-1.1 C
New York
Monday, January 24, 2022

Famous Celebrities Birthdays on Jan 10 || Hrithik Roshan || Allu Aravind || Shri Tv Wishes

Famous Celebrities Birthdays on Jan 10 || Hrithik Roshan || Allu Aravind || Shri Tv Wishes

జనవరి 10 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Hrithik Roshan: అతడి డ్యాన్స్‌ లో మెరుపుల విన్యాసాలు కనిపిస్తాయి… నటనలో యువతరం గుండె స్పందన కనిపిస్తుంది… అతడే బాలీవుడ్‌ అందాల కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు. హృతిక్‌ రోషన్‌ 1974 జనవరి 10న ముంబయిలో జన్మించాడు. తండ్రి రాకేష్‌ రోషన్‌ బాలీవుడ్‌ నటుడు, తల్లి పింకీ రోషన్‌ హృతిక్‌ వాళ్లది సినీ నేపథ్యమున్న కుటుంబం. రేళ్ల వయసులో ‘ఆశా’ (1980) చిత్రంతో తొలిసారి బాలీవుడ్‌లోకి బాలనటుడిగా అడుగుపెట్టాడు. తన తాత ఓం ప్రకాశ్‌ తీసిన ఈ సినిమాలో ఓపాటలో చిన్న డ్యాన్స్‌ చేశాడు హృతిక్‌. హృతిక్‌ సినిమాల్లోకి రావడానికి ముందు కొంతకాలం తండ్రి   రాకేష్‌ దర్శకత్వం వహించిన ‘కింగ్‌ అంకుల్‌’(1993), ‘కరణ్‌ అర్జున్‌’ (1995), ‘కోయల్‌’ (1997) సినిమాలకు హృతిక్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2000లో ‘కహో నా ప్యార్‌ హై’తో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సంచలన విజయంతో హృతిక్‌ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ‘ఫిజా’ (2001), ‘కభి ఖుషి ఖభీ గమ్‌,  ‘కోయి.. మిల్‌ గయా’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘క్రిష్‌’, ‘క్రిష్‌2’, ‘క్రిష్‌3’ సినిమాలతో ప్రపంచానికి సరికొత్త సూపర్‌ హీరోను పరిచయం చేశాడు హృతిక్‌ రోషన్‌. ‘ధూమ్‌ 2’, జోదా అక్బర్‌ ‘గుజారిష్‌’, జిందగి నా మిలేగి దోబారా’, ‘అగ్నిపథ్‌’, ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, మొహింజదారో, కాబిల్, సూపర్ 30, వార్ సినిమాలతో బాలీవుడ్ లో తిరుగులేని సక్సెస్ ఫుల్ హీరో అయ్యాడు. హృతిక్‌ రోషన్‌ తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు 6 ఫిలింఫేర్‌ అవార్డులతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. భారత్‌లోని అత్యంత ప్రభావవంతమైన ఫోర్బ్స్ వందమంది ప్రముఖుల జాబితాలో హృతిక్‌ ఒకరు.

  2.    K. J. Yesudas    : గళంలో మార్దవం… గొంతులో గమకం… గానంలో మాధుర్యం… ఇదీ సంగీత ప్రపంచంలో కట్టస్సరి జోసెఫ్‌ ఏసుదాస్‌ సంతకం సంప్రదాయ, భక్తి, సినీ గీతాలను 80,000కు పైగా ఆలపించిన ఆయన పాడిన పాటల్లో ఏ భాషా గీతాన్ని విన్నా ఆ గొంతులోని తీయందనం శ్రోతలను కట్టి పడేస్తుంది ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1961 నవంబర్‌ 14న మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగిడి అనేక భాషల్లో పాటలు పాదారు. తెలుగులో ‘బంగారు తిమ్మరాజు’ సినిమాలో మొదటిసారి పాట పాడారు ఏసుదాసు అదే ఆయన తొలి తెలుగు సినిమా పాట ఆ తర్వాత ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ పాటతో బాగా పాపులర్ అయ్యారు. తెలుగులో ఆయన పాడిన పాటల్లో ‘గాలి వానలో వాన నీటిలో’ (స్వయం వరం), ‘కుంతీ కుమారి తన కాలుజారి’ (కుంతీపుత్రుడు), ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ (అంతులేని కథ), ‘చుక్కల్లే తోచావే’ (నిరీక్షణ), ‘సృష్టి కర్త బ్రహ్మ’ (అమ్మా రాజీనామా), ‘ఆకాశ దేశాన ఆషాడ మసాన’ (మేఘసందేశం),  ‘దారి చూపిన దేవత, అందమైన వెన్నెలలోన లాంటి పాటలు క్లాసిక్స్ గా నిలిచాయి. ఆ తర్వాత హిందీలోకి వెళ్ళి  ‘ఆనంద్‌ మహల్‌’ సినిమాలో ‘జానేమన్‌’ పాటతో పాపులర్‌ అయ్యారు.  మొత్తంగా ఏడు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. మొట్టమొదటి జాతీయ అవార్డు (1972) ‘అచనమ్‌ బప్పాయం’ అనే మలయాళీ సినిమాకు దక్కడం విశేషం. తెలుగులో ‘మేఘ సందేశం’గాను 1985లో జాతీయ అవార్డు వచ్చింది.  మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, అరబిక్, ఇంగ్లిష్, లాటిన్, రష్యన్‌ భాషల్లో పాడిన ఏసుదాస్‌ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారం సహా ఎనిమిది జాతీయ అవార్డులు, అయిదు ఫిలింఫేర్‌లు, 43 రాష్ట్ర అవార్డులు గెలుచుకున్నారు.

  3.    Allu Aravind    : గీతా ఆర్ట్స్‌ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో చిత్రాల్ని రూపొందించిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఆయన. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా పరిశ్రమకి పరిచయమైన అల్లు అరవింద్‌… ఆ తరువాత నిర్మాతగా పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. 1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకి జన్మించిన అల్లు అరవింద్‌ తొలినాళ్లలో నటుడిగా తెరపై మెరిశారు. ‘హీరో’, ‘మహానగరంలో మాయగాడు’, ‘చంటబ్బాయ్‌’ తదితర చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఆయన ఆ తరువాత గీతా ఆర్ట్స్‌ సంస్థని స్థాపించి చిరంజీవి హీరోగా విజేత, ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘మాస్టర్‌’, ‘ఇద్దరు మిత్రులు’, ‘అన్నయ్య’ తదితర చిత్రాల్ని నిర్మించి విజయాల్ని అందుకొన్నారు. తనయుడు అల్లు అర్జున్‌ను ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘మగధీర’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచారు. హిందీలో ఆమిర్‌ ఖాన్‌తో ‘గజిని’ చిత్రాన్ని రీమేక్‌ చేసి రూ:100 కోట్ల వసూళ్లు ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘జల్సా’ని నిర్మించి తెలుగు ఇండస్ట్రీకి 1000 థియేటర్లలో విడుదల ట్రెండ్‌ని పరిచయం చేసారు. 100% లవ్, బద్రినాథ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, సరైనోడు, ధ్రువ, గీత గోవిందం, ప్రతి రోజు పండగే లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు.

  4.    Kalki Koechlin    : కల్కి కొచ్చిన్‌ డిఫరెంట్ సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. ఊటీ దగ్గర్లోని కలాట్టి గ్రామంలో 1984లో జనవరి 10న పాండిచ్చేరిలో జన్మించింది. ‘దేవ్‌ డి’ (2009) సినిమాతో బాలీవుడ్‌ రంగప్రవేశం చేసి, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘ఏ జవానీ హై దివానీ’, ‘షాంఘై’, ‘ఏక్‌ థీ దాయన్‌’, ‘వెయిటింగ్‌’, సైతాన్‌’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘దట్‌ గర్ల్‌ ఇన్‌ యెల్లో బూట్స్‌’, ‘మై ఫ్రెండ్‌ పింటో’, ‘ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌’, ‘త్రిష్ణ’, ‘షాంఘై’, ‘ఏక్‌ ది దయాన్‌’, ‘యే జవానీ హై దివానీ’, ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘మార్గిరిటా ఎ స్ట్రా’, ‘జియా ఔర్‌ జియా’, ‘సెవెరింగ్‌ టైస్‌’ ‘రిబ్బన్‌’, ‘స్కాలర్‌ షిప్‌’, ‘గల్లీభాయ్‌’, ‘హాథీ మేరా సాథీ’ సినిమాలతో పాటు ‘అజ్మాఇష్‌: ఏ జర్నీ త్రో ది సబ్‌కాంటినెంట్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో నటించింది. ‘సైతాన్‌’లో నటన విమర్శకుల్ని మెప్పించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా ‘కల్కి గ్రేట్‌ ఎస్కేప్‌’, ‘షాకర్స్‌’, ‘స్కోమ్‌’ అనే టీవీ షోస్ లలో కూడా కనిపించింది. బాలీవుడ్‌ వెండితెరపై మెరవడమే కాదు జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు పొందింది. ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ‘నైట్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ఆర్‌ట్స్ర్‌’ గౌరవ పురస్కారం అందుకుంది. చిన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకుని లండన్‌ విశ్వవిద్యాలయంలో నటనకు సంబంధించిన కోర్స్‌ చేసింది. స్కీన్ర్‌ ప్లే రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకుంది.

  5.    Aishwarya Rajesh : కాక ముట్టైయ్ లాంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్‌ ప్రముఖ తమిళ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. ఈవిడ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే వచ్చిoది  ఆమె తండ్రి రాజేశ్‌ అప్పట్లో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు. ఈవిడ 1996లో వచ్చిన తెలుగు సినిమా రాంబంటు లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత 2010లో నీతన అవన్ అనే తమిళ సినిమాతో పరిచయమై ఉయర్తిరు420, సట్టపడి కుట్రం, అత్తకత్తి, ధర్మమురై, సఖావు, వడ చెన్నై, కనా, నమ్మ వీట్టు పిళ్ళై, కట్టప్పవ కానోం, లక్ష్మి, సామి 2 లాంటి సినిమాలు చేసింది. ఈవిడ తెలుగులో కౌసల్య కృష్ణముర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటంచింది. ఐశ్వర్య మలయాళం లో జోమొంటే సువిశిశంగల్, సఖ్హవు, లాంటి సినిమాల్లో నటించింది.    అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేశ్‌ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఈవిడకు కాక ముట్టైయ్ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు,  ధర్మమురై సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, వడ చెన్నై, కనా, నమ్మ వీట్టు పిళ్ళై సినిమాలకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ వచ్చాయి. ఐశ్వర్య రాజేష్ తన కెరీర్లో మొత్తం 41 సినిమాల్లో నటించింది.

  6.    Basu Chatterjee   : బసు చటర్జీ అలనాటి బాలీవుడ్ దర్శకుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన అనేక సినిమాలు తీశారు. 70లో అమితాబ్ బచ్చన్‌తో మంజిల్, రాజేశ్ ఖన్నాతో చక్రవ్యూహ్, దేవానంద్‌తో తీసిన మన్ పసంద్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అనేక టీవీ సీరియళ్లకు కథ, మాటలు సమకూర్చారు. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు చటర్జీ తనదైన ముద్ర వేసుకున్నారు. దూరదర్శన్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన బ్యోంకేశ్ బక్షి, రజని బసు చటర్జీ డైరెక్ట్ చేసినవే. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. బసు చటర్జీ సామాజిక అంశాల ఆధారంగా డైరెక్ట్ చేసిన ఏక్ రుకా హువా ఫైసలా, కమలా కీ మౌత్ లాంటి సినిమాలు ఆయన అభిరుచికి, మనసుకు అద్దం పట్టాయి.చోటి సి బాత్, ఉస్ పార్, చిచోర్, రజనిగంధ, పియా కా ఘర్, ఖట్టా మీటా, చక్రవ్యూహా, బాతో బాతో మే, ప్రియతమ, మన్ పసంద్, హమారి బహు అల్క, శౌకీన్, చమేలీ కీ శాదీ, ఏక్ రుకా హువా ఫైసలా, కమలా కీ మౌత్ లాంటి చిత్రాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 1992లో బసు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!