22.1 C
New York
Sunday, June 26, 2022

Crime News: The Spiritual Guru Behind the Realtor’s Murder | Telugu Crime Stories | Shritv Crime

Crime News: The Spiritual Guru Behind the Realtor’s Murder | Telugu Crime Stories | Shritv Crime

#CrimeStories #CrimeNews #ShritvCrime #CrimeNews

స్థిరాస్తి వ్యాపారి హత్య వెనక ఒక ఆధ్యాత్మిక గురువు.. అసలు కథ ఏమిటంటే.?

హైదరాబాద్‌లో జరిగిన ఓ స్థిరాస్తి వ్యాపారి హత్య కలకలం రేపుతోంది. హాస్టల్‌ నుంచి అదృశ్యమయ్యా డంటూ నమోదైన ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడి హత్య వెనక ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.విదేశాల నుంచి భారీగా

సొమ్ములొస్తున్నాయని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టిన మోసం వెలుగు చూస్తోంది. ఈ విషయంలో పలువురు ప్రముఖుల పాత్ర కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరుకు చెందిన గడ్డం విజయ్‌ భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి హైదరా బాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. 4 నెలల నుంచి కేపీహెచ్‌బీ ఠాణా వెనక వైపు అడ్డగుట్టలోని నెస్ట్‌ అవే అనే హాస్టల్‌లో ఉంటున్నారు. గత నెల 20 నుంచి ఆయన ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో ఆయన అల్లుడు జయసృజన్‌ రెడ్డి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌ సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించడంతో అదే రోజు రాత్రి విజయ్‌ భాస్కర్‌ రెడ్డిని కారులో తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది.

దీంతో కారు నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ సైనికోద్యోగి మల్లేశ్‌, స్థిరాస్తి వ్యాపారి సుధాకర్‌, కృష్ణంరాజుతోపాటు ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య కుట్ర బహిర్గతమైంది. విజయ్‌ భాస్కర్‌ రెడ్డిని అంతమొందించేందుకు సినీ ఫక్కీలో పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. కుట్రలో భాగంగా ఆయన ఉండే హాస్టల్‌లోనే చేరిన మల్లేశ్‌ కుమారుడు నమ్మకంగా మెలుగుతూ మంచూరియాలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. అది తిని స్పృహ తప్పి పడిపోయిన విజయ్‌ భాస్కర్‌ రెడ్డిని మల్లేశ్‌, సుధాకర్‌, కృష్ణంరాజు కారులో తీసుకెళ్లారు. ఆయనను బాగా కొట్టడంతో కారులోనే మృతిచెందారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి మృతదేహాన్ని నిందితులు శ్రీశైలంలోని సున్నిపెంటకు తీసుకెళ్లారు. ‘తమ బంధువు చనిపోయాడు దహనం చేయాలంటూ కాటికాపరిని నమ్మించారు. అతడికి రూ.11 వేల నగదు, గూగుల్‌ పే ద్వారా మరో రూ.4 వేలు చెల్లించారు.

వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఉంచుకున్నాడు. శవదహనం అనంతరం నిందితులు ఆ రోజంతా అక్కడే గడిపి తిరిగి వచ్చేశారు. హత్యకు గల కారణాలను పోలీసులు లోతుగా ఆరా తీయడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ప్రధాన సూత్రధారిగా తేలింది. ప్రకృతివైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తానంటూ బెంగళూరులో ఆశ్రమం తెరిచిన అతడికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో భక్తులున్నారు.హైదరాబాద్‌ వచ్చినప్పుడు నిజాంపేట ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీ సమీపంలో మకాం వేసేవాడు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ప్రముఖుడి స్థలంలో విలువైన లోహాల్ని వెలికితీసేందుకు సహకరించాడనే ప్రచారం ఉంది. వాటిని విదేశీ కంపెనీకి విక్రయించడం ద్వారా భారీమొత్తంలో డబ్బు రాబట్టాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిసింది. ఆ సాకుతో అవసరాల కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, అయితే విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, ఆయనకు తెలిసిన వారు కూడా పెద్దమొత్తంలో డబ్బులిచ్చారని సమాచారం. విదేశాల నుంచి

నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. దీనికితోడు తన కార్యకాలాపాలపై కొన్ని  కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు పంపి, అప్రతిష్ఠపాలు చేస్తున్నాడని విజయ్‌ భాస్కర్‌ రెడ్డిపై గురూజీ కోపం పెంచుకుని హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురూజీ కోసం గాలిస్తున్నారు.

Hello.. We are Here to Aware you On crimes, and terrible Moments..

Crimes that tell us, we need to be careful, we need to be watchful. Crimes that tell us lives could have been saved. Every crime we hear of, either warns us to be careful or scares us, it could happen to us. Every crime ignites a feeling, ‘It should not have happened’. Would knowing the reason ‘Why’ behind a crime, help in stopping a crime from happening?’

In This Case For More Details,Please Subscribe To Our Channel #ShritvCrime
https://www.youtube.com/channel/UCj3rKgeORjSi8gKWU1xPhQQ

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!