20.1 C
New York
Thursday, October 21, 2021

.మోడీ మీద విషం కక్కుతున్న కాంగ్రెస్

ప్రధాని మోదీ ప్రకటించిన అందరికీ ఉచిత vaccinationలపై రాహుల్ గాంధీ వెటకారంగా సోషల్ మీడియాలో ఒక ప్రశ్నను లేవనెత్తారు.. ప్రధాని మోదీ అందరికీ ఉచిత వాక్సిన్ అని చెపుతూ ప్రైవేట్ వారికి ఎందుకు 25 శాతం అనుమతులిచ్చారో చెప్పమన్నారు.. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేస్తున్నా కూడా ఎందుకు ఉచితమని అసత్యాలు ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.. రాహుల్ ప్రశ్న సరైనదే.. కానీ మన వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వంతో నడిచేది కాదు.. ప్రైవేటు సంస్థలు కూడా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి.. కేంద్ర ప్రభుత్వం 100 శాతం vaccination ను ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు.. ఒక మాన్యూఫ్యాక్చరింగ్ సంస్థ 100 వాసీసీన్లని ఉత్పత్తి చేస్తే ఆ 100 వాసీసీన్లన్నింటినీఏ మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసి వాసీసీన్లని ఇవ్వడం సాధ్యం కాదు.. ప్రస్తుతం దేశంలో స్కూళ్లు, కాలేజీలు,  యూనివర్సిటీలు, బ్యాంకులు, ఇలా ఎన్నో సంస్థలు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాయి.. ఇప్పుడున్న ప్రైవేట్ రంగానికి కూడా ప్రభుత్వమే vaccination చేయాలన్న సాధ్యం కాదు..

ఇప్పటికి దాదాపు 25 కోట్లమందికి మొదటి డోసు ఇవ్వడం పూర్తయింది.. మిగిలిన వారంధరికి ఈ నెల 21 నుంచి ఫ్రీగా టీకాలను ఇవ్వనుంది మోదీ ప్రభుత్వం.. దీనికి అయ్యే ఖర్చుని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించనుంది..ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగానే అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ప్రైవేటు ఆసుపత్రులకి కూడా కేంద్రమే చెల్లించనుంది.. అయితే ఏ వాక్సిన్ కి ఎంత రేట్ ఉండాలనేది ముందే నిర్ణయించి నిబంధనలను కఠినతరం చేశారు.. 

జూన్ 21 నుండి ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ డ్రైవ్ భారత్లో జరుగనుంది.. ధీంతో ప్రధాని మోదీ మరో చరిత్రని సృష్టించబోతుండడంతో జీర్ణించుకోలేని గాంధీ కుటుంబం బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది.. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా.. వాక్సిన్ ఎక్కడ ఉచితంగా ఉంది, డబ్బులు వసూలు చేస్తున్నారుగా అని అర్థంలేని వాదనలకు దిగుతోంది.. రాహుల్ గాంధీకి తోడుగా అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా తోడయ్యాడు.. అసలు ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో వాక్సిన్ ఉచితంగా వేస్తున్నారో చెప్పాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా పై నెటీజన్లు జోకులు వేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.. భారత దేశంలోనే ఓ సంపన్న కుటుంబం ఉచిత వ్యాక్సిన్ల కోసం వెతుకుతోంది అంటూ పోస్ట్లు పెడుతున్నారు..

మోదీ ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 2లక్షల కోట్లు కేటాయించి పూర్తి planning తో కరోనా నుండి ప్రజలను ఆదుకొంటుంటే.. కాంగ్రెస్ వల్లే ఉచిత టీకాల ప్రకటన చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ప్రధాని మోదీని విమర్శించడానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న రాహుల్ గాంధీ, ఈసారైనా కేంద్రానికి సహకరించి ప్రధాని మోదీ సృష్టించే చరిత్రలో భాగం అవుతారో చూడాల్సిందే.. 

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!