23.2 C
New York
Tuesday, September 21, 2021

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

కరోనా సెకండ్ వేవ్ దెబ్బ చాలా గట్టిగానే తగులుతోంది. వైద్యం కొరత, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని రోడ్డు పక్కనే ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ కోసం దేశం మొత్తం అల్లాడిపోతోంది. స్టీల్ ఫ్లాంట్లు ఉన్న రాష్ట్రం నుంచి దేశానికి ఆక్సిజన్ వస్తోంది. అలా ఒడిశా ప్రస్తుతం దేశానికి ఆక్సిజన్ అందిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది. ఇక ఇందులో సోనూ సూద్ కూడా ముందడుగు వేశారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎదురుచూసేవారికి సోనూ సూద్ ఆపద్భాందవుడిలా కనిపిస్తున్నారు. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను సోనూ సూద్ రప్పిస్తున్నారు. అలా ఎంతో మంది ప్రాణాలను సోనూ సూద్ రక్షిస్తున్నారు. తాజాగా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు రక్తం సరైన సమయంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని గ్రహించిన చిరు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి అద్భుత నిర్ణయం తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓ పోస్ట్ చేసింది. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా చిరంజీవి చిరంజీవే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి ప్రకటిస్తామని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 

మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరికి తెలిసిందే. ఎంతో కష్టపడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ ఒక మంచి నటుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఇక ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడినా కూడా అభిమానుల సపోర్ట్ లేకుంటే అది సాధ్యమయ్యేది కాదని చెబుతుంటారు. అభిమానులంటే అమితంగా ఇష్టపడే మెగాస్టార్ మరో భారీ సహాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. చిరంజీవి , రామ్ చరణ్, పవన్ కళ్యాణ్.. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ హీరోలు కూడా ఏదో ఒక విధంగా అవసరమైన సమయాల్లో జనాలకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక మెగాస్టార్ కెరీర్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తాన్ని అందించారు. అందుకు అభిమానుల సపోర్ట్ చాలానే దక్కింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 1998లో ఒక సంఘటన నుంచి పుట్టుకొచ్చింది. సమయానికి రక్తం అందక మనుషులు చనిపోతున్నారు అనే విషయం గురించి ఆలోచించి ఫాస్ట్ గా బ్లడ్ బ్యాంక్ ను స్థాపించారు. అది చాలా వరకు ఉపయోగపడింది. ఈ 20 ఏళ్లలో కోట్లాది మంది ప్రాణాలను రక్షించడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంతకంతకు పెరుగుతుండడంతో మెగాస్టార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో సమయానికి ఆక్సిజన్ అందేలా ఆక్సిజన్ బ్యాంక్ కేంద్రాలను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవద్దని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను మరో వారం రోజుల్లో అందుబాటులోకి తేనున్నారు.  మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ఈ భారీ సేవా కార్యక్రమాల్లో రామ్ చరణ్ కూడా బాధ్యత తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇటీవల మెగాస్టార్ కోవిడ్ వలన ప్రాణాలు కోల్పోయిన TNR కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించిన విషయం తెలిసిందే. అలాగే పావలా శ్యామలకు, తన కారావ్యాన్ డ్రైవర్ కుటుంబానికి కూడా ఆర్థికంగా సహాయం చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!