6.8 C
New York
Thursday, December 2, 2021

దాని గురించి మనం నమ్మే కొన్ని పచ్చి అబద్ధాలు | Bland Lies About Love Making We Believe

దాని గురించి మనం నమ్మే కొన్ని పచ్చి అబద్ధాలు | Bland Lies About Love Making We Believe

ఈ ప్రపంచంలో చాలామందికి శృంగారం గురించి ఉన్న అపోహలు మరే ఇతర విషయం గురించి కూడా లేవు అంటే అది అతిశయోక్తి కాదు… ఎందుకంటే చాలామందికి శృంగారం గురించి సరైన అవగాహన లేకపోవడంతో వాళ్లకు ఎవరో చెప్పినవి లేదా వాళ్ళ ఎక్కడో చదివిన విషయాలు ఇలా దేన్నీ పడితే దాన్ని నమ్ముతూ అనవసరమైన అపోహలు కొని తెచ్చుకుంటూ బతికేస్తుంటారు…. అయితే నిజంగా శృంగారం గురించి అందరూ అనుకునే అపోహ ఏంటి కానీ దాని గురించి నిజం ఏంటి… ఇప్పటి వరకు మీరు కూడా శృంగారం గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు కదా… అసలు వాటిలో ఏది నిజం ఏది అబద్దం అన్న విషయం కొందరు సెక్సాలజిస్ట్ లు తేల్చి చెప్పారు. వాటిని మనం కూడా తెలుసుకుందాం పదండి…

1. శృంగారం ఎక్కువ కాలరీస్ బర్న్ చేస్తుంది!!!!

ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే నిజం కాదు… ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు శారీరకంగా వారిద్దరిలో ఎక్కువగా కదలికలు ఉంటాయి కాబట్టి శృంగారం చేయడం ద్వారా దాదాపు 335 నుంచి 1255 క్యాలరీస్ శక్తి ఖర్చు అవుతుందని అది ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలామందిలో ఒక అపోహ ఉంది… నిజానికి శృంగారంలో పాల్గొనడం ద్వారా అంత క్యాలరీస్ ఖర్చు అవ్వవు ఒక వేళ ఆ రేంజ్ లో క్యాలరీస్ ఖర్చు అవ్వాలి అంటే మీరు దాదాపు 30 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొనాలి… కానీ మనం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం లో తీసుకున్న ఒక జంట శృంగారంలో పాల్గొనే సమయం అవరేజ్ గా చూసుకుంటే అది కేవలం ఆరు నిమిషాలు మాత్రమే… అంటే ఇది నిజం కాదు అబద్ధం అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది.

2. చాక్లెట్ తింటే శృంగారపరమైన కోరికలు కలుగుతాయి!!!!

చాలా సినిమాల్లో చూపించినట్టు లేదా బయట చాలా మంది యూత్ లో దీని గురించి ఒక బలమైన నమ్మకం ఉన్నట్టు ముఖ్యంగా లేడీస్ డార్క్ చాక్లెట్ తింటే గనుక వాళ్లలో శృంగారపరమైన కోరికలు ఎక్కువగా కలుగుతాయి అన్న ఒక అపోహ ఉంది కానీ అది ఎంత మాత్రం నిజం కాదు అబద్ధం. ఎందుకంటే చాక్లెట్స్ తినడం ద్వారా శృంగారపరమైన కోరికలు కలగడం అన్నది జరగదు కాకపోతే మీ నోటికి సడన్ గా ఎక్కువ మోతాదులో స్వీట్ తగలడంతో మీ మైండ్ కొంచెం షార్ప్ అవుతుంది మీరు ఎక్కువ హ్యాపీ గా కూడా ఉండగలుగుతారు అంతే తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు.

3. లేడీస్ లేట్ ఏజ్ లో ఎక్కువగా శృంగారం ఎంజాయ్ చేస్తారు!!!!

ఇది కూడా కేవలం ఒక అపోహ మాత్రమే… ఎందుకంటే మెచ్యూరిటీ అయిన తర్వాత నుంచి టీనేజ్ వయసు లోకి వచ్చిన తర్వాత అమ్మాయిల్లో శృంగార పరమైన కోరికలు మొదలవడం స్టార్ట్ అవుతుంది… ఇక అక్కడి నుంచి వాళ్లు శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళు శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు… కాకపోతే లేటు వయసులో ఘాటు రొమాన్స్ అంటూ ప్రచారంలో ఉన్న కథనం లేడీస్ విషయంలో కొంతమేర నిజమే అయినప్పటికీ తాము అనుకుంటే లేడీస్ ఏ ఏజ్ లో అయినా శృంగారం ఎంజాయ్ చేయగలరు.

4. శృంగారం స్పోర్ట్స్ పర్ఫామెన్స్ దెబ్బ తీస్తుంది!!!!

ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడుతున్న ఏ క్రీడాకారులు అయినా ఎక్కువగా శృంగారం చేయడం ద్వారా అది తమ కెరీర్ మీద దెబ్బ తీస్తుంది అన్న అపోహ చాలా మందిలో ఉంది… కానీ ఇది నిజం కాదు కేవలం అపోహ మాత్రమే… ఎందుకంటే శారీరకంగా ఎప్పుడు ఫిట్ గా ఉండే స్పోర్ట్స్ పర్సన్స్ శృంగారం చేసినప్పుడు కూడా అంతే ఫిట్ గా ఉంటారు తప్ప వాళ్ళ లో ఎలాంటి మార్పు జరగదు… చాలా మందిని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది నిజం అని చెబుతుంటారు కానీ ఎప్పుడు స్పోర్ట్స్ ఆడుతూ స్ట్రెస్ టెన్షన్లు తో ఉండే స్పోర్ట్స్ పర్సన్ కి శృంగారం అనేది ఒక మంచి రిలాక్సేషన్ ఇచ్చే విషయమే.

5. మగవాళ్ళు ఎక్కువగా శృంగార పరమైన ఆలోచనలు చేస్తారు!!!!

దీంట్లో కూడా నిజం లేదు… ఎందుకంటే మగవారితో సమానంగా ఆడవాళ్ళకి కూడా శృంగారపరమైన కోరికలు ఆలోచనలు ఎక్కువగానే కలుగుతూ ఉంటాయి… అయితే మగవాళ్లకు సంబంధించిన కోరికలు బయటకు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్లే శృంగారం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అని అంటుంటారు… కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది అమ్మాయిలు కూడా తనలో ఎన్నో శృంగారపరమైన కోరికలు ప్రతిరోజు కలుగుతూ ఉంటాయి అని కాకపోతే పరిస్థితులను బట్టి వాటిని అదుపులో పెట్టుకుంటూ ఉంటారు అని ఎన్నో సర్వేల్లో కూడా చెప్పారు.

6. హార్ట్ అటాక్ కూడా రావచ్చు!!!!

ఇంతకంటే సిల్లీ అపోహ అనేది ఇంకొకటి ఉండదు… ఎందుకంటే శృంగారం అనేది మనిషికి శారీరకంగా మానసికంగా ఒక విధమైన ఉత్సాహం రిలాక్సేషన్ ఇస్తుంది తప్ప వారి ఆరోగ్యానికి ఎటువంటి హాని కూడా చేయదు… అబ్బా అయితే బాగా వయసు అయిపోయిన ముసలివాళ్ళు తమ ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా శృంగారంలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు తప్ప ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగదు.

7. శృంగారం కేవలం యంగ్ ఏజ్ వారికే!!!!

దీంట్లో కూడా ఎలాంటి నిజం లేదు… ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉండి శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా వాళ్లు ఎలాంటి వయసులో ఉన్న కూడా నిరభ్యంతరంగా శృంగారంలో పాల్గొనవచ్చు… అంతేగాని శృంగారానికి కేవలం ఒక పర్టికులర్ వయస్సు అంటూ ఏదీ లేదు… మీ శరీరం సహకరించినన్నీ అన్ని రోజులు శృంగారం ఎంజాయ్ చేయగలుగుతారు.

సో ఫ్రెండ్స్ అవండి… శృంగారం గురించి చాలామందిలో ఉన్న అపోహలు అనుమానాలు వాటికి సరైన నా సమాధానాలు… శృంగారం గురించి ఎన్నో కొన్ని అనుమానాలు ఉండే ఉంటాయి… అయితే మీరు వాటిని గుడ్డిగా నమ్మి అనవసరంగా టెన్షన్ పడకుండా కొంచెం కూల్ గా ఉంటూ ఏది నిజం ఏది అబద్దం అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి… శృంగారం విషయంలో దాదాపు చాలామందికి ఒక అవగాహన ఉండటం లేదు… మీరు కనుక ఆ అవగాహన తెచ్చుకోగలిగితే అది మీకు మీకు మీతో శృంగారం చేసే మీ పార్టనర్ కు కూడా అది చాలా హెల్ప్ అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!