17.7 C
New York
Tuesday, October 19, 2021

దసరా కానుకగా థియేటర్స్‌లో. విడుదల కానున్న “దృశ్యం 2”

తెలుగు సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అసురన్‌తో పాటు ఓ మలయాళీ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైనా దృశ్యం 2 సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. మలయాళం దృశ్యం 2లో మోహన్ లాల్ హీరోగా చేసారు. ఈ సినిమా అక్కడ డైరెక్ట్‌గా OTT లో విడుదలై అదరగొట్టింది. ఇక మొదటి సినిమా దృశ్యంను వెంకటేష్ ఇదివరకే తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని విడుదలకు రెడీ అయ్యింది. అయితే కరోనా కారణంగా థియేటర్స్‌ లో విడుదలకాలేదు. దీంతో ఈ సినిమాను హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తారని టాక్ వచ్చింది. అయితే వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. దృశ్యం2 ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు. దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో పాటు వెంకటేష్ మరో సినిమాను కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్టైనా అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ నారప్ప పేరుతో రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ప్రియమణి కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా కరోనా కారణంగా ఆ మధ్య అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్ర‌స్తుతం ఎఫ్3 సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2‌కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!