17.8 C
New York
Tuesday, September 21, 2021

ఇంతకీ రామ్ చరణ్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా.?

టాలీవుడ్ లో కొన్ని అనుబంధాలు బహు ముచ్చటగా ఉంటాయి, ఈ అనుబంధాలను చూసి ఫాన్స్ ఎంతగానో మురిసిపోతుంటారు, అలాంటి కాంబినేషన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ బంధం గురించి.. ఒక్క ఫామిలీ నుండి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అలాగే  వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలు గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది, రామ్ చరణ్ అయితే తన తండ్రి చిరంజీవి కంటే ఎక్కువగా తన బాబాయి పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తుంటాడు అనే విషయం మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబందాన్ని చూసి మెగా ఫాన్స్ ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. రాజకీయ పరంగా కూడా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి ఏ స్థాయి సపోర్ట్ చేస్తూ వచ్చాడో మన అందరికి తెలిసిందే, 2019 ఎన్నికల సమయంలో తన బాబాయి ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అకస్మాత్తుగా ఆరోగ్య సమయ వచ్చి క్రిందపడిపోతే తన కాళ్ళు బాగాలేకపోయిన హుటాహుటిన ఆసుపత్రికి చేరి పవన్ కళ్యాణ్ ని పరామర్శించాడు రామ్ చరణ్, తన బాబాయి కోసం ప్రచారం చేయడానికి కూడా సిద్ధం అయ్యాడు, కానీ పవన్ కళ్యాణ్ అందుకు అనుమతించలేదు, ఇలా ఒక్కటే రెండా వీళ్లిద్దరి మధ్య ఇలాంటి సంఘటనలు మనమే ఎన్నో చూసాము, ఇక మన తెలియకుండా వీళ్ళ మధ్య సాన్నిహిత్యం ఇంకా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. జనసేన పార్టీ గురించి కూడా రామ్ చరణ్ ఎన్నో సార్లు సోషల్ మీడియా ఎంతో గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూసాము, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన మెగా ఫాన్స్ ను  గందరగోళానికి గురి చేయకుండా  తమ మద్దతుని తెలియజేశారు. ఇదిలా ఉండగా మెగా ఫాన్స్ తో ఈమధ్య ఆయన సోషల్ మీడియా లో జరిపిన ఒక్క లైవ్ ఇంటరాక్షన్ లో ఒక్క అభిమాని మీరు ఏ పార్టీ కి సపోర్ట్ చేస్తారు.? అని అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘ఇది మీ అందరికి ప్రత్యేకంగా చెప్పాలా?, నా సపోర్టు ఎప్పుడు బాబాయికే ఉంటుంది, ఎంతో గొప్ప ఆశయంతో బంగారంలాంటి కెరీర్ ని వదిలి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మందికి అండగా నిలబడ్డారు,అలాంటి వ్యక్తి కి సపోర్ట్ చేయడం నా బాధ్యత, కచ్చితంగా చివరి వరుకు నా సంపూర్ణ మద్దతు బాబాయి జనసేన పార్టీకి మాత్రమే’ అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా విషయానికి వస్తే ఆయన గత 2 సంవత్సరాల నుండి తన కాల్ షీట్స్ మొత్తం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకే ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయ్యింది, ఇక కేవలం 2 పాటలు.. కొన్ని సన్నివేశాలు తప్ప షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు ఫిల్మ్ నగర్ నుండి వినిపిస్తున్న వార్త, అలాగే ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఒక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ 2 సినిమాల తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు, ప్రముఖ నిర్మాత డి రాజు 50వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది, ఇలా వరుసగా భారత దేశం గర్వపడే దర్శకులు అయినా రాజమౌళి – శంకర్ లతో చేస్తున్న ఏకైక తెలుగు హీరోగా రామ్ చరణ్ చరిత్రకి ఎక్కాడు, మరీ ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఎవ్వరు అందుకోలేని స్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి రామ్ చరణ్ జనసేన పార్టీకి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని బలంగా చెప్పేసరికి మన జనసైనికులలో ఓ నూతనోత్తేజం వచ్చినట్లైంది. మరి ఈ మెగా బలంతో జనసేన పార్టీ మరింత పవర్ పుల్ గా జనంలోకి దూసుకెళ్తుంది.. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఓ సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ఆశిద్దాం

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!