20.1 C
New York
Thursday, October 21, 2021

Conspiracy In YCP Govt Movie Tickets Scheme? Jagan Indirectly Target To Pawan Kalyan ? | Mana Sena

జనసేనను దెబ్బ తీయడమే అసలు టార్గెట్.. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోనే వైసీపీ ప్రభుత్వం ఒక ప్రక్క పవన్ ఆర్ధిక మూలలను కనిపెడుతూ.. మరో ప్రక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంశం కంటే రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే దిశగానే ఎక్కువగా ద్రుష్టి సారించినట్లు కనపడుతుంది. లక్షలాది రూపాయలు జీతాలిచ్చి అంతమంది సలహాదారులను కూడా అందుకే పెట్టుకున్నట్లుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ అదే కోవకు చెందుతాయని చెప్పవచ్చు. తాజా సినిమా టిక్కెట్ల అమ్మకం వరకు కోట్లాది రూపాయలను వినోదపు పన్ను రూపంలో వసూలు చేస్తున్న ప్రభుత్వాలు సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని నెపంతో ఖజానాను మరింత నింపుకోవాలని చూస్తాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థిగా ఉన్న ఏ ఒక్కరినీ నాశనం చేసేంతవరకూ ఆ పట్టు వదలదు అది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే నిర్ణయమైనా డోంట్ కేర్.. ఇక అసలు విషయానికొస్తే.. ప్రభుత్వమే ఇకనుంచి సినిమా టిక్కెట్లను అమ్ముతుందనే నిర్ణయం వెనుక పెద్ద కుట్రయే దాగి ఉన్నట్లు తాజా సమాచారం.. ఇక్కడ అసలు లక్ష్యం సినిమా రంగం కాదు.. 3వ ప్రత్యర్థిగా జనాల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ సర్కార్ ఇష్టమొచ్చినట్లుగా పాలన సాగించవచ్చు అనుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ కూడా నీరుగారిపోయింది. ఆ సమయంలో ప్రజల పక్షాన నిలబడుతూ అధికార పార్టీపార్టీ కంట్లో నలుసుగా మారింది జనసేన పార్టీ. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన అతితక్కువ కాలంలోనే ప్రజలలలో కనిపించిన వ్యతిరేకతను భావన నిర్మాణం కార్యక్రమంలో చేప్పట్టిన కవాతు ద్వారా బట్ట బయలు చేసింది జనసేన. నాటి నుండి జగన్ సర్కార్ చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పంజా విసురుతూనే ఉన్నారు. తాజాగా రహదారులపై చేపట్టిన ఉద్యమం తాడేపల్లి ప్యాలస్ ని తాకింది. వెంటనే ముఖ్యమంత్రి సమీక్ష పెట్టేలా చేసింది. రోజురోజుకూ జనంలో జనసేన బలం పుంజుకుంటుంది. ప్రజల్లో పవర్ స్టార్ పార్టీపై సానుభూతి పెరుగుతుంది. ఆయన సినిమాల్లో నటిస్తున్నా ప్రజలు దానిని పెద్ద తప్పిదంగా భావించడం లేదు. నిజాయితీగా సంపాదించిన డబ్బుతో పవన్ రాజకీయాలు చేస్తున్నారనే సింపతి కూడా కనబడుతుంది. జగన్ చుట్టూ ఉన్న సలహాదారులు కూడా జనసేనతో పొంచిఉన్న ప్రమాదాన్ని పడే పడే ఆయనకు గుర్తు చేస్తున్నారు. మరి జన బలం ఉన్న జనసేన పార్టీని దెబ్బ కొట్టడం ఎలా.? గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్ల మెజారిటీతో ఓడించగలిగిన జగన్ కు ఈసారి తన సొంత కష్టార్జితంతోనే రాజకీయ చక్రం తిప్పుతున్న పవన్ ని ఎదుర్కోవడం పెద్ద సమస్యగానే మారింది. రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మళ్ళీ సినిమాలలో నటించాను అన్న తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకున్నారనే ప్రచారం చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను ఆర్ధికంగా దెబ్బ తీయాలి. ఆయనకున్న ప్రధాన ఆదాయ వనరులు సినిమాలే.. నటనతోపాటు ఈమధ్య సినిమా నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నారు. రోజురోజుకీ ఆయన మార్కెట్ పెరిగిపోతుంది. ఇటీవల ఓ నిర్మాణ సంస్థ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం 10 కోట్ల రూపాయలను అధికంగా చెల్లించేందుకు సిద్ధపడిందన్న వార్తలు వినపడ్డాయి. ఇలాంటి సమయంలో పవన్ సినిమాలను అడ్డుకున్నట్లైతే జనసేన పార్టీని అడ్డుకున్నట్టే..! అందుకోసం అవసరమైతే సినిమా రంగం మొత్తం చెడిపోయినా పర్వాలేదు.. రాష్ట్ర రాజకీయాలలో తృతీయ ప్రత్యామ్యాయం రాకూడదు. సినిమా
టిక్కెట్లను జగన్ సర్కార్ అమ్మాలనుకునే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే.! రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ సినిమా ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలకు బెనిఫిట్ షోలు, అదనపు ఆటలను ప్రదర్శించేందుకు అనుమతులివ్వడం సర్వ సాధారణం. అంతే కాదు.. టిక్కెట్ ధరలను పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ పవన్ సినిమాకు మాత్రం ఆంధ్రాలో అన్ని ఆంక్షలే.. ఎక్కువ షోలు వెయ్యకూడదు.. టిక్కెట్ ధరలు పెంచకూడదు..ఇంకా మాట్లాడితే సినిమా ధియేటర్స్ అద్దెకు ఇవ్వకూడదు. అనే ఆంక్షలు కూడా జగన్ కనుసన్నల్లో ఉండే ప్రాంతాలలో అమలు చెయ్యడం జరిగింది. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమా సిల్లెక్షన్స్ ని అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల అడ్డా దారులను త్రొక్కింది. అయినా ఫలితం దక్కలేదు. వారం రోజుల్లోనే వందకోట్ల రేంజ్ కి ఎదిగిన పవన్ తన స్టామినాని చూపించారు. దీంతో అసలు మొత్తం సినిమా రంగం జుట్టుని చేతుల్లోకి తీసుకోవాలనే నిర్ణయానికొచ్చేసింది జగన్ సర్కార్. సినిమా మనుగడకు ప్రధానమైన సినిమా టిక్కెట్ల అమ్మకాన్ని చేతిలోకి తీసుకుంటే జనసేన అధినేత సినిమాలను అడ్డుకోవచ్చు.ఆయన మార్కెట్ ని దెబ్బ తీయొచ్చు. తద్వారా ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రారు.అదే జరిగితే జనసేన మనుగడను తేలికగా దెబ్బ తీయొచ్చు. ఒక్క పవన్ కళ్యాణ్ నే దెబ్బ తీయడం కోసం ఇండ్రస్ట్రీ మీద ఆధారపడి ఉన్న లక్షలాదిమంది కడుపు మాడినా డోంట్ కేర్.. ఇదే సర్కార్ వారి సినిమా టిక్కెట్ల అమ్మకం నిర్ణయం వెనుక దాగి ఉన్న అసలు కథ.. ఇక కలియుగ ధర్మం ఏం చెబుతుందంటే ఎదుటివారి నాశనాన్ని కోరే ప్రతిచర్య మన వినాశనానికి దారి తీస్తుంది.. అని.. అందుకు తగ్గట్టుగానే..ప్రస్తుతం ఏపీలో రాజకీయ శూన్యత నడుస్తోంది అంటున్నారు విశ్లేషకులు పేరుకి చాలా పార్టీలు ఉన్నా ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్దోచ్చే విధంగా గడ్డి తినిపించిన జనాలు 2024లో ఎవరికి ఓటు వెయ్యాలి అనే విషయంలో ఇప్పటికే అంతా సిద్దం చేసుకుంటున్నారు. ఎవరెవరు పాలనా వ్యవస్థలో సరిగ్గా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరు ప్రభుత్వాన్ని కూలగోట్టడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు ఇలాంటివి బాగా అబ్జర్వ్ చేస్తున్న జనాలు పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి లలో జగన్ ని నమ్ముకోవాలా లేకపోతే పవన్ వెనుక నడవాలా అన్న డైలామాలో పడ్డారు. ఎవరిని నమ్మాలి అనే విధంగా ఉంది ప్రస్తుత చర్చ. 2024 నాటికి ఈ 2 పార్టీల్లో ఏది మెరుగ్గా కనబడితే దానికే ప్రజాదరణ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!