్తుందట.


మిగతా సీజన్లతో పోల్చితే ఈ నెలలో మహిళల్లో రుతుక్రమ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయట. కాబట్టి.. వీరు కూడా ఈ సీజన్లో పడక గదిలో పార్టనర్‌కు గట్టి పోటీయే ఇస్తారట. ఓ సర్వేలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చలికాలంలో సెక్స్ చేస్తే.. మహిళల్లో రుతుక్రమ సమస్య తగ్గుముఖం పడుతుందట. చలికాలం జబ్బులకు సీజన్ అనే సంగతి తెలిసిందే. అయితే, వాటికి చిక్కుకోకుండా ఉండాలంటే.. సెక్స్ మంచి వ్యాక్సిన్‌లా పనిచేస్తోందట. ఈ కాలంలో సూర్యరశ్మీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. శరీరానికి కావాల్సినంత ‘విటమిన్-డి’ లభించదు. దీనివల్ల చాలా నీరసంగా అనిపిస్తుంది. ఈ సమయంలో వైరస్‌లు, బ్యాక్టీరియాలు దాడి చేస్తే త్వరగా అనారోగ్యానికి గురవ్వుతారు. అయితే, సెక్స్ చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయమం లభించడమే కాకుండా.. వైరస్‌లతో పోరాడేందుకు తగిన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చలికాలంలో ఆలుమగలిద్దరూ చురుగ్గా ఉండటం వల్ల సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలను కనాలని ప్లాన్ చేసుకొనేవారికి ఇదే తగిన సమయం. వేసవితో పోలిస్తే చలికాలంలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. చలికాలంలో ఏ సమయంలో సెక్స్‌లో పాల్గొన్నా.. పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయట. కాబట్టి.. సంతానం కోసం ప్రయత్నించేవారు తప్పకుండా ఈ సీజన్‌ను సద్వినియోగం చేసుకోండి. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు అన్నీ మంచి రోజులే. అయితే, ఈ రోజుల్లో పురుషులు చలివేస్తుందనే కారణంతో వృషణాలను బిగువైన వస్త్రాలతో కప్పేసి.. అక్కడ ఎక్కువ వేడిని పుట్టించకండి. అది సంతాన సమస్యలను సృష్టించవచ్చు. చలికాలంలో టెస్టోస్టెరాన్ (వృషణాల స్రావం) ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఈ సీజన్లో సంతానం కోసం తప్పకుండా ప్రయత్నించండి. గుడ్‌ లక్! 

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!