23.2 C
New York
Sunday, June 26, 2022

ఎలాంటి అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడి చస్తారో తెలుసా.? | SARAYU

ఎలాంటి అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడి చస్తారో తెలుసా.? | SARAYU

ఏ అబ్బాయి అయినా కూడా తనకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆమె మనసులో స్థానం సంపాదించాలని అనుకుంటాడు… అమ్మాయిని చూసి ఇష్టపడింది మొదలు ఇంకా అక్కడి నుంచి అమ్మాయి దృష్టిలో పడాలని తనని ప్రేమలో పడేయాలనే ఆమెకు నచ్చే అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ఆ విషయం ఆమెకు తెలియజేయాలని ఇలా చాలా రకాలుగా అబ్బాయిలు అమ్మాయిల ప్రేమ కోసం వాళ్ల కు తాము నచ్చడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్బాయిలు అమ్మాయిల ను ఆకట్టుకోవాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా అమ్మాయిలకి అబ్బాయిల గురించి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి అవి గనక తమ ను ఇష్టపడుతున్న అబ్బాయి లో ఉన్నప్పుడే వాళ్లు అతని ప్రేమకు ఓకే చెబుతారు ఒకవేళ ఆ లక్షణాలు లేకపోతే అబ్బాయి వాళ్ళని ఎంతగా ప్రేమించిన కూడా అసలు పట్టించుకోరు. ఒక అమ్మాయి మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు… అసలు ఆమె ఏం కోరుకుంటుంది తాను ఏం చేస్తే ఆమెకు నచ్చుతాను అన్న విషయాలు అబ్బాయిలకి ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతూ ఉంటాయి… దాంతో వాళ్లను ప్రేమలో పడేయడానికి అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు… అయితే ఇలాంటి వాళ్ల కోసం ఢిల్లీకి చెందిన కొంతమంది డేటింగ్ ఎక్స్పోర్ట్స్ అమ్మాయిలకి అబ్బాయిల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాళ్ళు నచ్చుతారో అన్న విషయాల గురించి కొన్ని సలహాలు సూచనలు చెప్తూ ఆ వివరాలు అన్నీ తమ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు… మరి ఇప్పుడు మనం కూడా ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి…

  1. బాగా వినేవాళ్ళు = అబ్బాయిలు నిజంగా తాము ప్రేమించిన అమ్మాయి తో టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్లకు అవకాశం ఇవ్వాలి గాని అమ్మాయిలు ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటారు… అయితే అబ్బాయిలకి మాత్రం వాళ్ళు చెప్పే కబుర్లు నచ్చక ఎప్పుడు ఎప్పుడు వాళ్ల దగ్గర నుంచి పారిపోదామా అని చూస్తూ ఉంటారు… అలా బిహేవ్ చేస్తున్న అబ్బాయిని చూసి అమ్మాయి చాలా హర్ట్ అవుతుంది బాధపడుతుంది… ఎందుకంటే అమ్మాయిలకి తమ లోపల ఉన్న ఎన్నో ఆలోచనల్ని గురించి తమకు నచ్చిన వారితో షేర్ చేసుకుందామని చాలా ఆశగా ఉంటుంది అలాంటప్పుడు తనతో క్లోజ్ గా ఉంది ప్రేమిస్తున్నానని వెంటపడే అబ్బాయిలు వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లతో తమకు సంబంధించిన విషయాలు అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటారు… అలా చెప్పడం ద్వారా అమ్మాయిల మనసులో ఉన్న బాధను ఆ భారాన్ని వాళ్లు దించేసుకోవాలి అనుకుంటారు… కానీ అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలు ఏదో పిచ్చాపాటి కబుర్లు చెబుతూ అబ్బాయిలను బెదర గొడుతుంటారు… అయితే నిజంగా ఒక అబ్బాయి అమ్మాయికి నచ్చాలంటే అతనికి ఆమె చెబుతున్నవన్నీ వినే ఓపిక కచ్చితంగా ఉండాలి అని డేటింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
  1. పని సరిగ్గా చేసేవాళ్ళు = అమ్మాయిలకు బద్ధకం గా ఉంటూ ఏ పని సరిగా చేయకుండా తప్పించుకుంటూ ఉండే అబ్బాయిలు అంటే అసలు ఇష్టం ఉండదు… అలాంటి వారు ప్రేమించడానికి కూడా పనికి రారు అని వాళ్లని నమ్ముకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అలాంటి అబ్బాయిలకి దూరంగా ఉంటారు. అయితే ఏదైనా పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉండి తను అనుకున్న పనిని సాధించిన వాళ్లకి కచ్చితంగా అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు… అలాంటి వారు జీవితంలో ఏమి సాధించాలి అనుకున్న కూడా కచ్చితంగా దాన్ని సాధిస్తారని వాళ్లు జీవితంలో గొప్ప పొజిషన్ లో ఉంటారని అమ్మాయిలు నమ్ముతారు. ఏ పనీ పాటా లేకుండా బేవర్స్ గా తిరుగుతూ జీవితంలో ఎలాంటి కోర్సులు లేకుండా ఉండే అబ్బాయిలు అంటే అమ్మాయిలు చిరాకు పడతారు.
  1. నిజాయితీగా ఉండేవాళ్ళు = ఒక అబ్బాయి తమకు పరిచయం అయినప్పటి నుంచి అతనితో ప్రేమలో పడి ఇంత వరకు కూడా అమ్మాయిలు అతనిలో ఎక్కువగా గమనించే అంశం నిజాయితీ…. తను ప్రేమిస్తున్న అబ్బాయి తనతో ఎంత నిజాయితీగా ఉంటున్నాడు తన జీవితంలో ఎంత నిజాయితీగా ఉంటున్నాడు అన్న విషయాలను అమ్మాయిలు ఎక్కువగా పట్టించుకుంటారుట… ఎందుకంటే తాము ప్రేమించిన అబ్బాయి తమని మోసం చేయడం అన్నది అమ్మాయిలు తట్టుకోలేరు అలా మోసపోయినపుడు చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు… అంటే అమ్మాయిలకి నిజాయితీ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు అర్థం అవుతుంది. ఏ అబ్బాయి అయినా కూడా ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆమెతో నిజాయితీగా ఉండటం అన్నది అతను చేయాల్సిన మొదటి పని అవుతుంది అలా చేయడం ద్వారా అబ్బాయి అమ్మాయి మనసులో ఎక్కువగా స్థానం సంపాదించుకొగలుగుతాడు.
  1. హెల్ప్ అడిగే వాళ్ళు = అమ్మాయిలను హెల్ప్ అడిగే అబ్బాయిలు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు… ఎందుకంటే ఒక అమ్మాయిని సాయం చేయమని అడగడం వాళ్ళకి చాలా నామోషీగా ఉంటుంది అందుకని ఏ అబ్బాయి కూడా చాలా వరకు అమ్మాయిలను హెల్ప్ కావాలని అడగడం అన్నది అసలు జరగదు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమకు హెల్ప్ చేయమని అబ్బాయి అడగడం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట… దానికి ఇక్కడ చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా తమ ప్రేమిస్తున్నా అబ్బాయి తమ వల్ల బెనిఫిట్ అవుతున్నాడు అన్న సంతోషం అలాగే నేను అతనికి సాయం చేయగలిగినంత స్థాయిలో ఉన్నాను అన్న ఒక నమ్మకం ఇవన్నీ కలిసి ఒక అబ్బాయి అమ్మాయిని హెల్ప్ చేయమని అడిగినప్పుడు అతను అని మనసులో లో ఒక మంచి ఇంప్రెషన్ వేయడానికి చాన్స్ దొరికినట్లు అవుతుంది.
  1. ధైర్యం ఉన్న వాళ్లు = ఇది జనరల్ గా అందరికీ తెలిసిన విషయమే… ఎందుకంటే బాగా ధైర్యంగా ఉండే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది… అతను తనని అన్ని విధాలుగా ప్రోటేక్ట్ చేసుకోగలడు అని వాళ్లు నమ్ముతారు… అబ్బాయిలకి మంచి ధైర్యసాహసాలు ఉండాలని అతను తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా పోరాడగలిగే ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉంటే కచ్చితంగా అతనితో జీవితం బాగుంటుంది అని వాళ్లు నమ్ముతారు. అందుకే తమ వెంట కూడా అబ్బాయిల్లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని వాళ్ళు ఒకటికి పది సార్లు చెక్ చేసిన తర్వాతే అతనికి యస్ చెప్తారు.
  1. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు = ఏ అమ్మాయి అయినా కూడా తను బాగా గౌరవించే అబ్బాయి అంటే ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం బతుకుతుంది మెయిల్ డామినేట్ సొసైటీలో కాబట్టి అమ్మాయిలకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ జీవితాలను గౌరవిస్తూ వారి విషయంలో లో ఇలాంటి తప్పులు చేయకుండా అన్ని విధాలుగా సాయం చేసే వాళ్ళు అంటే అమ్మాయిలు కచ్చితంగా ఇష్టపడతారు. ఒక అమ్మాయికి ప్రేమ విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా భరిస్తుంది కానీ అదే తనకు గౌరవం ఇచ్చే విషయంలో చిన్న తేడా వచ్చినా కూడా ఆమె సహించదు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు గాని లేదా పదిమందిలో ఉన్నప్పుడు గానీ ఇలా ప్రతిసారి తనకు కావాల్సిన రెస్పెక్ట్ అన్నది అమ్మాయి కచ్చితంగా ఇవ్వాలి అని కోరుకుంటుంది.
  1. ఓపెన్ మైండ్ తో ఉండే వాళ్ళు = మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కల్మషాలు లేకుండా చాలా ఓపెన్ గా ఉంటూ తనకు ఏది అనిపిస్తే అది చెబుతూ అమ్మాయితో అన్ని విషయాలు షేర్ చేసుకునే అబ్బాయిలు అంటే వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి వారి వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రావు అని వాళ్లతో జీవితం పంచుకుంటే అది చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది అని వాళ్లు ఎక్కువగా నమ్ముతారు. అలా కాకుండా తమతో అంత ఓపెన్ గా లేకుండా ప్రతి విషయంలో తమను అనుమానిస్తూ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడరు.
  1. ఇతరులను మార్చాలని అనుకోని వాళ్ళు = ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కి అయినా కూడా తనకంటూ కొన్ని సిద్ధాంతాలు నమ్మకాలు ఉంటాయి అయితే అతను తనలాగా ఇతరులను మార్చాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది… అలా ఇతరులను మార్చాలి అనుకునే అబ్బాయిలు అంటే అమ్మాయిలు అంతగా ఇష్టపడరట… ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా ఇతరులను మార్చాలి అని ప్రయత్నించిన అబ్బాయిలు ఏదో ఒక రోజు తమని కూడా మార్చాలని ప్రయత్నిస్తారు అని దానివల్ల తమ వ్యక్తిత్వం దెబ్బతింటుంది అని అలా తాము మారిపోవడం వల్ల అబ్బాయి చేతిలో కీలుబొమ్మలుగా ఉండాల్సి వస్తుంది అని అమ్మాయిలు నమ్ముతారట… నిజానికి మీకు ఎన్ని నమ్మకాలు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా కూడా మీకు నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తిని మార్చాలి అనుకోవడం పోరాపాటే అవుతుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సో అబ్బాయిలు అవ్వండి… ఒకవేళ మీరు గనక ఒక అమ్మాయిని ఇష్టపడి లేదా ప్రేమించి తనకు దగ్గర అవ్వాలి అనుకుంటే మీలో కచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలుసుకున్నారు కదా అవన్నీ మీలో ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మీలో లేకపోతే డెవలప్ చేసుకుని అప్పుడు అమ్మాయిని ప్రయత్నించండి కచ్చితంగా ఆమె మీ ప్రేమని ఒప్పుకుని తీరుతుంది…. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!