23.6 C
New York
Monday, September 20, 2021

Disgusting Love Ends With Murder | Latest Telugu Crime Stories | Shri Tv Crime Telugu

కారొచ్చి ఠక్కున పక్కన ఆగే సరికి ఇటు చూసింది ముప్ఫై ఐదేళ్ళ శైలజా ద్వివేది. ఎక్కమన్నాడతను. ఎక్కికూర్చున్నాక కారు పోనిస్తూ, ఇప్పుడేం చేస్తానో చూడమన్నాడు. భార్యకి కాల్‌ చేసి, ‘డైవోర్స్‌ నోటీసులొస్తున్నాయ్‌రెడీ ఐపో!’ అనేసి ఆమె వైపు తిరిగి, ‘ఓకేనా ఇప్పుడు నాతో పెళ్ళీ?’ అన్నాడు. కారు ఆపమంది వెంటనే. రెచ్చిపోయి బ్రేకేసి పొడవాటి కత్తి తీశాడు సైకోలా

ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలోని బ్రార్‌ స్క్వర్‌ రోడ్డంతా ఖాళీగా వుంది. కసకసా సైకోలా గొంతుమీద కత్తితో దాడి చేసి, కారులోంచి రోడ్డుమీదికి లాగి, ఆమె తల మీదుగా కారు పోనిచ్చాడు. ఆమె మొబైల్‌లో వాట్సాప్‌ చాట్స్‌, గూగుల్‌ డ్రైవ్‌లో వున్న ఫైల్సు డిలీట్‌ చేసి పారేశాడు. ఎవరికో కాల్‌ చేసి, శైలజని ఫినిష్‌ చేశానని చెప్పేశాడు. ఇంటికెళ్తే, కారెలా డ్యామేజీ అయిందని భార్య అడిగింది. కుక్క అడ్డమొచ్చిందన్నాడు. విడాకులేమిటని అడిగింది. నోర్ముయ్యమన్నాడు. తండ్రి ఇంటికెళ్ళి పోయాడు. అక్కడ్నుంచి తమ్ముడి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకుని, దూసుకుపోయాడు అదే వైట్‌ హోండా సిటీ కారులో. ఎంతకీ శైలజ ఫోన్‌ పలక్క పోయేసరికి, ఆర్మీ హాస్పిటల్‌కి చేరుకున్నాడు మేజర్‌ అమిత్‌ ద్వివేది.

అక్కడామె హోండా కారెక్కి వెళ్లిందని తెలిసి పోలీస్ స్తేషన్‌కి పరుగెత్తాడు. బ్రార్‌ స్క్వేర్‌ రోడ్డులో పోలీసులున్నారని తెలుసుకుని అక్కడికి పరుగెత్తి, చితికిన భార్య శవాన్ని చూసి భోరుమన్నాడు – ‘ఇట్స్‌ మర్డర్‌, యాక్సిడెంట్‌ కాదు!’ అని గట్టిగా అరిచాడు.‘వ్వాట్‌?’‘మూడేళ్ళుగా హెరాస్‌ చేస్తున్నాడు నా మిసెస్‌ని, పెళ్లి చేసుకోమని!’‘ఎవరు?’‘మేజర్‌మేజర్‌ నిఖిల్‌ హండా!’షాకయ్యారు పోలీసులు. మేజర్‌ భార్యని ఇంకో మేజర్‌ చంపాడా? సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌ వెంటనే ఆర్మీ ఆస్పత్రికెళ్ళి సీసీ ఫుటేజీ చూసి సీజ్‌ చేశాడు. అక్కడికి ఫిజియో థెరఫీ కోసం వచ్చిన శైలజ, మేజర్‌ హండా ఉన్న వైట్‌ హోండా సిటీ కారెక్కి వెళ్లినట్టు ఫుటేజీలో వుంది. జాయింట్‌ కమిషనర్‌ మధుప్‌ తివారీ, డీసీపీ కుమార్‌లు వెంటనే రంగంలోకి దూకారు. మేజర్‌ హండా కోసం వేట మొదలైంది. ఫోన్‌ స్విచ్చాఫ్‌లో పెట్టాడు. ఇంట్లో కూడా సమాచారం లభించలేదు. కాల్‌ రికార్డ్స్‌ చూస్తే, శైలజతో 3300 కాల్స్‌, 1500 చాట్స్‌ వున్నాయి. ఇంకో ఐదుగురు అమ్మాయిల కాల్స్‌ కూడా వున్నాయి. అమ్మాయిల్ని పట్టుకుంటే, శైలజని చంపినట్టు తనకి కాల్‌ చేశాడని ఒకమ్మాయి చెప్పేసింది. ఇంకేం చెప్పలేదంది. ఫోన్‌ స్విచ్చాఫ్‌లో పెట్టి, దాక్కున్న మేజర్‌ హండా గురించి అర్థరాత్రి కాల్‌ చేశాడు జేసీ మధుప్‌ తివారీ, ‘ఢిల్లీ నుంచి మీరట్‌ముజఫర్‌ నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మీద టోల్‌ గేట్‌ ఎంట్రీలున్నాయి, సీసీ ఫుటేజీ వుందిడిస్పాచవ్వండి వెంటనే!’ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌ వెంటనే తన దళంతో మీరట్‌ చేరుకునేసరికి, అక్కడ ఆర్మీ గెస్ట్‌హౌస్‌ బయటే ఉంది మేజర్‌ హండా కారు. లోపల పూటుగా రమ్‌ తాగుతున్నాడు

ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌ అతణ్ణి మర్యాదపూర్వకంగా చూసి, ‘ఇక వెళ్దామా సర్‌?’ అన్నాడు సున్నితంగా. ‘సోది చెప్పకండి! ఇక్కడని కాసేపు, అక్కడని కాసేపు సోది చెప్పమాకండి!’ తీవ్రంగా మండిపడ్డాడు ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌.హండాని ఢిల్లీకి తీసుకొచ్చి ప్రశ్నిేస్త, కారు కడిగించానన్నాడు. కారులో వెంట్రుకలు, రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె మొబైల్‌ని అక్కడే చెత్తకుండీలో పారేశానన్నాడు. అందులో మదర్‌ బోర్డు, సిమ్‌ కార్డు చితికి పోయి ఉన్నాయి. లాభం లేదన్నారు ఫోరెన్సిక్‌ నిపుణులు. తన మొబైల్‌లో డేటానంతా డిలీట్‌ చేసి, నీలి చిత్రాలు మాత్రమే వుంచుకున్నాడు.

మీరట్‌ లోనే సోదా చేసినప్పుడు, జేబులో పాకెట్‌ నైఫ్‌ దొరికింది. దాంతోనే చంపానన్నాడు.హత్యాయుధం పెద్ద కత్తి అని ఫోరెన్సిక్‌ రిపోర్టు. కాదు, చిన్నకత్తేనని పట్టుబట్టాడు హండా.‘ఎక్కడ పారేశారు పెద్ద కత్తిని?’‘చిన్న కత్తితోనే కదా చంపాను’‘మరి సదర్‌ బజార్లో కొన్న కొత్త కత్తి సంగతి?’‘సదర్‌ బజార్లో కొన్న కొత్తకత్తా?’‘మీ యింట్లో ప్రింటెడ్‌ బిల్లూమీరీ షాపులో కార్డు స్వైప్‌ చేసి ఫోటోలో ఉందేఇలాంటి పెద్ద కత్తినే కొనుక్కెళ్ళారు. మీరే కొన్నట్టు సీసీ ఫుటేజీ…’‘సర్సరే, మా లాయర్‌ చెప్తే దాన్ని పారేశా’ 

ఎక్కడ?’‘ఏమో, వేసుకున్న బట్టలు కూడా తీసి కాల్చేశారెండు రోజులుగా ఇక్కడా అక్కడా అని తప్పుదోవ పట్టించసాగాడు. బట్టలు కాల్చాడంటే, మీరట్‌ దారిలో అయ్యుండాలని అటు ప్రయత్నించాడు ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌. అటు కూడా ఏదైనా అవాంతరాన్ని నివారించడానికి టోల్‌ గెట్‌ ఇవతలే కాల్చి ఉంటాడని ఊహించి, ఇటువైపంతా జల్లెడ పట్టి కనుగొన్నాడుతుప్పల్లో బూడిద, పెద్ద కత్తి. నోట మాట రాలేదు హండాకి.

అవునూ, నేరం చేయనప్పటి బట్టల్లో కదా మాకు దొరికారు బట్టలెలా కాల్చేశారు?’ అడిగాడు కుమార్‌ అనుమానంగా, హుషారుగా నవ్వేసి, ‘ఇంకా కావాలేంటీ పజిల్సూ?’ అన్నాడు హండా.‘కారు తుడిచిన టవలై వుంటుంది బూడిద!’ కుమార్‌ మాటలకి మేజర్‌ నిఖిల్‌ హండా కంగుతిని చూస్తూంటే, ‘మీ నేరం మీ వృత్తికే హేయంగా వుంది మేజర్‌ సాబ్‌అని నిరసనగా చూశాడు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ కుమార్‌

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles