23.2 C
New York
Sunday, June 26, 2022

Crime News: IT Commisioner Cheats Lady Doctor | Telugu Crime Stories | Shritv Crime

Crime News: IT Commisioner Cheats Lady Doctor | Telugu Crime Stories | Shritv Crime

#CrimeStories #CrimeNews #ShritvCrime #CrimeNews

మహిళా డాక్టర్ ని నమ్మించి మోసం చేసిన ఐటీ కమిషనర్.. ఎక్కడంటే.?

నిర్భయలాంటి చట్టాలు ఎన్ని అమలు చేస్తున్నా.. బాలికలపై అత్యాచారాలు తగ్గడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా చిన్నారులపై ఆకృత్యాలు ఆగడం లేదు.

ముఖ్యంగా బంధువులే అభం శుభం తెలియని బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అయితే మహిళల పై లైంగికదాడి జరిగిందంటూ ప్రతిరోజు మనం పత్రికల్లో న్యూస్ లో చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కామాంధుల ఆకృత్యాలు ఆగడం లేదు. రోజూ ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా నాగపూర్ లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఓ మహిళా డాక్టర్ పై అయితే కమిషనర్ చాలాసార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ మహిళా డాక్టర్ గర్భవతి కావడంతో అతనిని పెళ్లి చేసుకోమని అడగగా అబార్షన్ చేయించుకోమని చెప్పాడు. దీనితో మోసపోయాను అని తెలుసుకున్న మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయంలోకి వెళితే. ఓ మహిళ నాగపూర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు గా పనిచేస్తోంది. అయితే 2019లో పుదుచ్చేరికి చెందిన ఐటీ కమిషనర్ నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్రాక్సెస్ లో ట్రైనింగ్ నిమిత్తం నాగపూర్ వెళ్ళాడు. అక్కడ ఉన్న సమయంలో వైద్యం కోసం నాగపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు.

అయితే అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న మహిళా డాక్టర్ తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య చనువు మరింత పెరిగింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీనితో ఆ ఐటీ కమిషనర్ మహిళా డాక్టర్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ తరువాత ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తరువాత చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే అదే సమయంలో ఆ మహిళా డాక్టర్ నగ్నంగా ఉన్న ఫోటోలు తీశాడు. వాటిని తన వద్దే ఉంచుకున్నాడు.

అయితే ఇటీవలే ఆ మహిళా డాక్టర్ గర్భవతి అని తేలింది. దీనితో ఆమె పెళ్లి గురించి ఐటీ కమిషనర్ ను ప్రశ్నించింది. దీనితో అతడు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించాడు. ఇదే విషయంపై ఆ మహిళ ఐటీ కమిషనర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐటీ కమిషనర్ పై 376(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ప్రస్తుతం బెంగళూరులో విధులు నిర్వహిస్తున్నారని, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

Hello.. We are Here to Aware you On crimes, and terrible Moments..

Crimes that tell us, we need to be careful, we need to be watchful. Crimes that tell us lives could have been saved. Every crime we hear of, either warns us to be careful or scares us, it could happen to us. Every crime ignites a feeling, ‘It should not have happened’. Would knowing the reason ‘Why’ behind a crime, help in stopping a crime from happening?’

In This Case For More Details,Please Subscribe To Our Channel #ShritvCrime
https://www.youtube.com/channel/UCj3rKgeORjSi8gKWU1xPhQQ

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!