2.1 C
New York
Tuesday, January 18, 2022

Famous Celebrities Birthdays on Jan 08 || Harris Jayaraj || Yash || Shri Tv Wishes

Famous Celebrities Birthdays on Jan 08 || Harris Jayaraj || Yash || Shri Tv Wishes

జనవరి 8 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 
హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Tarun Kumar   : తరుణ్  తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న హీరో ఈరోజు ఆయన పుట్టిన రోజు. నటుడు చక్రపాణి, నటి రోజారమణిల తనయుడైన తరుణ్‌ 8 జనవరి 1983న చెన్నైలో జన్మించారు. తొలి చిత్రం ‘మనసు మమత’తో ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ఆ తరువాత ‘బుజ్జిగాడి బాబాయ్‌’, ‘అంజలి’, ‘దళపతి’, ‘సూర్య ఐపీఎస్‌’, ‘పిల్లలు దిద్దిన కాపురం’, ‘ఆదిత్య 369’ తదితర చిత్రాల్లోనూ నటించి బాలనటుడిగా చక్కటి నటన ప్రదర్శించారు.‘అంజలి’తో ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డు అందుకొన్నారు. మలయాళంలో ‘అభయం’, ‘మై డియర్‌ ముత్తచ్చన్‌’, ‘జానీ’ తదితర చిత్రాలు చేసి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకొన్నారు. ‘వజ్రం’లో చిన్నప్పటి నాగార్జునగా కనిపించిన తరుణ్, ఆ చిత్రం కొన్నాళ్లు సినిమాలకి దూరమయ్యారు. మళ్లీ ‘నువ్వే కావాలి’తో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’, ‘అంకుల్‌’, ‘చిరుజల్లు’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘సఖియా’, ‘సోగ్గాడు’, ‘ఒక ఊరిలో’, ‘నవవసంతం’, ‘భలే దొంగలు’, ‘శశిరేఖా పరిణయం’, ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’, ‘యుద్ధం’, ‘వేట’, ‘ఇది నా లవ్‌స్టోరీ’ తదితర చిత్రాలతో ఆయనకి యువతరంలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. సినిమాలతో పాటు, క్రికెట్‌పైన కూడా మక్కువ ప్రదర్శించే తరుణ్‌ సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో ఆడుతూ మైదానంలోనూ మెరిశారు.

  2.       Yash      : మీకు కె జి ఎఫ్ సినిమా గుర్తుందా అందులో రాకీ భాయ్ గుర్తున్నడా KGF సినిమాతో దేశ వ్యాప్తంగా యెనలేని క్రేజ్ తెచ్చుకున్న కన్నడ హీరో యష్ పుట్టిన రోజు నేడు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ ఈయన జనవరి8,1986లో కర్ణాటక లో జన్మించారు. యష్ తన యాక్టింగ్ కెరీర్ ని నంద గోకుల అనే టీవీ సిరియల్ తో స్టార్ట్ చేసారు. ఆ తర్వాత సిల్లి లల్లి, శివ, ప్రీతీ ఇల్లాద మేలే, మాలే బిల్లు, లాంటి టీవీ సీరియల్స్ లో నటించారు.  2008లో మొగ్గిన మనసు సినిమాతో బుల్లితెర నుండి వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాకీ, కళ్లారా సంతే, గోకుల, తమస్సు, మొదలాసాల, రాజధాని, గూగ్లీ, కిరాతక, లక్కీ, జానూ, MR. అండ్ మిస్సెస్ రామాచారి. చంద్ర,  గజకేసరి,  మాస్టర్ పిస్, సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, కె జి ఎఫ్ లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరో అయ్యాడు. యష్ మొగ్గిన మనసు సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్, MR. అండ్ మిస్సెస్ రామాచారి సినిమాకి SIIMA అవార్డు, IIFAఉత్సవం అవార్డు, మాస్టర్ పిస్ సినిమాకి జీ కన్నడ దశకదసంభారం అవార్డు, గెలుచుకున్నారు. యష్ కె జి ఎఫ్ సినిమాకి దాదాపు 10 అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం.

  3.    Harris Jayaraj  : వాసు, ఘర్షణ, మున్నా, గజినీ, ఆరంజ్, చెలి, రంగం,అపరిచితుడు, సూర్య S/O కృష్ణన్ ఈ సినిమాల పేర్లు చెపితే వెంటనే గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ నేడు ఆయన పుట్టినరోజు. జయరాజ్ జనవరి8, 1975లో తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఈయన మొదట ఎ అర్ రెహమాన్, మణిశర్మ, రాజ్ కోటి, విద్యాసాగర్, యువన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద పనిచేసాడు. ఆ తర్వాత 2001లో వచ్చిన మిన్నలే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పర్చయంయ్యాడు. ఈ సినిమాలో పాటలు పెద్ద హిట్ అవ్వడంతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత సమురాయ్, లెస లెస, సామి, కాఖ కాఖ, ఆరుళ్, గజినీ, అన్నియన్, భీమా, ధాం  ధూమ్, వారణం ఆయిరం, ఆదవన్, తుపాకి, ఇరందాం ఉలాగం, సినిమాలకి మ్యూజిక్ కంపోస్ చేసారు. తెలుగులో వాసు, ఘర్షణ, మున్నా, ఆరంజ్, సైనికుడు, స్పైడర్ సినిమాలకు మ్యూజిక్ చేసారు. ఈయనకు 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 3తమిళ నాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 5విజయ అవార్డ్స్, 3విజయ మ్యూజిక్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.   

  4.     Nanda    : నందా అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. నందా బొంబాయిలో 1941 జనవరి 8న పుట్టింది తండ్రి మాస్టర్‌ వినాయక్‌ సినిమా నటుడు. తల్లి సుశీల. ఆమెకు ఏడేళ్ల వయసులో తండ్రి ప్రోద్బలంతో ‘మందిర్‌’ (1948) అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. తరవాత జగదీశ్‌ సేథి దర్శకత్వం వహించిన ‘జగ్గు’ (1952) సినిమాలో నందా నటించింది అప్పుడు ఆమెకు పదకొండేళ్లు మాత్రమే. ‘తూఫాన్‌ అవుర్‌ దీయా’ ‘భాభి’ఎన్‌ తంగై’,  ‘చోటి బహెన్‌’, ఆంచల్‌’, ‘హమ్‌ దోనో’, ‘తీన్‌ దేవియా’ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది ఇక ఆ తరువాత నందా హీరోయిన్‌గా వెనక్కి చూసుకోలేదు ‘చార్‌ దివారి’, ‘మెహంది లాగి మేరె హాత్‌’ , ‘జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే’, ‘మోహబ్బత్‌ ఇస్‌ కో కెహతే హై’, ‘నీంద్‌ హమారీ క్వాబ్‌ తుమ్హారే’,  ‘జువారి’,  ‘రాజా సాబ్‌’,  ‘రూఠా నా కరో’ ‘గుమ్‌ నామ్’, ‘బడీ దీది’‘ఇత్తేఫాఖ్‌’, ‘కానూన్‌’, ‘ది ట్రెయిన్‌’, ‘జోరూ కా గులామ్’, నయా నషా‘ఆహిస్తా ఆహిస్తా’, ప్రేమ్‌ రోగ్‌’మజదూర్‌’ లాంటి సినిమాల్లో బాలీవుడ్ తెరపై నటిగా చెరగని ముద్ర వేసింది. నందా తన కెరీర్లో ఐదుసార్లు ఫిల్మ్ ఫేర్ కు నామినేట్ అయ్యింది ‘ఆంచల్’ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

  5.    Nusrat Jahan Ruhi   :  నుస్రత్ జహాన్ రుహి ప్రముఖ బెంగాలి నటి నేడు ఆవిడ పుట్టినరోజు. రుహి జనవరి8, 1990లో వెస్ట్ బెంగాల్ లోని కొలకత్తాలో జన్మించారు. ఈవిడ 2010లో ఈవిడ 2010లో మిస్ కొలకత్తా అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత 2011లో తన ఓడాటీ౮ సినిమా శోత్రు తో పరిచయమై ఖొక 420, ఖిలాడి, యాక్షన్, యోద్ధ: ద వారియర్, పవర్, కేలోర్ కీర్తి, లవ్ ఎక్ష్ప్రెస్స్, వన్, ఉమా, అసుర్, లాంటి సినిమాల్లో నటించింది. ఈవిడ తన కెరీర్లో మొత్తం 20 సినిమాల్లో నటించింది.

  6.    Ashapurna Devi   :      ఆశాపూర్ణా దేవి ప్రముఖ బెంగాలీ నవలా రచయిత, కవయిత్రి, ఈరోజు ఆవిడ పుట్టిన రోజు.  ఆమె జనవరి 8 1909న జన్మించారు ఆశాపూర్ణాదేవి 1909, జనవరి 8న కలకత్తాలో జన్మించారు, అసలు పేరు అషా పూర్ణ దేవి. ఆవిడ రాసిన పత్ని ఓ ప్రేయోషి, ప్రాతం ప్రతిశ్రుతి,సుబర్నోలత,బకుల్ కథ లాంటి రచనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నవలా రచయితగా, లఘు కథా రచయితగా చేసిన కృషికి 1994 లో సాహిత్య అకాడమీ ఆమెను ఉన్నతమైన పురస్కారమైన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ను యిచ్చి సత్కరించింది. 1976లో జ్ఞానపీఠ అవార్డు, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్దు అందుకున్నారు. జబల్‌పూర్ విశ్వవిద్యాలయం, రవీంద్రభారతి, బృందావన్, జదవ్‌పూర్ విశ్వవిద్యాలయములందు డి.లిట్ ను పొందారు.1989 లో విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆమెను “దేశికోత్తమ” అనే బిరుదుతో గౌరవించింది. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,119FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!