22 C
New York
Wednesday, September 22, 2021

ఒళ్ళు గగురు పొడిచేలా…. బైరెడ్డి జీవిత చరిత్ర

తన చదువు ఆపిన తరువాత సిద్ధార్థ రాజకీయాల్లోకి రావాలని.. తన పెద్ద నాన్న రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లాడు. పెద్ద నాన్న.. నాకు చదువు ఇష్టం లేదు.. నేను నీతో కలిసి రాజకీయాల్లో పనిచేస్తా అన్నాడు.. అయితే దీనిపై ఆలోచించిన రాజశేఖర రెడ్డి సరే కానీ.. మీ అమ్మ నాన్న లకు నువ్వు ఇలా చేయడం ఇష్టం ఉందా అన్నాడు.. వారికి ఎక్కువగా ఇష్టం లేదని చెప్పాడు సిద్ధార్థ రెడ్డి. తరువాత ఇది విన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి , నేను మీ అమ్మ నాన్న లతో మాట్లాడుతూ అని సిద్ధార్థ తో అన్నాడు. అయితే సిద్ధార్థ రెడ్డి చదువు ఆపేసి, రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. సిద్ధార్థ రెడ్డికి చిన్న నాటి నుండి తన అమ్మ అంటే ఇష్టంతో, అమ్మ చెప్పిన ప్రతి మాట వినేవాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అయితే తన కొడుకు సిద్ధార్థ రెడ్డి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పిన కానీ, సిద్ధార్థ రెడ్డి వినలేదు. అయితే రాజకీయాల్లోకి వచ్చి తన పెద్ద నాన్న రాజశేఖర్ రెడ్డికి తోడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డి.. తన పెద్ద నాన్నకు కొన్ని తల నొప్పులు చేసే పనులు చేశాడుని.. ఒక మర్డర్ చేయడంలో సిద్ధార్థ రెడ్డి హత్తం ఉంది అనే ఆరోపణలు వచ్చాయి.. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిద్ధార్థ రెడ్డి పై కోపం వచ్చింది. తనని క్షమించమని సిద్ధార్థ రెడ్డి వేడుకున్నా కానీ రాజశేఖర్ రెడ్డి.. సిద్ధార్థ రెడ్డిని దూరం పెట్టాడు. మర్డర్ కేసులో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. జైల్లో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాడు సిద్ధార్థ రెడ్డి. ఈ రాజకీయలకు గొడువలకు దూరంగా ఉండాలని నిర్ణయయించుకున్నా కానీ.. సిద్ధార్థ రెడ్డి జైలు నుంచి విడుదలైన రోజు తన కోసం వచ్చిన అభిమానులను చూసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. రాజకీయమే తన జీవితంగా.. ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు సిద్ధార్థ రెడ్డి. తన విడుదలైన తర్వాత సిద్ధార్థ రెడ్డి 4 సంవత్సరాల పాటు తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు చేరువయ్యాడు.. దీంతో తన పెద్ద నాన్న కు సిద్ధార్థ రెడ్డి కి మధ్య మరింత దూరం పెరిగింది.తర్వాత ప్రజలకు సేవ చేయాలంటే పదవి, పార్టీ అని అనుకున్న సిద్ధార్థ రెడ్డి.. తన లక్ష్యాన్ని చేధించడానికి అనువైన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో TDP లో చేరాలని.. TDP నేతలు నారా లోకేష్.. TG వెంకటేష్ లను సిద్ధార్థ రెడ్డి కలిసి తన లక్ష్యాన్ని తన సిద్దాంతాలను తెలిపాడు. దీంతో వాళ్ల తీరును అర్థం చేసుకున్న సిద్ధార్థ రెడ్డి TDP లో చేరలేడు. ఆ తర్వాత YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సిద్ధార్థ రెడ్డి తన లక్ష్యాన్ని తన సిద్దాంతాలను తెలిపాడు. దీంతో YCP అధినేతకు సిద్ధార్థ రెడ్డి,తీరు లక్ష్యాలు నచ్చిన జగన్ సిద్ధార్థ రెడ్డి ని పార్టీలోకి ఆహ్వనించాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నందీకొట్కుర్ YCP పార్టీ ఇంచార్జీ గా  నియంమించాడు YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో తన నియోజకవర్గం అసెంబ్లీ సీట్లు కు SC రిజర్వేషన్ రావటంతో.. సిద్ధార్థ రెడ్డి ఎవ్వరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వారే ఎమ్మెల్యే అభ్యర్థి అని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీంతో YCP అనుకున్నట్టుగానే.. నందికొట్కురు MLA అభ్యర్థిగా అర్థర్ ను నామినేట్ చేశాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అంతే కాకుండా ఎన్నికల్లో ప్రచారం చేసి భారీ మెజార్టీతో పార్టీ అభ్యర్తిని గెలిపించాడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి. నందికొట్కూరు లో మాత్రమే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సిద్దార్థ రెడ్డికి ఫాలోయింగ్ ఉంది. తన మాటలతో ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్నాడు. జగన్ కి మంచి నమ్మకం కలిగిన వ్యక్తి కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కావడంతో రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మెన్ గా సిద్దార్థ రెడ్డిని నియమించాడు ముఖ్యమంత్రి జగన్. ఎన్నో ఆటంకాలు ఎదుర్కుని.. రాజకీయాల్లోకి వచ్చి.. రాజకీయానికి అనుభవం అవసరం లేదని స్పష్టం చేశాడు  సిద్ధార్థ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా ఉంటు.. ఫైర్ బ్రాండ్ నేతగా పేరుతెచ్చుకున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!