20.1 C
New York
Thursday, October 21, 2021

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న`లూసీఫర్` హిందీలో వెబ్ సిరీస్ గా రాబోతోందా.?

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన “లూసిఫర్” సినిమా మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ కు దర్శకుడిగా ఇది మొదటి సినిమానే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కూడా పోషించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మోహన్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నటించడమే గాక.. ఇదే చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. అతడు ఆరంగేట్ర చిత్రమే అదరగొట్టాడన్న ప్రశంసలు దక్కాయి. మరి ఈ వెబ్ సిరీస్ లో ఎవరు హీరోగా నటించనున్నారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో రీమేక్ కాబోతున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆయన ఈ చిత్రాన్ని హిందీలో ఎనిమిది ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చల దశలో ఉంది.. ఫైనల్ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. హిందీ రీమేక్ లో మోహన్ లాల్ నటించవచ్చు లేదా ఉండకపోవచ్చు అని కూడా పృథ్వీరాజ్ తెలిపారు. ఇక మోహన్ లాల్ కి హిందీ పరిశ్రమ కొత్త కాదు. గతంలో కంపెనీ .. రామ్ గోపాల్ వర్మ కా ఆగ్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో బ్లాక్ బస్టర్ సినిమాల సీక్వెల్స్ తో బిజీ. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కి టాలీవుడ్ స్టార్ హీరోలతో సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబందాలు ఉన్న హీరో ఆయన. ఎయిటీస్ స్టార్ల రీయూనియన్ మీటింగుల్లో చిరు-లాల్ తప్పనిసరిగా కలుస్తుంటారు. అలాగే ఆయన ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ లో కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. తారక్ సహా మహేష్ తోనూ గొప్ప అనుబంధం ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!