23.6 C
New York
Monday, September 20, 2021

Drushyam 2 OTT Release Date | Venkatesh | Meena | ShriTv Entertainment

టాలీవుడ్  సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్… వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేసాడు. ఈ సినిమాను మే 14న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు వెంకీ మామ..  ఓ మలయాళీ చిత్రాన్ని మరోసారి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.  తాజాగా  దృశ్యం 2ను రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ మళయాళంలో హిట్ అయ్యిన ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. అక్కడ ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. మిగిలిన పార్ట్ వారం పది రోజుల్లో పూర్తి చేసి ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. . ఈ సినిమా 2014లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్’గా వస్తోంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ కట్టిపడేశాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనేది కథ. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంది. ఇక ఈ దృశ్యం 2 సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థ  ఈ సినిమా కోసం రూ. 30 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. పైగా ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే సాహసం చేయడం లేదు. దీంతో చిత్ర నిర్మాత సురేష్ బాబు.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రీసెంట్‌గా నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాను ముందుగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. తీరా థియేటర్స్ ఓపెన్ కావడం.. క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు వంటి సినిమాలకు కలెక్షన్లు బాగా రావడంతో నాగార్జునతో పాటు నిర్మాత ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో విడుదల చేసారు. ఈ సినిమాకు టాక్ బాగున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకొని లైట్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాను రూ. 9 కోట్లకు అమ్మితే.. కనీసం రూ. 3.50 కోట్లు మాత్రమే రాబట్టి డబుల్ డిజాస్టర్‌గా నిలిచి హీరోగా నాగార్జున ఉనికిని ప్రశ్నించేలా చేసింది. మొత్తంగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే.. రూ. 22 కోట్ల అన్న దక్కేవి. ఓటీటీ డీల్ కాన్సిల్ చేసుకున్నందకు సగానికి సగం రేటుకే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles