17.8 C
New York
Tuesday, September 21, 2021

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నుండి జనసేనానిగా ఎందుకు మారాడా తెలుసా.?

75 సంవత్సరాలు గల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికి కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి నీరు అందని పల్లెలెన్నో, రోడ్డు మార్గం లేని తండాలెన్నో, విద్యుత్తు సదుపాయం లేని ఉర్లెన్నో, ప్రాథమిక పాఠశాలలు లేని మారుమూల గ్రామాలెన్నో, వైద్య సదుపాయం లేని వాడలెన్నో? దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతమంది అర్హత గల వ్యక్తులకు నేరుగా అందుతున్నాయి? ఇవన్నీ సాటి మనిషికి అర్థం అయినా, ఇప్పటికి కలలాగే ఉండే ఎన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం ఎక్కడ ఉంది? ఇవి ఎప్పుడు నెరవేరుతాయి? పదవులంటే, ప్రజలను బానిసలుగా చేసుకొని పాలించడమే అని భావించే రోజుల్లో, ఎన్నికలకు ముందు ఓటుకు 2000  రూపాయలు, ఆడవాళ్లకు ఒక చీర, మగవాళ్లకు ఒక బ్రాందీ సీసా, పిల్లలకు ఒక క్రికెట్ కిట్ ను ఇచ్చి వాళ్ళను ఏమార్చి, తమ మాటలతో వాగ్దానాలతో మభ్యపెట్టి ఓట్లు దండుకునే కాలంలో, అధికారం కోసం వేరే వారి కుటుంబాల మీద కూడా మానసికంగా దాడి చేసే సమయంలో, అడిగిన పదవులు ఇవ్వలేదని  రాజీనామా చేసి వేరే పార్టీలలోకి వెళ్లి తిరిగి అతన్నే విమర్శించే రోజుల్లో, రాజకీయ పదవులకోసం మీడియా, పత్రిక రంగాన్ని తమ అదుపులో పెట్టుకొని తుచ్ఛమైన పనులన్నీ చేసే పరిస్థితుల నుండి విసిగి వేసారి ఒక వ్యక్తి వచ్చాడు. రాజకీయం అంటే ఇది కాదు అని చెప్పి, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేలా చూపించడానికి వచ్చాడు. కులాలు మతాలు ప్రాంతాలంటూ అంత వేరు చేసి విభజించి పాలించి ప్రజలందరినీ వేరు వేరుగా చేసి వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం ప్రజలను మభ్యపెట్టే ఇలాంటి పరిస్థితి మారాలని ఒకడు వచ్చాడు. ఇలాంటి దీర్ఘకాల పరిస్థితుల్లో నుండే కడుపుమండి, సమాజంలో జరిగే ఇలాంటి అవినీతి అక్రమ రాజకీయ దౌర్జన్యాలు పైరవీలు నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని.. వాళ్లకు సేవ చేయాలనీ తన వృత్తినే వదిలేసి, కోట్లు గడించే సినిమాలను కూడా వద్దనుకుని త్యజించి, ఎంతోమంది ఆయనున్న స్థానం కోసం ప్రాకులాడుతుంటే, అలాంటి  స్థానాన్ని తృణప్రాయంగా వదిలేసి.. సమాజంలో జరిగే తప్పును ప్రశ్నించే అర్హత ఉండి కూడా ప్రశ్నిచకుండా, పోరాడకపోవడం తప్పు చేసినట్లే అని భావించి “సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులే రాజ్యాలు ఏలతారు” అనే నినాదాన్ని నమ్మి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనుకోని కొంతలో కొంత అయినా మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి ప్రవేశించిన వ్యక్తి  పవన్ కళ్యాణ్ గారు. సంపాదన, అధికారమే పరమావధిగా సాగుతున్న నేటి రాజకీయాల్లో, కనుమరుగౌతున్న నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను అందించాలనే ఉద్దేశంతో అణగారిన ఎన్నో వేల గొంతుకుల ప్రశ్న అయి ప్రశ్నించారు పవన కళ్యాణ్ గారు. చిన్నతనం నుండే సామజిక స్పృహ కలిగిన పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యక్షంగా పాల్గొన్న 2019 ఎన్నికల సందర్భంగా తిరిగిన ప్రతి ప్రాంతం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి ఎన్నో సమస్యలను వెలికితీశారు. పాలక ప్రతి పక్షాలను నిలదీశారు. ప్రజా సమస్యలను బయటికి తీసి, కవాతులు ద్వారా ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. తన జనసేన పోరాటయాత్రల ద్వారా అణగారిన బడుగు బలహీన వర్గాలకు నేనున్నానే ధైర్యం అందిస్తూనే అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరని చాలా సార్లు చెప్పారు. తన గురించి ఎవరైనా తప్పుడు వార్తలు రాసిన, తప్పుడు సమాచారం చెప్పిన ఎప్పుడు వాటికి స్పందించలేదు, బాధ పడలేదు. తన మీద ఎన్ని విధాలుగా మానసిక దాడులు చేసిన మౌనముగా సహించి, ధైర్యంగా ఎదురుకున్నాడే కానీ ఒకనాడు కూడా ఏ వ్యక్తిని కానీ, కుటుంబాన్ని దూషించిన దాఖలాలు లేవు. తనను ఎన్ని విధాలుగా పక్కదారి పట్టించాలని చుసిన, తన ధ్యేయం ప్రజల సంక్షేమం కొరకేనని నిరంతరం ప్రజల కొరకై పోరాడాడు. ప్రజా సంక్షేమమే తన అంతిమ లక్ష్యం అని చాలాసార్లు వక్కాణించి చెప్పారు. విద్యార్థులు, వైద్యులు, లాయర్లు, ఉద్యోగస్తులు, టీచర్లు, ఆటో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యాన రైతులు, పారిశుధ్య కార్మికులు.. ఇలా ప్రతి వృత్తి ప్రజలతో సభలను నిర్వహించి, వాళ్ళను ప్రత్యక్షంగా కలిసి, వాళ్ళ సమస్యలను సావధానంగా విని, ఎంతో ఓపికతో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం కోసం పాటుపడిన ఒక అసామాన్యుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా తనకు ఉన్నదానిలో కొంత సమాజము కోసం ఇస్తే, వాళ్ళను దేవుళ్ళం అంటూ పొగుడుతాము అలాంటిది తాను సంపాదించిన చాల భాగం వరకు ప్రజలకే, కష్టాల్లో ఉన్న వరకే దానధర్మాలు చేసిన పవన్ కళ్యణ్ గారిని ఏమనాలి? సాయం పొందిన వారు బయటకొచ్చి, మాకు పవన్ కళ్యాణ్ గారు సాయం చేసారు అని చెప్తే కానీ మనకు తెలియని సందర్భాలు కోకొల్లలు. తాను ఒక అగ్రనటుడు, కోట్లు సంపాదించగల వ్యక్తి అని మరచి, ఒక సామాన్యుడులా మనలో కలిసిపోయాడు. ఇంకా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించలేని అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఎటువంటి ఆడంబరాలు లేని అసామాన్య వ్యక్తి. 2019 లో జరిగిన ఎన్నికల్లో, జనసేనకు 22 లక్షల ఓట్లు పడ్డాయంటే, 22 లక్షలమంది పవన్ కళ్యాణ్ గారులు ఉన్నారని కాదు. ఎవరిదారి వారిది, ఎవరి అభిమానం వారిది. ఎవరి పని వారిది. ఎవరి జీవితం వారిది. కానీ వీళ్లంతా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆశయాలను గౌరవిస్తూ, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో తమ వంతు ప్రయత్నంగా, తమ ఓటు హక్కును జనసేనకు వేసి మార్పులో భాగం అయ్యేందుకు ముందుకు కదిలిన ఆశయ సాధకులు. వీళ్లందరినీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆశయాలు ఒక్కటి చేసి, ఆవిధముగా అందరిని రాజకీయాలవైపు ఒక్కటిగా ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేసాయి.  చాల సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, “నాకు రాజకీయంగా ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు కాదు” అని. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ “నేనైతే ఆ హీరో సినిమా పోతే బాగుండు అని అనుకున్న కొన్ని సందర్భాలలో, కానీ కళ్యాణ్ గారు అలా అనుకోకూడదు. వాళ్ళ సినిమా కూడా బాగా ఆడాలి అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుంది, అందరు బాగుంటారు” అని చెప్పారు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అభిమానించకుండా ఉండలేరు. ఈరోజుకి సేవ కార్యక్రమాల నుండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి ఆయనే స్ఫూర్తి. ఎందరో IAS లాంటి ఉన్నత స్థాయిలో సాధించడానికి ఆయనే మార్గదర్శి. చదివింది ఇంటర్మీడియట్ వరకే కావొచ్చు కానీ ఆయన జ్ఞాన సముపార్జన చూస్తే, ఒక దేశాన్ని పాలించే వ్యక్తికి ఉండాల్సినంత జ్ఞానాన్ని సంపాందించి ఇప్పటికి కూడా నిత్య విద్యార్థిలా  ఉంటారు. దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక సైనికుడు. ప్రకృతిని వ్యవసాయాన్ని ఇష్టపడే ఒక మాములు రైతు. అన్ని మతాలను గౌరవిస్తూనే, తన మతాన్ని విశ్వసించే ఒక తాత్వికుడు. పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా వచ్చే హోదాలను అనుభవించాలని ఎంతమాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడు ఒకమాట చెప్తుంటారు “రాజకీయాలంటే బాధ్యతో కూడిన పదవి, ప్రజలకు సేవ చేసే ఒక ఉద్యోగం మాత్రమే కానీ ప్రజలను పాలించడం మాత్రం కాదు” అని. మనం పుస్తకాల్లో చదివిన ఒక గొప్ప వ్యక్తి, ఉదాహరణగా ఈనాడు మన కళ్లెదుటే ఉన్నాడు. గుర్తించి, అతనికి మన సంఘీభావం తెలిపి మన జీవితాలను మరియు మన తరువాతి తరం జీవితాలను ఒక మంచి మార్గంలో వెళ్లేలా మన వంతు ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ గారికి మన సంఘీభావం తెలుపుదాము. మార్పులో భాగస్వామ్యం అవుదాం. తన జీవితాన్నే ఒక మార్గదర్శకంగా చూపెడుతున్న ఈ నిస్వార్థమైన మంచిమనిషిని అనుసరించి, మార్పులో భాగమై తద్వారా అవినీతి, అక్రమాలు, అన్యాయాలు.. లేని ఒక కొత్త సమాజానికి పునాది పడేలా పాటుపడదాం.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!