22 C
New York
Wednesday, September 22, 2021

151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము బిజెపికి ఉందా ?

కేంద్రంతో పాటు మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం తాము చేజిక్కించ్చుకోవడానికి చూస్తున్నాయి. సౌత్ రాష్ట్రాల్లో బిజెపి ప్రభావం పెద్దగా లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడు బిజెపి కొన్ని సౌత్ రాష్ట్రాల్లో పుంజుకుంటుంది. ఇదిలా ఉండగా బిజెపి తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీల బలంగా ప్రభావం ఉంది. తెలంగాణలో టీఆరెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో వైసీపి, టీడీపీ.. పార్టీలు కూడా ఎవ్వరికీ అందని రీతిలో ప్రజల్లో పాతుకుపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేనే తొఫు అనుకున్న టీడీపీ పార్టీని ఓడించి జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. జగన్ అనే పేరు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడూ ఓ సంచలనం. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి కష్టాలను తెలుసుకున్న జగన్ నవరత్నాలను ప్రవేశ పెట్టి చరిత్రలో ఎవరికి అందని విజయాన్ని సాధించాడు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగన్ ప్రజలకు ఏంకావాలో ఆలోచించి, చేస్తున్నాడు. దీంతో జగన్ పై ప్రజల్లో మరింత నమ్మకం.. అభిమానం ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా జగన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకం పోయాలే చేసి తాము అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. వైసీపీ ఉన్న 150 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే ఏపీలో బిజెపి అధికారంలోకి వస్తుందా.? వైసీపీని ఎదుర్కుంటుందా.? ఈ ప్రశ్నలకు వస్తున్న సమాధానం కాదు అనేది వస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తుంది. అధికారం మాట పక్కన పెడితే కొంచం అయిన పుంజుకుని ఎన్నో కొన్ని సీట్లు ఓట్లు సంపాదించుకోవాలని చూస్తుంది. ఇందుకోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగా వైసీపీ పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది. వివిధ పథకాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, పోలవరంలో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేస్తుంది. రాష్ట్రం అమలు చేసే ప్రతి పథకాల్లో కేంద్రం వాటా ఉందని, కేంద్రం నిధులు ఇస్తుందని అంటున్నారు ఏపీ బీజేపీ నాయకులు.ఇన్ని చెప్పిన కూడా బిజెపిని ఏపీ ప్రజలు నమ్ముతారా అనేది ప్రశ్న. అయితే ఎంత చెప్పినా కూడా బిజెపిని ఏపీ ప్రజలు నమ్మరు. ఇది ఏపీ బీజేపీ నాయకులకు సైతం తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఏపీలో కనిపించేది ఒక్కటే పార్టీ వైసీపీ ఒక్కడే నాయకుడు జగన్.. ఇది ప్రజల్లో ఉన్న మాట. అంతే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. ప్రతి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ, ఎవ్వరిని అసంతృప్తికి దారి ఇవ్వకుండా అందరకీ సమాన న్యాయాన్ని అందిస్తున్నాడు. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలని చేరువ చేస్తున్నాడు. అయితే దింట్లో ఒకటి రెండు పథకాలకు తప్పా కేంద్రం మరే పథకాలకు నిధులు ఇవ్వదు. అంతే కాదు ఇచ్చిన కొన్ని పథకాలకు కూడా నామమాత్రమే ఇస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం. విశాఖ స్టీల్ ప్లాన్ ప్రయివేట్ పరం చేయడం వంటి అంశాలపై ఏపీ ప్రజలు బీజేపీ పై గుర్రుగా ఉన్నారు. మొత్తంగా పథకాలు విమర్శలు పక్కన పెడితే. బిజెపి పై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కనీస డిపాజిట్లు కూడా బిజెపి దక్కించుకోలేదు అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు బిజెపి పై ప్రజల్లో నమ్మకం లేదు.. ఇప్పట్లో రాదు.. అంతే కాదు బలంగా ఉన్న టీడీపీ సైతం ప్రస్తుతం వైసీపీని తట్టుకునే పరిస్థితుల్లో లేదు. ప్రస్తుతం ఏపీలో జగన్ ఫ్యాన్ గాలి నడుస్తుంది.. ఈ గాలిలో 150 సీట్లు కాదు కదా కనీస సీట్లు బిజెపి దక్కించుకుంటే చాలు.

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!