3 C
New York
Saturday, December 4, 2021

అమ్మాయిలతో ఈ విషయాలు చెప్పారా ఇక మీ పని ఖతం !!!!

అబ్బాయిలు స్కూల్ లోనే ఆ తర్వాత కాలేజ్ లోనో చదువుకున్నప్పుడు వాళ్ళకు టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ చాలానే ఉంటాయి అయితే వన్స్ ఒక అమ్మాయి పరిచయం అయ్యి తనతో లవ్ లో పడితే అప్పుడు అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ అమ్మాయి అన్న విషయం బాగా అర్థం అవుతుంది. ఒక అమ్మాయితో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అన్న విషయంలో దాదాపు 90% అబ్బాయిలకు ఒక అవగాహన ఉండదట అందుకే చాలాసార్లు అమ్మాయిల దగ్గర సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారట… అసలు గర్ల్స్ తో ఎలాంటి విషయాలు చెప్పాలి ఏది మాట్లాడితే వాళ్ళను అట్రాక్ట్ చేయగలం ఏవీ చెపితే వాళ్ళు హర్ట్ అవుతారు అన్నది తెలియక తమకు తెలియకుండానే అమ్మాయిల్ని బాధ పెడుతున్నారట దాంతో వాళ్ళ లవ్ స్టోరీ లకు తొందరగానే ఎండ్ కార్డ్ పడుతుందట. అయితే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఈ విషయాల మీద కొంత మంది అమ్మాయిల్ని సర్వే చేసిందట దాంట్లో ఎన్నో ఆసక్తికర అంశాలు బయట పడ్డాయి. సో గాయ్స్ మారి అవేంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి…

జనరల్ గా అమ్మాయి అనగానే ఇంట్లో వాళ్ళ దగ్గరి నుంచి బయట వ్యక్తుల వరకు ఇలా ఉండండి అలా వుండండి అని సవాలక్ష రీజన్స్ చెప్పి అమ్మాయిల్ని కంట్రోల్ చేయాలని చూస్తారట అసలు తమకే సంబంధం లేకున్నా ఏదో ఒకటి చెపుతూ ఒక విధమైన రాక్షసానందం పొందుతారని అది తమకు ఎంతో కోపాన్ని తెప్పిస్తోందని వాళ్ళ ఫీలింగ్ అట… ఇక తమ బాయ్ ఫ్రెండ్ లేదా లవర్ మీద తాము ఎన్నో ఆశలు పెట్టుకుంటే వాళ్ళు కూడా చాలాసార్లు తమను ఇలా వుండమని అలా చేయమని చెప్పే మాటలు విసుగు తెప్పిస్తాయి అని సర్వేలో చెప్పారట… ఇంతకీ ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్బాయిలు అమ్మాయిలకు చెప్పకూడదని మాటలు ఏంటంటే…

1. నవ్వమని చెప్పడం… అదేంటి నవ్వమనడం మంచి విజయమే కదా అని షాక్ అవకండి… అసలు అమ్మాయిల మూడ్ ఎలా ఉందో లోపల తన ఫీలింగ్ ఏంటో తెలుసుకోకుండా స్మైల్ అంటే వాళ్ళకు పిచ్చ కోపం వస్తుందట. తాను నవ్వకుండా ఉంటే ఇప్పుడు ప్రపంచం ఏమన్నా మునిగిపోతుందా అనుకుంటారట. 

2. అమ్మాయి ఫేస్ గురించి కామెంట్స్ చేయడం : మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని కలవాలని తనకు కుదిరిన తీరులో రెడీ అయ్యి వస్తుంది… కానీ మీరేమో నీ ఫేస్ ఇలా ఉంది… మేకప్ కొంచెం ఎక్కువయ్యింది అంటూ కామెంట్స్ చేస్తే అసలు వీడిని కలవడానికి వచ్చి పెద్ద తప్పు చేశాను అని ఫీల్ అవుతారట… తను మీకోసం వచ్చిన ఎఫర్ట్ పక్కన పెట్టి మీరింకెవో కామెంట్స్ చేయడం అసలుకే ఎసరు తీసుకొస్తుంది అని ఆ సర్వే లో పాల్గొన్న అమ్మాయిలు చెప్పారట.

3. అమ్మాయి నో చెప్పితే తనను బలవంత పెట్టకూడదు :

 అమ్మాయిలు ఏ విషయం గురించి అయినా ఒకసారి నో… కుదరదు అని చెపితే ఇక దాని గురించి మళ్లీ తన దగ్గర ఎలాంటి డిస్కషన్ పెట్టకూడదట… అది రొమాన్స్ గురించి అవొచ్చు లేదా మీరు సినిమాకు రమ్మని అడగడం ఇంకోటొ అయుండచ్చు అదేదో సినిమాలో చెప్పినట్టు నో మీన్స్ నో అంతే.

4. గొడవలు జరిగితే అమ్మాయిని బ్లేమ్ చేయకూడదు :

లవ్ అంటేనే చిన్న చిన్న గొడవలు, అలగడాలు, అపార్థాలు అబ్బో చాలా కథ వుంటుంది… అలాంటివి జరిగినప్పుడు అమ్మాయిని అంతా తనవల్లే జరిగింది అనో లేకపోతే తప్పంతా తనదే అనో బ్లేమ్ చేయకూడదట… అలా చేస్తే మీరు అమ్మాయిల మనసు విరిచేసినట్టే అన్నది గుర్తుపెట్టకోవాలనీ సర్వే లో పాల్గొన్న అమ్మాయిలు చెప్పారట.

స్మాల్ టిప్ : ఒకవేళ జరిగిన గొడవలో నిజంగా అమ్మాయి తప్పున్నా మీరే సర్దుకుపోవాలి కానీ తప్పు తనదే అంటే ఇంక అంతే సంగతులట. 

5. తను చెప్పింది ఆల్వేస్ కరెక్ట్ అనే చెప్పాలి… రాంగ్ అన్నారో మీ పని అయిపోయినట్లే!!!

అమ్మాయి ఏం చెపితే అది కరక్ట్ అనేయండి అంతే ఆమెతో మీ రిలేషన్ చాలా హాయిగా హ్యాపీగా అలా అలా సాగిపోతుంది… పొరపాటున తను రాంగ్ అని డిబేట్ పెట్టారో ఆమె దారుణంగా హర్ట్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉన్నా అదంతా తన మీద రుద్దకండి… ముందు తనేంటో తన ప్రపంచం ఏంటో తెలుసుకోండి ఆమె నమ్మకాలు ఆమెకు వుంటాయి ఈ విషయంలో కొంచెం సెన్సిబుల్ గా డీల్ చేయండి అంతే కానీ మీరే కరక్ట్ తనే రాంగ్ అని ప్రూవ్ చేస్తూ కూర్చోకండి అలా చేస్తే అది మీ లవ్ స్టోరీ నే ఎండ్ చేస్తుంది జాగ్రత్త.

సో అబ్బాయిలు అవీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పకూడని మాటలు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టైం మీరెప్పుడు మీ లవర్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పకుండా జాగ్రత్త పడండి అది డైరెక్ట్ గా కలిసినప్పుడు అయినా సరే లేకపోతే ఫోన్ చాటింగ్ అప్పుడు అయినా సరే మీరు మాత్రం తొందరపడి తము హర్ట్ అయ్యే మాటలు చెప్పకండి…

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!