2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Celebrities Birthdays on Jan 02 || Ahuti Prasad || Gopika Poornima || Shri Tv Wishes

Famous Celebrities Birthdays on Jan 02 || Ahuti Prasad || Gopika Poornima || Shri Tv Wishes

జనవరి 2 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       A. V. S. : ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అంటే గుర్తుపట్టలేక పోవచ్చు అదే నాకదో తుత్తి అంటూ తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో కామెడీ చేసిన నటుడు AVS అంటే టక్కున గుర్తొస్తారు. 1957 జనవరి 2న ఏవీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జన్మించారు. కాలేజీలో చదువుతున్నప్పుడు నాటకాలు వేసేవారు రసమయి సంస్థని రూపొందించారు, మిమిక్రీ కళాకారుడిగా పేరు సంపాదించుకున్నారు. 1993లో విడుదలైన ‘మిస్టర్‌ పెళ్ళాం’ మొదటి సినిమా సినిమాలో ఏవీఎస్‌ ‘నాకదో తుత్తి’ అనే బాగా పాపులర్ అయ్యింది.  ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు ‘శుభలగ్నం’ చిత్రంలో ‘గాలి కనుబడుతుందా అంటూ ‘ఘటోత్కచుడు’ సినిమాలో ‘రంగు పడుద్ది’ అంటూ డైలాగ్స్ చెప్పి తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు, నారదుడిగా, శకునిగా పౌరాణిక సినిమాలలోనూ నటించారు. ఆయన నటించిన సినిమాల్లో మాయలోడు‘లక్కీ ఛాన్స్‌’, ‘యమలీల’, ‘బంగారు కుటుంబం’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘ఆమె’, ‘సూపర్‌ పోలీస్‌’, ‘పుణ్యభూమి నా దేశం’, ‘రిక్షావోడు’, ‘ఘటోత్కచుడు’, ‘అల్లుడా మజాకా’, ‘సిసింద్రీ’, ‘వజ్రం’, ‘శుభమస్తు’, ‘రాంబంటు’, ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’, ‘ధర్మ చక్రం’, ‘రాముడొచ్చాడు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘వినోదం’, ‘వీడెవడండీ బాబు’, ‘పెళ్లి సందడి’ లాంటి సినిమాల్లో తన కామెడీ గుర్తుకు వస్తుంది. ‘అంకుల్‌’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’ సినిమాలను నిర్మించారు. ‘సూపర్‌ హీరోస్‌’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’, ‘రూమ్‌ మేట్స్‌’, ‘కోతిమూక’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 19 ఏళ్ల కెరీర్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు   1994లో ‘శుభ లగ్నం’ సినిమాలో ఉత్తమ మేల్‌ కమెడియన్‌గా నంది అవార్డ్, 2000లో ‘అంకుల్‌’ సినిమాకు నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డ్, 2011లో ‘కోతిమూక’ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నారు.

  2.       Raman Lamba  : రామన్ లంబ ప్రముఖ భారతీయ క్రికెటర్ నేడు ఆయన పుట్టినరోజు. రామన్ లంబ జనవరి2, 1960లో ఉత్తర ప్రదేశ్ లోని మీరూట్ లో జన్మించారు. రామన్ లంబ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 121 మ్యాచ్ లు ఆడి 8776 పరుగులు చేసాడు అందులో 31 సెంచరీలు, 27హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన టాప్ స్కోర్ 320 గా నిలవగా తన బెస్ట్ బౌలింగ్ 2/9 గా ఉంది. అలాగే రామన్  తన మొదటి క్రికెట్ మ్యాచ్ 1987లో శ్రీలంక తో ఆడాడు. తన కెరీర్లో 4టెస్ట్ మ్యాచ్ లు ఆడి, 102 పరుగులు చేసాడు అందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా తన టప్ స్కోర్ 53. తన మొదటి వన్డే మ్యాచ్ 1986లో ఆస్ట్రేలియాతో ఆడాడు తన కెరీర్లో మొత్తం 32మ్యాచ్ లు ఆడి 783రన్స్ చేసాడు. అందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన టాప్ స్కోర్ 102కాగా తన బెస్ట్ బౌలింగ్ 1/9 గా నిలిచింది.  

  3.       Ahuti Prasad   : ‘ఆహుతి’ ప్రసాద్‌ 1958 జనవరి 2న కృష్ణాజిల్లా కోడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు, అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. చిన్నప్పటి నుంచే ఆయనకు నటనపై ఆసక్తి ఉండేది. నాగార్జునసాగర్‌లో హైస్కూల్‌లో చదివేటప్పుడే ‘అభినయం’ అనే నాటకంలో నటనకుగాను ఉత్త మ నటుడు అవార్డు పొందారు. 1983లో హైదరాబాద్‌లో ‘మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌’లో చేరారు.  ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆహుతి చిత్రంతో మంచి పేరు రావడంతో సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు. గులాబి, నిన్నే పెళ్లాడతా, జయం మనదేరా, చందమామ , కొత్తబంగారు లోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్,  క్యారక్టర్ ఆర్టిస్ట్, హస్య నటుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 2002, 2007 సంవత్సరాల్లో ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఇండస్ర్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్ ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 122 సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటించారు. తెలుగులో 120, రెండు తమిళ చిత్రాలు చేశారు. ‘చందమామ’ చిత్రానికి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డులు అందుకున్నారు.

  4.       Gopika Poornima   : అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో పాట పాడిన సింగర్ గోపికా పూర్ణిమ కేవలం గాయనిగానే కాకుండా తెలుగులో మనీషా కొయిరాల, అమీషా పటేల్, శ్రియా,సదా లాంటి హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పిన గోపికా పూర్ణిమ పుట్టిన రోజు నేడు. జనవరి 2, 1982లో విజయనగరంలో జన్మించారు. పూర్ణిమ తొమ్మిదో తరగతిలోనే పాడుతా తీయగా అనే సింగింగ్ ప్రోగ్రాoలో పాల్గొని గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సింగన్న సినిమాలోని అన్న వెంట నేనే ఉంటా పాటతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.ప్రాణం చిత్రంలోని నిండు నూరేళ్ళ సావాసం,జల్సా లోని గాల్లో తేలినట్టుందే డమరుకంలోని లాలి పాట గోపికా పూర్ణిమకు మంచి పేరు తీసుకొచ్చాయి.ఈవిడ తెలుగు తమిళ కన్నడ భాషల్లో 500కు సినిమా పాటలు పాడారు అలాగే భక్తీ గీతాలు 300 వరకు పాడారు.   

  5.    Kirti Azad    : కీర్తి ఆజాద్ మాజీ ఇండియన్ క్రికెటర్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1959 జనవరి 2న ఆయన బిహార్‌లోని పూర్ణియాలో జన్మించారు, పూర్తి పేరు కీర్తి వర్ధన్ భగవత్ ఝా ఆజాద్. 1981లో న్యూజీలాండ్ తో వెల్లింగ్టన్ లో తన తొలి టెస్ట్ ను ఆడారు తన కెరీర్లో మొత్తం 7 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 135రన్స్, 3వికెట్స్ తీసాడు తన బెస్ట్ బౌలింగ్ 2/84గా నిలిచింది. అలాగే తన మొదటి వన్ మ్యాచ్ 1980లో ఆస్ట్రేలియా తో ఆడాడు కీర్తి ఆజాద్ తన కెరీర్లో మొత్తం 25 వన్డే మ్యాచ్ లు ఆడి, 269పరుగులు చేసి, 7వికెట్స్ తీసాడు. తన బెస్ట్ బౌలింగ్ 2/48గా నిలిచింది. 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.  2014 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. అంతకుముందు ఢిల్లీలోని గోలే మార్కెట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

  6.       Shanthi Krishna  :  శాంతి కృష్ణ ప్రముఖ భారతీయ నటి, డాన్సర్ నేడు ఆవిడ పుట్టినరోజు.  జనవరి2, 1962లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. శాంతి కృష్ణ తన మొదటి సినిమా 1981లో నిద్ర అనే మలయాళ సినిమాతో పరిచయమయ్యారు. ఆ తర్వాత తరట్టు, చిల్లు, వీసా, హిమవహిని, సవిధం, నజందుకలుదే నట్టిల్ ఒరిడవేల, ఏప్రిల్ 19, మజ్హయతు, అతిరన్, శుభరాత్రి, లాంటి సినిమాల్లో నటించారు. తమిళ్ లో 1981లో వచ్చిన సివప్పు మల్లి సినేమాతో పరిచయమై, చిన్న ముళ్ పెరియ ముళ్, అన్బుల మలరే, నేర్రుక్కు నేర్, హేమవిన్ కధలర్గల్ లాంటి సినిమాల్లో నటించింది. ఈవిడకి 2017లో వచ్చిన నజందుకలుదే నట్టిల్ ఒరిడవేల సినిమాకి అనేక అవార్డ్స్ వచ్చాయి అలాగే 1992లో వచ్చిన సవిధం సినిమాకి సెకండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, 1994లో వచ్చిన చకోరం సినేమాక్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చాయి. ఈవిడ తెలుగులో ప్రియురాలు అనే సినిమా చేసింది. శాంతి కృష్ణ తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 75సినిమాల్లో నటించారు. 

 ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!