23.9 C
New York
Monday, June 27, 2022

Crime News: Angry Wife Cuts Her Husband’s Private Part | Telugu Crime Stories | Shritv Crime

Crime News: Angry Wife Cuts Her Husband’s Private Part | Telugu Crime Stories | Shritv Crime

#CrimeStories #CrimeNews #ShritvCrime #CrimeNews

భర్త మర్మాంగాన్ని కోసి ఫ్రై చేసి వండుకుతిన్న భార్యా .. ఎక్కడంటే.?

కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు.

ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి ఇద్దరూ కారణమవుతారు. అయితే ఇటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు సర్దుకుపోవాలి. ఇటువంటి చిన్న చిన్న గొడవలు ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతాయి. అయితే ఆ ఆ సందర్భంలో ఒకసారి భార్య ప్రాణాలు పోవచ్చు, మరొకసారి భర్త ప్రాణాలు పోవచ్చు. అయితే ఇది ఇలా ఉండే తాజాగా ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. అంతటితో ఆగకుండా తర్వాత అతని మర్మాంగాన్ని కోసి ఫ్రై చేసింది. ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం…

ఈ దారుణమైన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే…బ్రెజిల్‌కు చెందిన ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. అంతటితో ఆగకుండా అనంతరం అతడి మర్మాంగాన్ని కోసేసింది.

అంతేకాదు ఆ కోసేసిన మర్మాంగాన్ని వంటలో కూడా ఉపయోగించింది. ఈ దారుణానికి పాల్పడిన 33 ఏళ్ల మచాడోను ఈ నెల 7 అరెస్ట్ చేశారు పోలీసులు. మృతుడు సాంటా కేటరినా ఇంట్లోనే నగ్నంగా, విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మచాడో, తన భర్త సాంటా కేటరినా మర్మాంగాన్ని కోసేసిన పెనం మీద నూనెలో వేసి వేయించింది. ఉదయం నాలుగు గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. విడిపోయే విషయంలో జరిగిన గొడవ కారణంగానే మచాడో భర్తపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని తెలిపారు. పోలీసులు నిందితురాలు మృతుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన వంటగది కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

హత్యతో పాటు బాధితుడిని వేధింపులకు గురి చేసిన ఆరోపణల కారణంగా మచాడోను పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల పాటు కలిసి ఉన్న మచాడో, సాంటా కేటరినా రెండేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీరికి 8 ఏళ్ల కొడుకుతో పాటు 5 ఏళ్ల కూతురు ఉంది. అయితే ఈ ఘాతుకం జరిగిన సమయంలో వారిద్దరూ అక్కడే ఉన్నారా ? లేదా?అన్నది మాత్రం తెలీదు.

అయితే ఈ ఘటన జరగడానికి ముందే రోజు రాత్రి ఈ జంట బార్‌కు వెళ్లినట్టు కథనాలు వచ్చాయి. అయితే మరోవైపు నిందితుడి నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలోనే మచాడో అతడిని హత్య చేసిందని ఆమె తరపు లాయర్ వాదించారు. అయితే తనను మోసం చేశాడనే కోపంతోనే మచాడో తన సోదరుడిని హత్య చేసిందని అతడి చెల్లెలు ఆరోపించింది. అయితే వీరి మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయని వారి బంధువులు తెలిపారు.ఓ సారి భర్తపై నిందితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు.

అయితే బాధితుడి చెల్లెలు తరపున లాయర్ వాదన మరోలా ఉంది. బాధితుడితో బంధాన్ని తెంచుకునేందుకు ఇష్టపడని నిందితురాలు.. అతడు తనతో ఉండకపోతే ఇంకెవరితోనూ ఉండొద్దనే ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు.అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది.

Hello.. We are Here to Aware you On crimes, and terrible Moments..

Crimes that tell us, we need to be careful, we need to be watchful. Crimes that tell us lives could have been saved. Every crime we hear of, either warns us to be careful or scares us, it could happen to us. Every crime ignites a feeling, ‘It should not have happened’. Would knowing the reason ‘Why’ behind a crime, help in stopping a crime from happening?’

In This Case For More Details,Please Subscribe To Our Channel #ShritvCrime
https://www.youtube.com/channel/UCj3rKgeORjSi8gKWU1xPhQQ

Related Articles

Stay Connected

0FansLike
3,372FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!