23.3 C
New York
Friday, September 17, 2021

జనసేన పార్టీ ఎవరికీ సంబందించిందో తెలుసా ?

అధికారిక లెక్కలను బట్టి చూస్తే దేశంలో మొత్తం 2వేల 600లకు పైగా రాజకీయ పార్టీలున్నాయి..  వాటిలో 8 జాతీయ పార్టీలుంటే, 60 వరకు రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నాయి.. ఇన్ని పార్టీలు ఉండగా పవన్ ఎందుకు ప్రత్యేక పార్టీ పెట్టాడు.. పవన్ ఏ పార్టీలో కూడా చేరక పోవడానికి కారణమేంటి.. పవన్ అనుభవం ఇమేజ్ కి పార్లమెంట్ మెంబెరో, లేక మంత్రి అయ్యే అవకాశాలు చాలా సులువుగా ఉన్నా ఎందుకు వదులుకున్నాడు.. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీల మోటో పవన్ కి నచ్చలేదా.. ఇప్పుడున్న అన్ని పార్టీలోని సిద్ధాంతానికి జనసేన ఇడియోలజీకి తేడా ఏంటి..? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం

దేశంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు జాతీయ స్థాయిలో ముందంజలో ఉన్నాయి.. ఈ అన్ని పార్టీలు ప్రజలని ప్రధానంగా ఏకం చేయకుండా కేవలం ఓటు బ్యాంకు కోసం మతం, కులం, ప్రాంతం ఆధారంగా విడగొడుతున్నాయి…. ఇక కమ్యూనిస్టుల పార్టీల విషయానికి వస్తే పేదలు శ్రామికుల పక్షం అని చెప్పుకుంటూనే ఎన్నికలప్పుడు కొన్ని సీట్లను గెలవడానికే వారి సిద్ధాంతాలని కూడా పక్కకి పెడుతున్నారు.. రాష్ట్రం లోని పార్టీలు కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రాంతీయతని కులాన్ని రెచ్చకొట్టి, సెంటిమెంటుతో క్యాష్ చేసుకుంటున్నాయి.. ఇప్పుడున్న దాదాపు అన్ని పార్టీల్లో కూడా అవినీతి రౌడీఇజం తో నిండి పోయింది.. ఎలెక్షన్ టైం లో ఎంపీ ఎమ్మెల్యే టిక్కెట్లని అమ్ముకోవడానికి అన్ని పార్టీలు రెడీగా ఉంటున్నాయి.. పవన్ కళ్యాణ్ సేవ చేయడంలో ఎట్టి పరిస్థితిలోనూ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు.. ఈ విషయం ఆయన వ్యక్తిత్వంలో మనం చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి తప్పని పరిస్థితిలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక పార్టీ పెట్టాల్సి వచ్చింది.. 

పవన్ జనసేన పార్టీని స్థాపించకుండ రాజకీయాల్లోకి వచ్చి ఉంటె.. ఆయన ఈపాటికే కేంద్రంలోనో లేక రాష్ట్ర ప్రభుత్వంలోనో మంత్రి అయ్యేవారు.. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సాధ్యమైనంత సేవ చేసే అవకాశం దక్కేది కాదు..  పాలిటిక్స్ లో అడుగు పెడితే తన సినీ కెరీర్ loss అవుతుందని, ఇమేజ్ దెబ్బతింటుందని సన్నిహితులు చెప్పినా వినలేదు.. ప్రజల కోసం.. సేవ చేయాలనే స్వార్థం కోసమే పవన్ ఒంటరిగా రాజకీయ రంగంలోకి దిగాడు.. జనం కోసం జనసైనికుడిగా ఎదిగాడు. 

జనసేన పార్టీ ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు.. జనాలకి సంబంధించింది.. కేవలం జనం సమస్యలు పరిష్కరించడానికి.. జనం తరపున ప్రశ్నించడానికే ఉంది.. జనసేన పార్టీ సిద్ధాంతంలో కూడా జనమే కీలకం.. అదే పవనిజం.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles