17.8 C
New York
Tuesday, September 21, 2021

ఈ ఐదు విషయాలు ఎవరితోనూ పొరపాటున కూడా షేర్ చేసుకోకండి!!!

లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటారు అంటే మనిషి రహస్యాలన్నీ దేవునికి మాత్రమే తెలుసు అని అర్థం అయితే ఒక మనిషి జీవితంలో తన రహస్యాలన్నీ తన ఫ్రెండ్స్ కు ఫ్యామిలీకి పెళ్లి చేసుకుంటే కట్టుకున్న భార్యకు వీళ్లకు మాత్రమే తెలుస్తాయి. కొంతమంది మరీ ఓపెన్ గా ఉండి తమకు సంబంధించిన ప్రతి రహస్యాన్ని అందరితో షేర్ చేసుకుంటారు కొందరు మాత్రం తమకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా ఇతరులతో పంచుకోరు. అయితే మీ జీవితం లో ఉన్న ఎన్నో విషయాలను మీకు ఇష్టమైన వారితో పంచుకున్నా పెద్ద తప్పేమి లేదు… కానీ మీరు కచ్చితంగా ఇతరులతో షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి… ఢిల్లీకి చెందిన నగేష్ అగర్వాల్ అనే ఒక సైకాలజీ ప్రొఫెసర్ తను చేసిన రీసెర్చ్ లో భాగంగా కొన్ని పర్టికులర్ విషయాలను మనం ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడమే ఉత్తమం అని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలేంటో మనం తెలుసుకుందాం.

1. ప్రైవేట్ మెసేజెస్

ప్రైవేట్ అన్న పదం లోనే ఎంత ప్రైవసీ ఉందో మీకు కొత్తగా చెప్పక్కర్లేదు… మన పర్సనల్ విషయాలు అనుకునేవి కొన్ని ఉంటాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మిగతా వారికి తెలియనీయకూడదు. మీ అమ్మ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు లేదా మీ పిల్లలు కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అనుకునే వారికి కూడా ఈ ప్రైవేట్ మెసేజ్లు గురించి ఎటువంటి వివరాలు చెప్పకూడదు. ప్రైవేట్ మెసేజ్ లు అంటే అవి మీరు మీ లవర్ కి పంపించిన పర్సనల్ మెసేజ్లు కావచ్చు లేదా మీరు మీ కొలికి పంపించిన ఏవైనా ముఖ్యమైన ఈ-మెయిల్స్ కూడా కావచ్చు ఇలా మనం మన వ్యక్తిగత విషయాలు అనుకునేవాటిని ఎవరితోనూ అంత ఈజీగా మెసేజ్ ల రూపంలో షేర్ చేసుకోవడం వల్ల అది మనకే డేంజర్ అని నగేష్ అగర్వాల్ రీసెర్చిలో తెలిసిందట. మీరు మీ లవర్ తో చేసిన చాటింగ్ మెసేజ్ లు లేదా మీ ఉద్యోగ పరంగా పంపిన ఈ-మెయిల్స్ లేకపోతే మీ ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ మెసేజ్ ఇలా మీకు పర్సనల్ అనిపించే ఏ ఒక్క మెసేజ్ లను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎవరితో ఎలాంటి రిలేషన్ షిప్స్ కలిగి ఉన్నారో మీ మధ్య ఎలాంటి సంబంధం ఉందో అన్న విషయాలు బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు.

2. ఒకరి మీద మీకున్న ద్వేషం పగ గురించి ఎవరికీ చెప్పకూడదు.

ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అని నరేష్ అగర్వాల్ తన రీసెర్చ్ లో చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఒక వ్యక్తి మీద కోపం కాని ద్వేషం కానీ ఉన్నప్పుడు వారికి తెలియకుండానే అందరి ముందు బహిరంగంగా వాళ్ళ మీద తమకున్న కోపాన్ని వ్యక్తపరుస్తుంటారు… దాంతో మన శత్రువులెవరో వాళ్ళ మీద మనకు ఎలాంటి కోపం ఉందో అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. నీ శత్రువులేవరో నువ్వు బహిరంగంగా ప్రకటిస్తే ఆ శత్రువు అలెర్ట్ అవుతాడు దాని వల్ల నీకే హనీ జరుగుతుంది. అందుకే ఎవరి మీదైన మీకున్న కోపాన్ని, ద్వేషాన్ని వదిలేయండి దానికి బదులు మీ దృష్టిని ఏవైనా మంచి అలవాట్ల వైపు మరల్చండి.

3. మీరు ఎవరినైనా మోసం చేసుంటే ఆ విషయం మీలోనే ఉంచుకోండి బయటకు చెప్పొద్దు.

పోటీ ప్రపంచంలో కొన్ని కొన్ని సార్లు మనకు నచ్చకపోయినా మన లైఫ్ కోసం లేదా మన వాళ్ళకోసం తప్పులు చేయాల్సి వస్తుంది… అయితే అలా ఒకరిని మోసం చేయడం అన్నది బయటకు ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే అలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల మీ మీద ఇతరులకు చెడు అభిప్రాయo ఏర్పడి మీ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది పోతుంది. మీ లవర్ నో లేదా మీ భార్య/ భర్తని మీరు కొన్ని అనుకోని పరిస్థితుల్లో చీట్ చేసి ఉండొచ్చు అలా చేసినందుకు మీరు గిల్టీగా కూడా ఫీల్ అయుండొచ్చు అయినా కూడా ఆ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవడం మంచిది కాదు.మీకు మెంటల్ గా అంత స్ట్రెస్ అనిపిస్తే ఎవరైనా థెరపీ డాక్టర్ ను లేదా సైకాలజిస్ట్ ను కలవండి అంతే కానీ పొరపాటున కూడా ఇలాంటి విషయాలను ఇతరులతో షేర్ చేసుకుని చిక్కుల్లో పడకండి.

4. మీ సెక్స్ లైఫ్

సెక్స్ అనేది ఎవరి లైఫ్ లో అయినా చాలా ఇంపార్టెంట్ విషయం… దీంట్లో ఎలాంటి సందేహం లేదు… కానీ మీకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా మీ భార్య / భర్త తో ఉన్న సెక్స్ లైఫ్ గురించి మీ ఫ్రెండ్స్ ముందో లేదా మీ కొలీగ్స్ ముందో చెప్పకండి… సెక్స్ అనేది నాలుగు గోడల మధ్య మీకు మీ పార్టనర్ కు జరిగే ఒక పర్సనల్ విషయం దాన్ని పది మంది ముందు పెట్టడం ద్వారా మీ లవర్ లేదా భార్య/భర్త వ్యక్తిత్వాన్ని మీరు దెబ్బ తీస్తున్నట్టే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నా సెక్స్ అనేదాన్ని మాత్రం మీకు మీ పార్టనర్ మధ్యనే ఉంచుకోండి… మీ లైఫ్ లో మీరు ఎవరితో సెక్స్ చేసినా సరే ఆ విషయాలు అందరితో పంచుకునేవి కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీ సెక్స్ వల్ ఎక్స్ పీరియన్స్ లు గొప్పగా మీరేదో సాధినట్టు అందరి ముందు చెప్పుకున్నా ఆ టైమ్ లో అందరూ మిమ్మల్ని పొగిడినా ఆ తర్వాత మీ వెనకాల అతనో క్యారెక్టర్ లేని మనిషి అంటూ నింద వేస్తారు. ఒకవేళ మీకు మీ పార్టనర్ కి గనక సెక్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇద్దరూ కూర్చుని డిస్కస్ చేసుకోండి లేదా ఎవరైనా సెక్స్ ఎక్స్ పర్ట్ డాక్టర్ ను కలవండి.

5. మీ లవర్ or పార్టనర్ సీక్రెట్స్.

మీకు లవర్ లేదా మీ భార్య/ భర్త ల గురించి ఏమైనా సీక్రెట్స్ తెలిస్తే వాటిని మీలోనే దాచుకొండి వారి మీద కోపం తోనే లేదా మీకు సరదాగా అని పించో బయటి వ్యక్తులతో షేర్ చేసుకోకండి దాని వల్ల మీ పార్టనర్ కే కాక మీకు కూడా చెడే జరుగుతుంది. ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మి వాళ్ళ రహస్యాలు మీతో షేర్ చేసుకున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతో నమ్మారని అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి… ఎందుకంటే ఒకరి మీద నమ్మకం కలగడానికి కొన్నేళ్ళు పడుతుంది కానీ అదే నమ్మకం పోవాలంటే ఒక్క నిమిషం చాలు… ఏ రిలేషన్ షిప్స్ లో అయినా నమ్మకం అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది… మీరు ఎవరినైనా నమ్మి మీ సీక్రెట్స్ చెప్పినా కూడా వాళ్ళు మీ పట్ల నమ్మకంగా వుండాలనే మీరు కోరుకుంటారు అందుకే మీరు కూడా మిమ్మల్ని నమ్మిన వారికి ద్రోహం చేయకండి. 

సో ఫ్రెండ్స్ అవండి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వారితోనూ లేదా మీ భార్య, భర్త, మీ లవర్, మీ ఫ్యామిలీ ఇలా ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకూడని ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ టైం తొందర పడి ఎవరి ముందు మీ సీక్రెట్స్ చెప్పేయకండి మరి…

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!