11.3 C
New York
Saturday, October 23, 2021

కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టిన బిజెపి

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ ఢిల్లీ లో మొత్తం 15 ఎకరాల స్థలంలో నిర్మితమవుతోంది.. భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి 15 ఎకరాల పార్లమెంట్ స్థలం చాలా తక్కువే.. అసలు లెక్కలు వేస్తే ఇంతకన్నా ఎక్కువు స్థలాన్ని కేటాయించి పార్లమెంట్ ను నిర్మించాలి.. కానీ ప్రధాని మోదీ ముందు చూపుతో, ఆధునికతతో.. తక్కువ స్థలంలోనే పార్లమెంట్ నిర్మించడానికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు.. రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నాయకులకి ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంశం దొరికింది.. నూతన పార్లమెంట్ కోసం అసలు ఇంత స్థలం అవసరమా.. అన్ని కోట్లు అవసరమా.. కరోనా తీవ్రంగా ఉన్నా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎందుకు ఆపడం లేదని పిచ్చి ప్రశ్నలు వేశారు. 

 గాంధీ కుటుంబం చూపిన లెక్కల్లోనే పరిశీలిస్తే.. న్యూ ఢిల్లీలో.. అంటే దేశ రాజధానిలో కేవలం గాంధీ కుటుంబం 153 ఎకరాల స్థలాన్ని అనుభవిస్తుంది.. దీనిని ప్రత్యేకంగా నెహురు గాంధీ కుటుంబం కోసమే కేటాయించారు.. రాహుల్ చెపుతున్న లెక్కలో.. 15 ఎకరాల్లో నూతన  పార్లమెంట్ న్యాయమా? లేదా.. 153 ఎకరాలను నెహ్రు ఫామిలీ అనుభవించడం సరైందా.. వీటన్నింటికి సోనియా రాహుల్ ప్రియాంక ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే.. 

స్వాతంత్రోద్యమంలో ఆ తరువాత అనేక మంది దేశం కోసం ఎంతో సేవ చేశారు.. నిన్నటి వరికి పాలించిన ఎందరో నాయకుల సేవలు వెలకట్టలేనివి.. అయితే భారత్లో ఎవరికీ కేటాయించని భూములు, లైబ్రరీలు, మెమోరియల్ స్థలాలు ఒక్క నెహ్రు గాంధీ కుటుంబానికి మాత్రమే కేటాయించారు.. ఒక్కో వ్యక్తికీ సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించబడింది, వీటివల్ల ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి లాభం చేకూరడం లేదు.

నెహ్రు మొదలుకొని రాహుల్ ప్రియాంకాల వరకు కేటాయించిన స్థలాలని ఒకసారి పరిశీలిద్దాం.. జవహర్లాల్ నెహ్రు సమాధి అయిన ‘శాంతి వన్’ కి 52.6 ఎకరాలు, ఇందిరాగాంధీ సమాధి ‘శక్తి స్థల్’ కు 45 ఎకరాలు, రాజీవ్ గాంధీ ‘వీరు భూమి’కి 15 ఎకరాలు, ‘నెహ్రు మెమోరియల్ మ్యూజియం’ కు 30 ఎకరాలు, సోనియా గాంధీ ప్రస్తుతం నివసిస్తున్న ’10 జనపథ్’ కు 3. ఎకరాలు, రాహుల్ గాంధీ ఇల్లు కార్యాలయానికి 1.24 ఎకరాలు, ‘ఇందిరా గాంధీ మెమోరియల్ మ్యూజియం’ కు 7. 75 ఎకరాలు..  ఈ మొత్తం 153 ఎకరాలు కేవలం గాంధీ కుటుంబం మాత్రమే అనుభవీస్తుంది.. పార్లమెంట్ నిర్మాణాన్ని వ్యతిరేకించే రాహుల గాంధీ.. మొదట వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే..

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!