-0.7 C
New York
Wednesday, January 26, 2022

Famous Celebrities Birthdays on Jan 06 || A R Rahman || Hebah Patel || Shri Tv Wishes

Famous Celebrities Birthdays on Jan 06 || A R Rahman || Hebah Patel || Shri Tv Wishes

జనవరి 6 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     A. R. Rahman    : ఎ.ఆర్.రెహమాన్‌ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఆయన పుట్టినరోజు. రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ తన కెరీర్ స్టార్ట్ చేసాడు. తన తొలి చిత్రం రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా దక్కింది. హిందీలో రంగీలా, తాళ్, స్వదేశ్, లగాన్, రంగ్ దే బసంతి,గురు,జోదా అక్బర్,గజినీ,రోబో,నాయక్ బాయ్స్ లాంటి సినిమాలు తెలుగులో గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, రక్షకుడు, నీ మనసు నాకు తెలుసు, నానీ, పులి లాంటి సినిమాలలో పాటలతో ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆరు జాతీయ అవార్డులు, రెండు ఆస్కార్‌ అవార్డులు, రెండు గ్రామీలు, బాఫ్తా, గోల్డెన్‌గ్లోబ్, 15 ఫిలింఫేర్, 17 ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డులు ఆయన దగ్గర చేరి మురిసిపోయాయి. 2005 లో టైం మ్యాగజీన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్ లో రోజా చిత్రంలోని పాట కూడా ఉంది. 2010 భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.  రెహమాన్ గౌరవార్ధం కెనడా లోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు.

  2.    Rowan Atkinson  : మిస్టర్‌ బీన్‌ అనేది ఓ పాత్ర పేరనీ, ఆ పాత్రలో గుర్తుండిపోయిన నటుడి పేరు అట్కిన్‌సన్‌ అనీ చాలా మందికి తెలియదు. అలా తన పేరు కన్నా, తన పాత్ర పేరుతో ప్రసిద్ధుడైన నటుడు రోవన్‌ అట్కిన్‌సన్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1955 జనవరి 6న జన్మించారు, పూర్తీ పేరు రోవన్‌ సెబాస్టియన్‌ అట్కిన్‌సన్, ఎలక్టిక్రల్‌ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ చేశాడు. చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో కలిసి హాస్య భరితమైన స్కిట్లు, నాటికలు, లాంటివి వేడుకల్లో, రేడియోల్లో, టీవీల్లో ప్రదర్శించేవాడు. బీబీసీ టీవీలో ‘నాట్‌ ద నైనోక్లాక్‌ న్యూస్‌’, ‘ద బ్లాక్‌ యాడర్‌’ పేరిట ప్రసారమైన కామెడీ షోస్ తో మంచి పేరు వచ్చింది. అతడికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు తెచ్చిన ‘మిస్టర్‌ బీన్‌’ తొలిసారిగా 1990లో టీవీలో ప్రసారమై ఏళ్ల తరబడి కొనసాగింది. ఇదే పేరుతో వచ్చిన హాలీవుడ్‌ సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ అందుకున్న ఇంగ్లిష్‌ నటుడు. ‘ప్రపంచంలోని మేటి 50 మంది హాస్యనటుల జాబితా’లో ఒకడుగా గుర్తింపు పొందాడు. బాఫ్తా, ఆలివర్, బ్రిటిష్‌ అకాడమీ, బీబీసీ పెర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నాడు.

  3.    Eddie Redmayne    : ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు, ఆయన జీవిత కథతో వచ్చిన ‘ద థీరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ సినిమాలో ఆయన పాత్రలో జీవించిన నటుడు ఎడ్డీ రెడ్‌మేనే ఈరోజు ఆయన పుట్టిన రోజు. లండన్‌లో 1982 జనవరి 6న పుట్టిన ఇతగాడు నాటకాల ద్వారా మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చాడు ‘రెడ్‌’, ‘లైక్‌మైండ్స్‌’,  ‘ద గుడ్‌ షెపర్డ్‌’, ‘మై వీక్‌ విత్‌ మార్లిన్‌’, ‘లెస్‌ మిజరబుల్స్‌’, ‘ద డానిష్‌ గర్ల్‌’, ‘ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌’ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ద థీరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌’ సినిమాలో స్టీఫెన్‌ హాకింగ్‌ పాత్రకుగాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు. ఇంగ్లిష్‌ నటుడైన ఇతడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌’ పురస్కారాన్ని పొందాడు.

  4.    Hebah Patel    : హెబ్బ పటేల్ ప్రముఖ నటి మోడల్ నేడు ఆయన పుట్టినరోజు. హెబ్బ పటేల్ జనవరి6, 1989లో ముంబైలో జన్మించారు. ఈవిడ మొదట 2014లో వచ్చిన కన్నడ సినిమా అద్యక్ష సినిమాతో పరిచయమయ్యింది. ఆ తర్వాత 2014లో వచ్చిన తమిళ సినిమా తిరుమనం ఎనుం నిక్క సినిమాతో తమిళ్ లో పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగులో  2014లో అలా ఎలా సినిమాతో పరిచయమై కుమారి 21F, ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24కిస్సేస్, భీష్మ సినిమాల్లో నటించింది. కుమారి 21F సినిమాకు గానూ ఉత్తమ నూతన నటిగా సంతోషం ఫిల్మ్ అవార్డు అందుకుంది.

  5.    Vandemataram Srinivas  : వందేమాతరం శ్రీనివాస్ తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు, గీత రచయిత ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈయన ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. .టి.కృష్ణ వందేమాతరం సినిమాలో ‘వందేమాతర గీతం వరసమారుతున్నది’ అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు ఆ సినిమా పాటే ఆయన ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి ఆయుధం, ఎర్రసైన్యం, దండోరా, లాలసలాం, అడవి, దివిటీలు, ఎర్రోడు, తెలుగోడు, అరణ్యం, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మా, దేవుళ్ళు, రౌడీ దర్బార్, ఎన్ కౌంటర్, పెళ్లిపందిరి, స్వయంవరం, భారతరత్న, అడవి చుక్క, ముత్యం, మిస్సమ్మ, హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌ సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు,ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు  విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన పాటలకు సంగీతం అందించాడు.

  6.    Loretta Young    :  లొరెట్టా యంగ్‌ ప్రముఖ హాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు.  1913 జనవరి 6న పుట్టిన లొరెట్టా యంగ్, రెండేళ్లకే మూకీ చిత్రాల్లో బాలనటిగా ప్రస్థానం ప్రారంభించింది. ఆ తర్వాత బోర్న్ టు బి బాడ్, కారవాన్, షాంగై, ద కాల్ ఆఫ్ ద వైల్డ్, ప్రైవేట్ నెంబర్, రమోన, లేడీస్ ఇన్ లవ్, లవ్ ఇజ్ న్యూస్, సెకండ్ హనీమూన్, సుఎజ్, బెడ్ టైం స్టొరీ, ఎటర్నల్లీ యువర్స్ ,ద పర్ఫెక్ట్ మ్యారేజ్ లాంటి సినిమాలలో నటించింది. 1947లో వచ్చిన  ‘ద ఫార్మర్స్‌ డాæర్‌’ సినిమాతో ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. టీవీల్లో ‘లొరెట్టా యంగ్‌ షో’ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు  

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!