23.2 C
New York
Tuesday, September 21, 2021

మీ పార్టనర్ ను చీట్ చేయాలనుకుంటున్నారా అయితే ఇది చూడండి!!!!

లవ్ లో ఉన్నప్పుడో లేదా పెళ్లయినా తర్వాతనో చీటింగ్ అనేది కామన్ గా జరుగుతూనే వుంటుంది… చీటింగ్ వల్ల నష్టపోయేది కొందరయితే ఆ నష్టాన్ని చేసేది మరికొందరు… ఇక్కడ మీరు చీటింగ్ చేసే సైడ్ వుంటారా లేదా చీట్ అవబడే సైడ్ వుంటారా అన్నది మీ ఛాయిస్…. అయితే ఒకవేళ పొరపాటున మీకు గనక మీ పార్టనర్ ను చీట్ చేయాలి అన్న ఆలోచన వస్తే అది చాలా డేంజర్… అంటే మీరు నెగిటివ్ సైడ్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారన్న మాట… అలా అవడం మీ లైఫ్ కి… మీ పార్టనర్ లైఫ్ కి కూడా అస్సలు మంచిది కాదు… అయితే ఈ విషయం గురించి ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ కొంత మంది అసలు తమ పార్టనర్స్ ను ఎందుకు చీట్ చేస్తారు..? అసలు చీట్ చేయాలన్న ఆలోచన వాల్లకెందుకు వస్తుంది అన్న విషయాల మీద సర్వే చేసిందట దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సో ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం…

 మీకెప్పుడైనా మీ పార్టనర్ ను చీట్ చేయాలన్న ఆలోచన వస్తే ఇక్కడ మేము ఆ సర్వేలో చెప్పిన పాయింట్స్ అన్నీ చెప్పే కొన్ని పాయింట్స్ మీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి… ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి!!!!

1. కోరుకుంది దక్కకపోవడం!!!!

ఎవరైనా ఒక రిలేషన్ షిప్ లో వున్నప్పుడు అవతలి వ్యక్తి దగ్గరి నుంచి తాము కోరుకుంది దక్కకపోవడం వలనే చాలా మంది తమ పార్టనర్ ను చీట్ చేద్దాం అనుకుంటారట… ఇక్కడ కోరుకుంది దక్కకపోవడం అంటే అది ప్రేమ కావొచ్చు లేదా సెక్స్ కావొచ్చు లేదా మరొకటి కావొచ్చు తమకు దక్కాల్సింది దక్కడం లేదని తన పార్టనర్ తనతో సరిగ్గా వుండడం లేదని వాళ్ళకి శాటీస్ ఫాక్షన్ ఉండదట అప్పుడే పక్క దారులు వెతకడం స్టార్ట్ చేస్తారట… ఇద్దరు మనుషులు కలిసి వున్నప్పుడు మరొకరితో చిన్న చిన్న అలకలు డిస్ సాటిస్ ఫాక్షాన్ చాలా కామన్ కానీ అలాంటి వాటికే తమ పార్టనర్ ను చీట్ చేస్తున్నారట చాలా మంది.

2. అపార్థాలు :

ప్రేమలో వున్నప్పుడు లేదా పెళ్ళి తర్వాత ఒక రిలేషన్ లో అన్నీ బాగా వున్నప్పుడు ఏమీ తెలియదు… అసలీ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు… లైఫ్ ఎంతో ఎంజాయ్ చేస్తారు… అయితే మెల్లిగా ఆ బంధంలో చిన్న చిన్న గొడవలు, అలకలు స్టార్ట్ అవడంతో ఇద్దరి మధ్యలో అపార్థాలు వచ్చి చేరుతాయి… ఆ టైమ్ లో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను కూడా మర్చిపోతారు. ఎవరో చెప్పిన మాటలు విని తమ లైఫ్ పార్టనర్ ను అనుమానించడం వాళ్ళని ఒక శత్రువులా చూడ్డం చేస్తారట… అవేంత వరకు వెలతాయంటే తన పార్టనర్ తనకు కరక్ట్ కాదని వాళ్ళను చీటింగ్ చేయాలని కూడా చూస్తారట. అసలు ఒక్కసారి ఆ అపార్థాలు అన్నీ పక్కన పెట్టీ తమ పార్టనర్ ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం మంచిదని సర్వే చేసిన ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు.

3. తాము సరైన లైఫ్ పార్టనర్ ను ఎంచుకొలేక పోవడం

మీరెంత మంచి పర్సన్ అయినా… లైఫ్ పార్టనర్ అయినా కూడా మీరు ప్రేమించిన లేదా పెళ్ళి చేసుకున్న వాళ్ళు కరక్ట్ పార్టనర్ కానట్టయితే ఖచ్చితంగా మీరు మోసపోతారు… అందుకే మీరు కరక్ట్ పార్టనర్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని ఆ సర్వే వాళ్ళు చెపుతున్నారు… చాలామంది ఇక్కడే పెద్ద పొరపాట్లు చేస్తారట తమ పార్టనర్ గురించి అన్ని విషయాలు తెలుసుకోకుండా తొందరపడి ముందుకు వెళతారని వాళ్ళ సర్వేలో తేలిందట… లైఫ్ జర్నీలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వుండాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకునే మీ పార్టనర్ మీద కూడా డిపెండ్ అయి వుంటుంది సో చూజ్ యువర్ పార్టనర్ కరక్ట్లీ…

4. ఎమోషన్స్ ను సరిగ్గా ఎక్స్ ప్రెస్ చేయలేకపోవడం

ఏ రిలేషన్ షిప్ లో అయినా ఎదుటి వారు తమ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు తమతో ఎంత నిజాయితీగా ఉన్నారు అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీలో వున్న అన్ని ఎమోషన్స్ ను ఏటువంటి ఇబ్బంది లేకుండా మీ పార్టనర్ తో షేర్ చేసుకోలేకపోతే ఆ బంధంలో ఖచ్చితంగా ఏదో సమస్య ఉన్నట్టే అంట… అలా తమ ఎమోషన్స్ అన్నిటినీ ఫ్రీగా చెప్పుకోలేనప్పుడే అసలు సమస్యలు స్టార్ట్ అవుతాయని సర్వేలో తేలింది… అలా ఎమోషన్స్ స్వేచ్ఛగా ఎక్స్ ప్రెస్ చేయలేని వాళ్ళే ఆ తర్వాత ఇంకో తోడు కోసం చూస్తారని అలా తమ పార్టనర్ ను చీట్ చేస్తారని తెలిసిందట.

5. గుర్తింపు దక్కకపోవడం, అసంతృప్తి!!!!

ఒకరికి ఒకరు తోడుగా లైఫ్ లాంగ్ వుండడం అంటే అదంతా ఈజీ విషయం ఏం కాదు… ఇద్దరిలో ఏ ఒక్కరికీ తమకు అవతలి వ్యక్తి నుంచి సరైన గుర్తింపు దక్కడం లేదు అనిపించిన మరుక్షణం ఆ రిలేషన్ షిప్ ఒక నరక కూపం లా తయారవుతుంది. మీరెంత గా ఎఫర్ట్ పెట్టినప్పటికీ మీ పార్టనర్ రెస్పాన్స్ సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అనేది జరుగుతుంది… అది మెల్లిగా మిమ్మల్ని మీ పార్టనర్ కు దూరం చేయడం మొదలు పెడుతుంది.ఆ తర్వాత మీకు తెలియకుండానే మీ పార్టనర్ ను మీరు చీట్ చేయడం స్టార్ట్ చేస్తారట… అలాంటి అసంతృప్తిలే ఎంతో గొప్ప బంధంలో కూడా అల్లకల్లోలాలు సృష్టించి జీవితాలనే మార్చేస్థాయి అందుకే మీ పార్టనర్ మీతో సంతృప్తి గానే వుంటున్నారా లేదా అన్న విషయాన్ని పదే పదే చెక్ చేసుకోవటం మంచిది అని సర్వే లో పాల్గొన్న వారు చెప్పారట.

సో ఫ్రెండ్స్ అవండి మీరోక వేళ మీ పార్టనర్ ను గనక చీట్ చేయాలి అన్న ఆలోచన వచ్చినా లేదా అలాంటి పనులు మీరు చేయడం మొదలు పెట్టినా ఆ సర్వేలో చెప్పిన విషయాలను గురించి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీ ఇద్దరి జీవితాలు కూడా డిస్ట్రబ్ అవకుండా వుంటాయి.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!