11.3 C
New York
Saturday, October 23, 2021

దాని వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలు తెలుసా? Do You Know the Benefits of it to Women

మహిళలందరూ ఆరోగ్యకరమైన లైంగికజీవితాన్ని ఆస్వాదించడానికి అర్హులుఅంటున్నారు వైద్య నిపుణులు. సెక్స్ వల్ల మహిళలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు అధ్యయనవేత్తలు. ఆరోగ్యకరమైన శృంగారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సెక్స్ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. తరుచూ సెక్స్ చేసే వారి మెదడు మాత్రమే గాక.. శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. తరుచూ సెక్స్ చేయడం వల్ల ఉత్పత్తయ్యే న్యూరోట్రాన్స్మీటర్లు మెదడు పనితీరును సరిచేస్తాయట. ఇక రతి క్రీడలో పొందే తృప్తి ద్వారా మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది వారి ఎదుగుదలకూ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ వల్ల మహిళలకు కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. తరుచూ శృంగారం లో పాల్గొనే మహిళల్లో రోగ నిరోధక శక్తి కావలసినంత ఉత్పత్తి అవుతుందట. దాంతో పాటే రక్తపోటు సమస్య కూడా నివారణ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సెక్స్ ద్వారా నిరోధించవచ్చు. ఎక్కువగా సెక్స్ లో పాల్గొనే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక క్రమం తప్పకుండా సెక్స్ చేసే వారి సంసారం కూడా ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుందని వైద్య, మానసిక నిపుణులు చెబుతున్నారు. లైంగిక భాగస్వామితో సాన్నిహిత్యం పెరిగి వారి కాపురం నిండు నూరేళ్లు హాయిగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. శారీరకంగానే గాక మానసికంగా ధృఢత్వంగా తయారవడంలో సెక్స్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తేల్చారు. రతి క్రీడ వల్ల ఒత్తిడి తగ్గడమే గాక.. నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. భాగస్వాములు లేని మహిళల సంగతేంటన్న ప్రశ్నకు నిపుణులు సలహా ఇచ్చారు. హస్త ప్రయోగం ద్వారా వారు ఫీల్ ను పొందగలిగినా.. ఒంటరిగా సెక్స్ చేసుకోవడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. భాగస్వామి లేని మహిళల్లో నిద్ర, రక్తపోటు సమస్య, ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించినట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళలు ఎంత ఎక్కువ కాలం సెక్స్ చేస్తే వారి లైంగిక ఆరోగ్యం అంత బాగుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కాకుండా ఎక్కువకాలం శృంగారంలో పాల్గొనని మహిళల్లో.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తినట్టు వారు తేల్చారు.

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!