20.1 C
New York
Thursday, October 21, 2021

సెంట్రల్ విస్టా పై కోర్ట్ వ్యాఖ్యలతో కంగుతిన్న రాహుల్ గాంధీ

గత కొన్ని రోజులుగా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు ఢిల్లీ హై కోర్టు తీర్పు చెంప పెట్టుగా మారింది.. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ప్రాజెక్ట్ను నిలిపి వేయాలన్న పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.. అంతే కాకుండా లక్ష రూపాల జరిమానాను కూడా విధించింది.. 

పార్లమెంట్ నూతన భవనం కోసం కేంద్రం సెంట్రల్ విస్టా పేరుతో పనులు ప్రారంభించింది.. అయితే దేశాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తుంటే సెంట్రల్ విస్టా అవసరమా అని కాంగ్రెస్ నేతలు అర్ధం లేని విమర్శలు చేశారు.. ఈ ప్రాజెక్టుకి కేటాయించిన 13వేల 450 కోట్ల రూపాయలని రద్దు చేసి కరోనా బాధితుల్ని ఆదుకోవాలని మొసలి కన్నీరు కారుస్తుంది గాంధీ కుటుంబం.. 

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లేదా నూతన పార్లమెంట్ నిర్మాణ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పార్లమెంట్ 1927లో నిర్మించింది.. పాతబడ్డ ఈ భవనం అంత సురక్షితం కాదని 2012 లోనే ఛీఫ్ ఇంజినీర్లు ప్రభుత్వానికి నివేదిక అందచేశారు.. అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి సైతం నూతన పార్లమెంట్ భవనం నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.. నూతన పార్లమెంట్ భవనం పూర్తయితే కేంద్రం ప్రస్తుతం కడుతున్న 1000 కోట్ల రెంట్ ఆదా చేసినట్టవుతుంది.. ఇప్పుడు కట్టబోయే నూతన పర్లియామెంట్లో అన్ని మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఒక చోటకు రానున్నాయి.. మొత్తంగా ఈ ప్రాజెక్టు..  భద్రత, పనుల వేగవంతం.. ఆధునిక హంగులతో సేవలు మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశంతో నిర్మిస్తున్నదే.. 

కాంగ్రెస్ అధికారం లో ఉన్న మహారాష్ట్ర లో 900 కోట్లతో ఎమ్మెల్యే హాస్టల్ ను నిర్మిస్తున్నారు.. ఈ ప్రాజెక్టులో 300 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణ ఉన్నా..  దీనిపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు..? అటు ఛత్తీస్గఢ్ లో నూతన అసెంబ్లీని 270 కోట్ల తో నిర్మిస్తుంటే గాంధీ కుటుంబం ఎందుకు మౌనంగా ఉంది..? 

కాంగ్రెస్ పార్టీ గాంది కుటుంబానికి సంబంధించింది కావొచ్చు కానీ సెంట్రల్ విస్టా అనేది ప్రజల పార్లమెంట్ భవనాలకు సంబంధించింది.. ప్రజా సేవకు సంబంధించింది.. ప్రజల కోసమే ప్రారంభించి ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం నేరమే అవుతుంది..

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!