23.6 C
New York
Monday, September 20, 2021

Delhi Cm Aravind Kejriwal False Statements On Coivd Deaths

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో కరోణాని ఎదుర్కోవడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటె బీజేపీ, మోడీ అంటే పడని ముఖ్యమంత్రులు కరోనా దొంగ లెక్కలతో ఇబ్బందులు సృష్టిస్తున్నారు .. కేంద్రానికి సహకరించకుండా, విమర్శలు చేస్తూ సమస్యని మరింత పెరిగేలా చేశారు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ కు సంబంధించిన మృతుల సంఖ్యని తక్కువగా చూపించారు.. ఏప్రిల్, మే నెలలో ఢిల్లీ లో మొత్తం 30 వేల మందికి పైగా అక్కడి మున్సిపాలిటీలు కరోనా డెత్ సర్టిఫికెట్లు అంధ జేస్తే.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ చూపించిన లెక్క 9వేలే అని రెండు ప్రముఖ పత్రికలూ ప్రత్యేక కధనాలు ప్రచురించాయి.. దాదాపు 3 ఇంతలా మరణాల సంఖ్యను దాచి పెట్టాడు ఢిల్లీ సీఎం.. 

మీడియా కూడా ఢిల్లీ మరణాలకు సంబందించి దిగ్బ్రాంతి కరమైన కధనాలను అందించాయి .. అక్కడ స్మశాన వాటికలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయని.. డెడ్ బాడీలని క్యూ లో ఉంచాల్సిన పరిస్థితిని కూడా చూసాం.. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.3 % ఉంటె.. ఢిల్లీ లో 2.9 % ఉంది.. అంటే అన్ని రాష్ట్రాల్లోకి ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉన్నా సీఎం కేజ్రీవాల్ దొంగ లెక్కలతో దీనంతటినీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. 

ఆక్సిజన్ మందుల కోసం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. మద్యాన్ని హోమ్ డెలివరీ చేయడానికి అనుమతులిచ్చాడు కేజ్రీవాల్.. మద్యం డోర్ డెలివరీ లో చూపించిన చొరవ, తీసుకున్న నిర్ణయాలు ఆక్సిజన్, మందుల డెలివరీలో తీసుకొని ఉంటె, ఢిల్లీలో మరణాల సంఖ్య పెరిగేది కాదు.. అక్కడ ఆరోగ్య రంగం పైన కూడా కేజ్రీవాల్ పూర్తిగా నిర్లక్ష్యం వహించాడు.. 2015 నుంచి 2019 వరకు ఒక్క కొత్త ఆసుపత్రిని కూడా ఢిల్లీ సీఎం ప్రారంభించలేదు.. 2013 నుంచి నిర్మాణంలో ఉన్న 16 ఆసుపత్రులను కూడా ఇంకా ప్రారంభించలేదంటే ఢిల్లీ లో మరణాలు పెరగడానికి పూర్తి కారణం సీఎం కేజ్రీవాల్ అనేది స్పష్టంగా బయటపడుతోంది..  మద్యం పైన చూపించిన శ్రద్ధ మందులపై చూపించి ఉంటె నేడు దేశ రాజధాని స్మాశానాన్ని తలపించేది కాదు.. కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రులు ప్రధానికి సహకరించి ఉంటె భారత్ లో కూడా ఈ సెకండ్ వేవ్ ఇంత దెబ్బతీసేది కాదు..

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles